TCS, Infosys: వర్క్ ఫ్రం హోంకు బైబై.. ఆఫీస్‌కు రాని వారిని తొలగించాలని నిర్ణయం... 10 లక్షల మందిపై ప్రభావం..!
ఉద్యోగులకు అనుకూలంగా హైబ్రిడ్ విధానాన్ని ఇన్నిరోజులు అమలు చేశాయి. ఇలా కూడా ఆఫీస్‌కు రావడానికి అనేకమంది ఉద్యోగులు మొగ్గుచూపట్లేదు. ఇంటి నుంచి పని చేయడానికే వారు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో విసుగెత్తిన కంపెనీలు వారిని తొలగించేందుకు సైతం సిద్ధపడుతున్నాయి.
తాజాగా విడుదలైన ఓ నివేదన ప్రకారం దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులపై కఠిన వైఖరి అవలంబించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ రెండు కంపెనీలలో సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి నెలకు 12 రోజులపాటు ఆఫీస్‌కు రావాలని ఇదివరకే తమ ఉద్యోగులకు మెయిల్స్ పంపాయి. ఈ నిర్ణయాన్ని ఫాలోకాని ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీలు సిద్ధమైనట్లు నివేదిక తెలిపింది. మరికొంతమంది శాలరీల్లో కోతలు విధించేందుకు ఆలోచిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఇవీ చదవండి: వీటిల్లో చేరితే ఉద్యోగం గ్యారంటీ..!
ఈ రెండు కంపెనీలు.. వర్క్ టు ఆఫీస్‌ను తప్పనిసరిగా ఫాలో అయ్యే ఉద్యోగులనే ఉంచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ US, కెనడాలోని ఉద్యోగులను తిరిగి రావాలని సూచించింది. అదే సమయంలో భారతీయ ఉద్యోగులకు అనువైన విధానాన్ని కొనసాగిస్తోంది.
TCS జనవరి-మార్చి 2023 త్రైమాసికంలో ఆర్థిక పనితీరులో స్పల వృద్ధిని మాత్రమే నమోదు చేసింది. ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేందుకు ఇన్ఫోసిస్ మూడు-దశల ప్రణాళికను అమలు చేస్తోంది. అలాగే సౌకర్యవంతమైన పని విధానంపై సానుకూల అభిప్రాయాన్ని హైలైట్ చేస్తోంది.
అంతర్గతంగా ఇచ్చిన మెమోలను, అలాగే కేటాయించిన పని షెడ్యూల్‌ను పాటించడంలో విఫలమైన ఉద్యోగుల వేతనంలో కోతలు, తగ్గింపులు లేదా తొలగింపుతో సహా క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టం చేశాయి. రోస్టర్ ప్రకారం మీ కార్యాలయ స్థానం నుంచి పని చేయడానికి రిపోర్టింగ్ ప్రారంభించాలని హెచ్చరించాము అలాగే ఆదేశించాము అని మెయిల్స్‌లో వార్నింగ్ ఇస్తున్నాయి.
ఇవీ చదవండి: గడ్డుకాలంలో ఐటీ ఉద్యోగులు... భారీగా తగ్గిన ఇన్ఫోసిస్ హెడ్‌కౌంట్
అయితే ఈ రెండు ప్రముఖ కంపెనీలకు భిన్నంగా మరో దిగ్గజ ఐటీ కంపెనీ అయిన కాగ్నిజెంట్ నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ కంపెనీలో సుమారు 3.5 లక్షల మంది ఇండియాలో పని చేస్తున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్ తాజా హెచ్చరికలతో ఐటీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.