AP/TS ICET 2024 Notification: ఎంబీఏ, ఎంసీఏకు మార్గం.. ఐసెట్
- ఏపీ, టీఎస్‌లో ఐసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో మే 6,7; టీఎస్‌లో జూన్ 5, 6 తేదీల్లో ఐసెట్
- ఐసెట్ స్కోర్‌తో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం
- మేనేజ్‌మెంట్, ఐటీ రంగాల్లో కెరీర్ అవకాశాలు
టీఎస్/ఏపీ ఐసెట్–అర్హతలు
- ఎంబీఏ: 50 శాతం మార్కులతో మూడు లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- ఎంసీఏ: 50 శాతం మార్కులతో మూడు లేదా నాలుగేళ్ల వ్యవధిలోని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దీంతోపాటు ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్ గ్రూప్ సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. ఆయా కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- రిజర్వేషన్ వర్గాలకు కనీస ఉత్తీర్ణత 45 శాతం.
చదవండి: ICET Previous Papers
200 మార్కులకు ఏపీ ఐసెట్
- ఏపీ ఐసెట్ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా జరుగుతుంది. మొత్తం మూడు విభాగాల్లో 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- సెక్షన్–ఎలో అనలిటికల్ ఎబిలిటీ పేరుతో డేటా సఫిషియన్సీ(20 ప్రశ్నలు–20 మార్కులు), ప్రాబ్లమ్ సాల్వింగ్ (55 ప్రశ్నలు–55 మార్కులు) నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు.
- సెక్షన్ బీలో కమ్యూనికేషన్ ఎబిలిటీ మొత్తం 70 మార్కులకు ఉంటుంది. ఇందులో వొకాబ్యులరీ 15 ప్రశ్నలు–15 మార్కులకు, ఫంక్షనల్ గ్రామర్ 20 ప్రశ్నలు–20 మార్కులకు, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీæ15 ప్రశ్నలు–15 మార్కులకు, రీడింగ్ కాంప్రహెన్షన్ 20 ప్రశ్నలు–20 మార్కులకు ఉప విభాగాలుగా ఉంటాయి
- సెక్షన్ సీలో మ్యాథమెటికల్ ఎబిలిటీ మొత్తం 55 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్థమెటికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు, అల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ 10 ప్రశ్నలు–10 మార్కులకు, స్టాటిస్టికల్ ఎబిలిటీ 10 ప్రశ్నలు–10 మార్కులకు ఉంటాయి.
టీఎస్ ఐసెట్ ఇలా
- టీఎస్ ఐసెట్ ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు 200 మార్కులకు ఉంటాయి.
- సెక్షన్–ఎలో అనలిటికల్ ఎబిలిటీ పేరుతో డేటా సఫిషియన్సీ 20 ప్రశ్నలు–20 మార్కులకు, ప్రాబ్లమ్ సాల్వింగ్ 55 ప్రశ్నలు–55 మార్కులకు ఉంటాయి. ఇలా మొత్తం 75 ప్రశ్నలు–75 మార్కులకు సెక్షన్ ఏ ఉంటుంది.
- సెక్షన్–బి మ్యాథమెటికల్ ఎబిలిటీలో.. అర్థమెటికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు, అల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ 30 ప్రశ్నలు–30 మార్కులకు, స్టాటిస్టికల్ ఎబిలిటీ 10 ప్రశ్నలు–10 మార్కులకు అడుగుతారు. ఇలా మొత్తం 75 ప్రశ్నలు–75 మార్కులకు ఈ సెక్షన్ ఉంటుంది.
- కమ్యూనికేషన్ ఎబిలిటీ విభాగాన్ని సెక్షన్–సిగా నిర్వహిస్తారు. ఈ విభాగానికి మార్కులు కూడా 50 మార్కులు ఉంటాయి.
చదవండి: ICET Study Material
బెస్ట్ స్కోర్ సాధించేలా
ఐసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు అభ్యర్థులు విశ్లేషణాత్మక దృక్పథం, అన్వయ నైపుణ్యాలను అలవర్చుకోవాలి. పరీక్ష తీరు, సిలబస్ స్థాయిపై అవగాహన పొందాక విభాగాల వారీగా ప్రిపరేషన్ కొనసాగించాలి.
డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్
ఈ విభాగంలో రాణించేందుకు విశ్లేషణ నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. ఇందులో ప్రశ్నలు ఒక డేటాను ఇచ్చి.. దాని ఆధారంగా సమస్య సాధించేవిగా, స్టేట్‌మెంట్ ఆధారితంగా ఉంటాయి. బేసిక్ అర్థమెటిక్ అంశాల్లో పట్టు సాధించడం ఉపయుక్తంగా ఉంటుంది. అదే విధంగా స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. గణితంపై ప్రాథమిక అవగాహన అవసరం. ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగంలో రీజనింగ్ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు కోడింగ్, డీ –కోడింగ్, బ్లడ్ రిలేషన్, సిరీస్, సిలాజిజమ్, సీటింగ్ అరేంజ్‌మెంట్‌లపై పట్టు సాధించాలి.
కమ్యూనికేషన్ ఎబిలిటీ
- వొకాబ్యులరీ కోసం బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. అదే విధంగా వొకాబ్యులరీ పెంచుకునేందుకు ప్రతిరోజు కనీసం 20 కొత్త పదాలు నేర్చుకోవడం, వాటిని వినియోగించే తీరుపై ప్రాక్టీస్ చేయాలి. బేసిక్ గ్రామర్ అంశాలుగా పేర్కొనే సినానిమ్స్, యాంటానిమ్స్, కొశ్చన్ ట్యాగ్స్, డైరెక్ట్–ఇన్‌డైరెక్ట్ స్పీచ్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి. ఇందుకోసం ఆరు నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ గ్రామర్ బుక్స్ చదవాలి.
- బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీలో.. వ్యాపార–వాణిజ్య అంశాలు, తాజా పరిణామాలు, కంప్యూటర్ బేసిక్స్‌పై అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. వీటిలో రాణించాలంటే.. బిజినెస్ టెర్మినాలజీ, కొత్త వ్యాపార విధానాలు, ఆయా సంస్థలు–వాటి క్యాప్షన్లు వంటివి తెలుసుకోవాలి. కంప్యూటర్ టెర్మినాలజీకి సంబంధించి బేసిక్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్‌కు సంబంధించిన ముఖ్య భాగాలు, వాటి పనితీరుకు సంబంధించి ప్రాథమిక నైపుణ్యం కలిసొస్తుంది.
- రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగంలో ప్యాసేజ్‌ల ఆధారంగా అడిగే 20 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. ముందుగా అభ్యర్థులు ఒక అంశాన్ని, అందులోని కీలక పదాలను, సారాంశాన్ని గుర్తించే నేర్పు పెంచుకోవాలి.
మ్యాథమెటికల్ ఎబిలిటీ
మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఉండే అర్థమెటిక్, జామెట్రికల్, స్టాటిస్టికల్ ఉప విభాగాలకు సంబంధించి ప్రాథమిక సూత్రాలపై అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం హైస్కూల్ స్థాయి మ్యాథమెటిక్స్ పుస్తకాలను అధ్యయనం చేయాలి. ప్రశ్నల శైలి కొంత క్లిష్టంగా ఉండే స్టాటిస్టికల్ ఎబిలిటీ కోసం ఇంటర్మీడియెట్ స్థాయి పుస్తకాల ప్రిపరేషన్ అవసరం. ముఖ్యంగా ప్రాబబిలిటీ, ఇనీక్వాలిటీస్ అంశాల కోసం ఈ స్థాయి ప్రిపరేషన్ తప్పనిసరి. అర్థమెటిక్ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు.. శాతాలు, లాభ నష్టాలు, నిష్పత్తులు, మెన్సురేషన్, పని–కాలం, పని–సమయంపై అవగాహన పెంచుకోవాలి. అల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ కోసం ట్రిగ్నోమెట్రీ, సెట్స్ అండ్ రిలేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్ వంటి అంశాల్లో నైపుణ్యం కీలకంగా నిలుస్తుంది.
టార్గెట్ 1000లోపు ర్యాంకు
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అందుబాటులో ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు; ఐసెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తున్న వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపు అందరికీ సీట్లు లభించే అవకాశముంది. కాని బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో సీటు సొంతం చేసుకోవాలంటే మాత్రం వేయిలోపు ర్యాంకు సాధించాలని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి అనుగుణంగా అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్‌కు పదును పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
ఏపీ ఐసెట్ ముఖ్య తేదీలు
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఏప్రిల్ 7
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ: 2024 ఏప్రిల్ 28, 29 తేదీల్లో
- ఐసెట్ తేదీలు: 2024 మే 6, 7 తేదీల్లో
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx
టీఎస్ ఐసెట్ ముఖ్య తేదీలు
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఏప్రిల్ 30
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ: 2024, మే 17–20
- టీఎస్ ఐసెట్ తేదీలు: 2024 జూన్ 5, 6
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://icet.tsche.ac.in/TSICET_HomePage.aspx
Tags
- TS ICET 2024 Notification
- AP ICET 2024 Notification
- TS ICET 2024 Notification Details in Telugu
- Common Entrance Test
- Telangana State Integrated Common Entrance Test
- AP ICET Syllabus
- ICET Careers
- ICET Model Papers
- ICET Study Material
- ICET
- TS ICET Exam Pattern
- AP ICET Exam Pattern
- TS ICET Preparation 2024
- AP ICET Exam Pattern And Syllabus
- AP ICET Preparation Tips
- admissions
- MBA Courses
- MCA courses
- MBA and MCA courses
- Career Opportunities
- Careers
- ICET Important Dates
- latest notifications
- Education News