BEL Job Notification : బెల్‌లో 40,000 జీతంతో జాబ్ నోటిఫికేషన్.. అర్హులు వీరే..!

పోస్టుల వివరాలు: ప్రొబేషనరీ ఇంజినీర్ ఎలాక్ట్రానిక్స్ 200, మెకానికల్ 150 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాల్లో అన్‌రిజర్వుడ్‌లకు 143 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌లకు 35, ఓబీసీ (ఎన్‌సీఎల్)కు 94, ఎస్సీలకు 52, ఎస్టీలకు 26 కేటాయించారు.
వయో పరిమితి: 01.01.2025 నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ (ఎన్‌సీఎల్), మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంది.
అర్హతలు : కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ మెకానికల్ బ్రాంచ్‌లతో పాటు బీఈ/ బీటెక్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ బీఎస్సీ కోర్సుల్లో ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు పాసైతే సరిపోతుంది.
ఇవే బ్రాంచిలతో జీఐఈటీఈ/ ఏఎంఐఈ/ ఏఎంఐఈటీఈ పూర్తిచేసిన అభ్యర్థులు, బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారూ అర్హులే.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షకు (సీబీటీ) ఎంపిక చేస్తారు. దీంట్లో జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌లు 35 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు 30 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి. వీరిని 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతంగా విభజించి దాని ప్రకారం పరీక్ష నిర్వహిస్తారు.
125 ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. టెక్నికల్ ప్రశ్నలు 100, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2025
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లా
నోటిఫికేషన్, మరిన్ని వివరాల కోసం బెల్ అధికారిక వెబ్‌సైట్ https://bel-india.in ను సంప్రదించవచ్చు.
జీతం వివరాలు: నెలకు రూ.40,000-1,40,000. మూల వేతనంతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, కన్వీయన్స్ అలవెన్స్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, మెడికల్ రీఎంబర్స్‌మెంట్ సదుపాయాలూ ఉంటాయి.
దరఖాస్తుల విధానం: ఆన్‌లైన్‌లో..
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Jobs 2025
- bel recruitments
- latest recruitments 2025
- 40 thousand salary jobs
- bel jobs for unemployees
- interview for bel jobs
- online applications for bel vacancies
- BEL Job Notification 2025
- january job notifications 2025
- job notifications 2025
- deadline for bel applications
- bel jobs 2025
- Probationary Engineer Electronics
- 700 jobs in bel
- Bharath Electronics Limited
- Bharath Electronics Limited Jobs
- 700 Posts at Bharath Electronics Limited
- 700 posts with 40 thousand salary at Bharath Electronics Limited
- Education News
- Sakshi Education News