Ballistic Missile: ఉక్రెయిన్‌పైకి ఖండాంతర క్షిపణి.. ఇదే తొలిసారి..!
యుద్ధంలో ఎన్నడూలేని విధంగా తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉక్రెయిన్ భూతలం మీదకు రష్యా ప్రయోగించింది. అభివృద్ధిచేశాక పరీక్ష కోసం పలుదేశాలు ఎన్నోసార్లు ఈ రకం క్షిపణులను ప్రయోగించినా యుద్ధంలో వినియోగించడం మాత్రం ఇదే తొలిసారి. మధ్యతూర్పు ఉక్రెయిన్‌లోని డినిప్రో నగరంపైకి నవంబర్ 20వ తేదీ రాత్రి ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్(ఐసీబీఎం) వచ్చి పడిందని ఉక్రెయిన్ టెలిగ్రామ్ మెసెంజింగ్ యాప్‌లో ప్రకటించింది.
వేయి కిలోమీటర్ల దూరంలో రష్యాలో కాస్పియన్ సముద్రతీర ఆస్ట్రాఖన్ ప్రాంతం నుంచి అది దూసుకొచ్చిందని ఉక్రెయిన్ వాయుసేన పేర్కొంది. అయితే ఆ క్షిపణి సృష్టించిన విధ్వంసం, జరిగిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలను ఉక్రెయిన్ వెల్లడించలేదు.
LignoSat: ప్రపంచంలో తొలిసారి.. నింగిలోకి దూసుకెళ్లిన కలప ఉపగ్రహం
‘ఐసీబీఎంతోపాటు కింజార్ హైపర్‌సోనిక్ క్షిపణి, ఏడు కేహెచ్–101 క్రూజ్ క్షిపణులు వచ్చిపడ్డాయి. వీటిలో ఆరింటిని గాల్లోనే ధ్వంసంచేశాం. ఈ దాడిలో ఇద్దరు ఉక్రేనియన్లు గాయపడ్డారు. ఒక కర్మాగారం దెబ్బతింది. వికలాంగుల కోసం ఏర్పాటుచేసిన పునరావాసన శిబిరం నాశనమైంది’ అని స్థానిక యంత్రాంగం పేర్కొంది.
అయితే.. ఆర్‌ఎస్–26 రూబెజ్ రకం ఐసీబీఎంను రష్యా ప్రయోగించి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్‌ఎస్–26 క్షిపణి ఏకంగా 800 కేజీల మందుగుండును మోసుకెళ్లగలదు. 5,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు. ఈ క్షిపణితోపాటు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ–ఎంట్రీ వెహికల్స్(ఎంఐఆర్‌వీ) సాంకేతికతనూ రష్యా వాడినట్లు తెలుస్తోంది. యుద్ధంలో ఎంఐఆర్‌వీ టెక్నాలజీని వాడటం ఇదే తొలిసారి.
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి వెయ్యి రోజులు