Safe IT Jobs: సేప్టీ ఎక్కువగా ఉన్న ఐటీ జాబ్‌లు ఇవే...
పలు నివేదికల ప్రకారం, 2023లో ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయారు. ఆర్థిక మందగమనంతో పాటు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విజృంభణ టెక్ పరిశ్రమలో పనిచేస్తున్న వారి కష్టాలను మరింతగా పెంచింది.దీంతో ఫ్రెషర్లు తమ కెరీర్ ఎంపికలపై పునరాలోచనలో పడి ఇతర రంగాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో లక్షల జీతాల కంటే కూడా ఉద్యోగ భద్రతనే ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. మరోవైపు కంపెనీలు సైతం మారుతున్న టెక్నాలజీ డిమాండ్‌కు అనుగుణంగానే నియామకాలు చేపడుతున్నాయి.
Tech skills: ఈ స్కిల్స్ నేర్చుకోండి... టెక్ జాబ్ పట్టండి
డిమాండ్, భద్రత ఉన్న ఐటీ జాబ్‌లు ఇవే..
బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ ప్రకారం.. ఐటీ మేనేజర్‌లు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్‌లు, వెబ్ డెవలపర్‌లు, డేటా అడ్మినిస్ట్రేటర్ వంటి జాబ్‌లు 2023లో సాంకేతిక రంగంలో అత్యధిక ఉద్యోగ భద్రతను అందించగలవు. వీటికి డిమాండ్ కూడా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
Moonlighting: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై ఐటీ బాంబ్... మూన్‌లైటింగ్‌కు పాల్పడిన వారికి దడ
లేఆఫ్ లేని ఉద్యోగాలు:
బిజినెస్ పబ్లికేషన్ మింట్ నివేదిక ప్రకారం.. లీగల్, స్ట్రాటజీ సంబంధిత ఉద్యోగులు ఇప్పటివరకు లేఆఫ్‌ల వల్ల ప్రభావితం కాలేదు. అందువల్ల ఐటీలో కెరీర్‌ని ప్లాన్ చేసుకునేవారు వీటిని కూడా నమ్మకమైన ఎంపికలుగా పరిగణించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
లేఆఫ్‌ల ప్రమాదం ఉన్నవి:
పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లేఆఫ్‌ల ప్రమాదం ఎక్కువగా ఉన్న జాబ్‌లు కొన్ని ఉన్నాయి. కస్టమర్ స్పెషలిస్ట్‌లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లు, బేసిక్ కోడర్‌లు, డేటా సైంటిస్టులు, రిక్రూటర్‌లకు డిమాండ్ వేగంగా పడిపోతున్నట్లు ఇటీవలి కొన్ని నివేదికలు, మార్కెట్ ట్రెండ్‌లు, సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
Top 5 highest salaries Paying countries : ప్రపంచంలో ఎక్కువ జీతం ఇచ్చే టాప్ 5 దేశాలు ఏంటో తెలుసా!