Tech skills: ఈ స్కిల్స్ నేర్చుకోండి... టెక్ జాబ్ పట్టండి
జావా డెవలపర్
ఇండస్ట్రీ ట్రెండ్‌తో అప్‌డేట్‌గా ఉంటూ.. తమ నైపుణ్యాలను వాస్తవ-ప్రపంచంలో ప్రభావవంతంగా అన్వయించగలిగితే జావా డెవలపర్‌లకు జాబ్ మార్కెట్‌లో అవకాశాలకు కొదవలేదు. జావా డెవలపర్‌గా రాణించాలంటే.. ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్, ఎక్సెప్షన్ హాండ్లింగ్ సహా కోర్ జావా కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి. సర్వ్‌లెట్స్, జేఎస్‌పీ, రెస్ట్‌ఫుల్ వెబ్ సర్వీసెస్‌తో కూడిన వెబ్ డెవలప్‌మెంట్ నైపుణ్యంతోపాటు స్ప్రింగ్, హైబర్నేట్ వంటి ఫ్రేమ్‌వర్క్‌లలో ప్రావీణ్యం పెంచుకోవాలి. జేడీబీసీ లేదా ఓఆర్‌ఎం ఫ్రేమ్‌వర్క్స్‌లను ఉపయోగించే డేటాబేస్ కనెక్టివిటీ స్కిల్స్ ఎంతో కీలకం. టెస్టింగ్ విత్ జేయూనిట్, మావెన్ వంటి బిల్డ్ టూల్స్, గిట్ వంటి వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యాలు తదితర నైపుణ్యాలు కూడా ముఖ్యమైనవి. వ్యక్తిగత ప్రాజెక్ట్‌ల ద్వారా ప్రాక్టికల్ అనుభవాన్ని పొందడం, ఓపెన్-సోర్స్ ప్రాజెక్ట్‌లకు సహకారం అందించడం ద్వారా రిక్రూటర్‌ల దృష్టిని ఆకర్షించొచ్చు.
New Courses in IITs: మెషిన్ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రవేశం విధానం, కెరీర్ అవకాశాలు ఇవే..
మొబైల్ అప్లికేషన్ డెవలపర్
టెక్ గిగ్ కొలువుల్లో మొబైల్ అప్లికేషన్ డెవలపర్‌కు మంచి డిమాండ్ నెలకొంది. ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్ డెవలప్‌మెంట్‌లో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ అప్లికేషన్ డెవలపర్‌గా రాణించాలంటే.. రియాక్ట్ నేటివ్ లేదా ఫ్లట్టర్, యూఐ/యూఎక్స్ డిజైన్, బ్యాకెండ్ డెవలప్‌మెంట్, మొబైల్ యాప్ సెక్యూరిటీ, టెస్టింగ్, డీబగ్గింగ్, క్రాస్-ప్లాట్‌ఫారమ్ అడాప్టబిలిటీ, ప్రాక్టికల్ అనుభవం, బిల్డింగ్ ఎ పోర్ట్‌ఫోలియోలో నైపుణ్యం సాధించాలి. ఇండస్ట్రీ ట్రెండ్స్‌కు తగ్గట్టుగా వినూత్న మొబైల్ యాప్‌లను రూపొందించగలగాలి.
డేటా ఇంజనీర్
మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే.. డేటా ఇంజనీర్ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ సామర్థ్యాలు, డేటాను సమర్థవంతంగా విశ్లేషించే సామర్థ్యం, డేటా విజువలైజేషన్ టెక్నిక్‌లలో నైపుణ్యం, క్లౌడ్ కంప్యూటింగ్‌పై దృఢమైన అవగాహన, సమర్థవంతమైన కమ్యూనికేషన్, అద్భుతమైన సాఫ్ట్ స్కిల్స్ ఉన్నవారు డేటా ఇంజనీర్‌గా సులభంగా రాణించొచ్చు. ఈ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకున్నప్పుడే సంస్థల డేటా నిర్వహణ, నిర్ణయాత్మక ప్రక్రియలపై ప్రభావాన్ని చూపగలుగుతారు.
SAP Careers & Job Opportunities: ఎస్‌ఏపీ ప్రాధాన్యత, ఉద్యోగావకాశాలు..
ఫ్రంట్ ఎండ్ డెవలపర్
వెబ్‌సైట్‌లు, వెబ్ అప్లికేష¯Œ ల విజువల్, ఇంటరాక్టివ్ అంశాలను రూపొందించడంలో, అభివృద్ధి చేయడంలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌లు కీలక పాత్ర పోషిస్తారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా రాణించాలంటే.. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావాస్క్రిప్ట్‌లలో నైపుణ్యం సొంతం చేసుకోవాలి. అప్పుడే వెబ్ పేజీలను రూపొందించడంతోపాటు వాటిని ఆకర్షణీయంగా మలచి ఫంక్షనల్‌గా కూడా యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దగలుగుతారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌లు సాంకేతిక నైపుణ్యంతో పాటు సమస్య-పరిష్కార సామర్థ్యాలు, సమర్థమంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాలి. ప్రస్తుత జాబ్ మార్కెట్‌లో అవకాశాలు సొంతం చేసుకోవాలంటే..హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావాస్క్రిప్ట్‌లతోపాటు రియాక్ట్, యాంగులర్, వ్యూ వంటి ప్రముఖ ఫ్రేమ్‌వర్క్‌లపై కూడా పట్టు సాధించాలి.
క్లౌడ్ ఆర్కిటెక్ట్స్/ఇంజనీర్
క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లు/ఇంజనీర్లు క్లౌడ్-ఆధారిత పరిష్కారాలను రూపొందించడంలో, నిర్మించడంలో, పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తారు. వీరికి వివిధ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీలపై లోతైన అవగాహన ఉండాలి. వ్యాపార అవసరాలను గుర్తించి సరైన సాంకేతిక పరిష్కారాన్ని చూపే నైపుణ్యం తప్పనిసరి. సాంకేతిక నైపుణ్యంతో పాటు బలమైన సమస్య పరిష్కార సామర్థ్యాలు, అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉండాలి. ప్రస్తుత జాబ్ మార్కెట్‌లో అవకాశాలను సొంతం చేసుకోవాలంటే.. క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లు/ఇంజనీర్‌లు ఏడబ్ల్యూఎస్, అజుర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లలో, జావా, పైథాన్, సీ++ వంటి ప్రోగ్రామింగ్ భాషలలో నైపుణ్యం సాధించాలి. డేటా స్టోరేజ్, రిట్రైవల్ గురించిన పరిజ్ఞానం, నెట్‌వర్కింగ్, సెక్యూరిటీ, కాస్ట్ మేనేజ్‌మెంట్ ఎజైల్ డెవలప్‌మెంట్, డెవ్‌ఓపీఎస్, క్లౌడ్-నేటివ్ డెవలప్‌మెంట్ నైపుణ్యాలున్నవారు అత్యధిక వేతనాలు పొందొచ్చు.
Industry 4.0 Skills: బీటెక్ తర్వాత వెంటనే కొలువు కావాలంటే.. ఈ 4.0 స్కిల్స్ ఉండాల్సిందే!