Pilot After Inter: పైలట్ కొలువుకు.. సై అంటారా!.. ఇంటర్మీడియెట్ అర్హతతోనే పైలట్ అవకాశం
రూ.లక్షల వేతనంతో పైలట్ ఉద్యోగాలు పలకరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందితే.. ఆకర్షణీయ వేతనంతో పైలట్ కొలువు సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో.. ఇంటర్మీడియెట్ అర్హతతోనే పైలట్ కొలువుకు మార్గాలు, అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు తదితర వివరాలు..
సివిల్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ నివేదిక ప్రకారం–గత అయిదేళ్లలో 3,300 మందికి మాత్రమే కమర్షియల్ పైలట్ లైసెన్స్‌లు మంజూరయ్యాయి. మరోవైపు రానున్న అయిదేళ్లలో పది వేల మంది పైలట్ల అవసరం ఏర్పడుతుందని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ పేర్కొంది. ఏటా మంజూరవుతున్న కమర్షియల్ పైలట్ లైసెన్స్‌ల సంఖ్య మాత్రం అయిదు వందల నుంచి ఆరు వందల మధ్యలోనే ఉంటోంది.
చదవండి: Best Courses After Inter: ఇంటర్ తర్వాత చదవడానికి అవకాశం ఉన్న టాప్ 100 కోర్సులు.. వాటి వివరాలు..
ప్రతి విమానానికి పది మంది
డీజీసీఏ, సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం–ప్రతి విమానానికి సగటున పది మంది పైలట్లు అందుబాటులో ఉండాలి. అదే బోయింగ్–777, ఎయిర్‌బస్‌లకైతే సగటున 20 మంది పైలట్లు విధుల్లో అందుబాబాటులో ఉండాలి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం–ప్రస్తుతం దేశంలో 15 ఫ్లైట్ అపరేటింగ్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటి ఆధ్వర్యంలో 750 వరకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నా యి. ఈ గణాంకాలను, దేశంలోని ఫ్లైట్ ఆపరేష న్స్‌ను బేరీజు వేస్తే.. వేల సంఖ్యలో పైలట్ల అవస రం ఏర్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
సీపీఎల్‌తో.. పైలట్‌గా కెరీర్
విమానయాన రంగంలో పైలట్‌గా కొలువుదీరాలంటే.. కమర్షియల్ పైలట్ లైసెన్స్ సొంతం చేసుకోవా ల్సి ఉంటుంది. ఇంటర్మీడియెట్ అర్హతతోనే కమర్షి యల్ పైలట్ లైసెన్స్ కోసం ప్రయత్నించొచ్చు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ సొంతం చేసుకునే ముందు.. స్టూడెంట్ పైలట్ లైసెన్స్, ప్రైవేట్ పైలట్ లైసెన్స్‌లను పొందాల్సి ఉంటుంది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
స్టూడెంట్ పైలట్ లైసెన్స్
డీజీసీఏ అనుమతి పొందిన ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీలో.. స్టూడెంట్ పైలట్ లైసెన్స్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. అభ్యర్థులకు కనీస వయసు 16 ఏళ్లు ఉండాలి. వీరు డీజీసీఏ అనుమతి ఉన్న ఇన్‌స్ట్రక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకోవాలి. ఈ శిక్షణ సమయంలో విమానానికి సంబంధించిన అంశాలను, పైలట్ ట్రైనింగ్‌పై సిమ్యులేటర్ అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత డీజీసీఏ నిర్వ హించే పరీక్షలు, మెడికల్ టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధి స్తే..స్టూడెంట్ పైలట్ లైసెన్స్ మంజూరవుతుంది.
ప్రైవేట్ పైలట్ లైసెన్స్
కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందే క్రమంలో రెండో దశ..ప్రైవేట్ పైలట్ లైసెన్స్ ప్రక్రియ. డీజీసీఏ నిబంధనల ప్రకారం–సింగిల్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్‌లో కనీసం 50 గంటల ఫ్లైయింగ్ అనుభవం సొంతం చేసుకోవాలి. ఇందుకోసం నిర్దేశిత శిక్షణ సంస్థల్లో నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీజీసీఏ నిర్వహించే ఎయిర్ రెగ్యులేషన్స్, ఎయిర్ నేవిగేషన్, ఏవియేషన్ మెటీయొరాలజీ తదితర అంశాల్లో గ్రౌండ్ డ్యూటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు డీసీజీఏ క్లాస్–2 మెడికల్ టెస్ట్‌లలోనూ ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రక్రియలు విజయవంతంగా పూర్తి చేస్తే ప్రైవేట్ పైలట్ లైసెన్స్ మంజూరవుతుంది. 17ఏళ్ల వయసు నిండిన వారు ఈ ప్రైవేట్ లైసెన్స్‌కు అర్హులుగా డీజీసీఏ నిర్దేశించింది.
కమర్షియల్ పైలట్ లైసెన్స్
- స్టూడెంట్ పైలట్ లైసెన్స్, ప్రైవేట్ పైలట్ లైసెన్స్‌లు సొంతం చేసుకున్నాక.. చివరగా కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్ పొందితే విమానయాన సంస్థల్లో కో–పైలట్‌గా కొలువులు లభిస్తాయి.
- కమర్షియల్ పైలట్ లైసెన్స్‌ను పొందేందుకు ముందుగా అభ్యర్థులు డీజీసీఏ అనుమతి పొందిన ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీల్లో శిక్షణ తీసుకోవాలి.
- కనీసం 200 గంటల ఫ్లయింగ్ శిక్షణ పొందాలి. ఈ 200 గంటల వ్యవధిలో..100 గంటలు స్వయంగా ఒక విమానాన్ని నడిపిన అనుభవం పొందాలి. అదే విధంగా ప్రైవేట్ పైలట్ లైసెన్స్ శిక్షణ సమయంలో 20 గంటల స్వీయ ఫ్లయింగ్ నైపుణ్యం తోపాటు 60 గంటల ఫ్లయింగ్ నైపుణ్యం సొంతం చేసుకోవాలి.
- ఇలా నిర్దేశిత వ్యవధిలో ఫ్లయింగ్ అనుభవం పొందిన తర్వాత డీజీసీఏ ఎయిర్ నేవిగేషన్, ఏవియేషన్ మెట్రాలజీ, ఎయిర్ రెగ్యులేషన్స్, రేడియో టెలిఫోనీ–పార్ట్–1, పార్ట్–2, కాంపోజిట్ నేవిగేషన్ అంశాల్లో నిర్వహించే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.
- దీంతోపాటు ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎ స్టాబ్లిష్‌మెంట్ లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏవి యేషన్ మెడిసిన్‌లు నిర్వహించే మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
- ఈ రెండు ప్రక్రియలు పూర్తి చేస్తే.. కమర్షియల్ పైలట్ లైసెన్స్ సొంతం అవుతుంది.
- మొత్తంగా కమర్షియల్ పైలట్ లైసెన్స్ శిక్షణ సమయం ఆయా సంస్థలను బట్టి 8 నుంచి 12 నెలలపాటు ఉంటోంది.
ఇంటర్ ఎంపీసీ అర్హత
పైలట్‌గా కెరీర్ ప్రారంభించేందుకు అవసరమైన పీపీఎల్, సీపీఎల్‌లలో శిక్షణ పొందేందుకు కనీస అర్హత ఇంటర్మీడియెట్ ఎంపీసీ. దీంతోపాటు వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
శిక్షణ సంస్థలు
ప్రస్తుతం దేశంలో పలు ఫ్లయిట్ ట్రైనింగ్ అకాడమీలు శిక్షణనందిస్తున్నాయి. వీటిలో.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడ మీ, ఆయా రాష్ట్రాల ఆధ్వర్యంలో 8 శిక్షణ సంస్థలు ఉండగా.. పలు ప్రైవేట్ శిక్షణ సంస్థలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ, వింగ్స్ ఏవియేషన్ అకాడ మీ, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ, ఏసియా–పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీలు పైలట్ లైసెన్స్ శిక్షణనందిస్తున్నాయి.
త్రివిధ దళాల్లో.. ఫైటర్ జెట్ పైలట్స్‌గా
త్రివిధ దళాలలైన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలలోనూ పైలట్‌గా కెరీర్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. వీటిలో అడుగుపెట్టాలంటే.. ఇంటర్ అర్హతగా ఎన్‌డీఏ–ఎన్‌ఏ పరీక్షలో లేదా బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా జరిగే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామి నేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత ఆయా అకాడమీల్లో శిక్షణలో తమ ఆసక్తిని పేర్కొంటూ.. ఫ్లయింగ్ వింగ్‌లో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్స్‌గా చేరేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేకంగా నిర్వహించే ఏఎఫ్‌క్యాట్ (ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్)లో ఎంపిక అవ్వాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్ విభాగంలో పైలట్ల నియామక ప్రక్రియ చేపడతారు.
విదేశీ అవకాశాలు
కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన వారికి విదేశీ విమానయాన సంస్థల్లోనూ పైలట్స్‌గా అవకాశాలు లభిస్తున్నాయి. వీరు తాము అడుగుపెట్టాలనుకున్న దేశంలోని ఏవియేషన్ నియంత్రణ సంస్థలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఉదాహరణకు అమెరికాలోని సంస్థల్లో పని చేయాలనుకునే వారు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. అదే విధంగా నిర్దిష్ట గంటల వ్యవధిలో పైలట్ ఇన్ కమాండ్‌గా అనుభవం గడించాలి.
రూ.15 లక్షలకు పైగా వేతనం
- పైలట్‌గా కెరీర్ మొదలు పెట్టిన తర్వాత ప్రారంభంలో సగటున రూ.ఆరు లక్షల వేతనం అందుకోవచ్చు. ఆ తర్వాత అనుభవం పనితీరు ప్రాతిపదికగా ఏటా రూ.40 లక్షల వరకు వేతనం పొందొచ్చు. ఇటీవల ఇండియన్ ఎయిర్ లైన్స్ సంస్థ అనుభవం ఉన్న పైలట్లకు 21 వేల డాలర్ల నెల వేతనం (మన కరెన్సీలో రూ.17 లక్షలకు పైగా) చెల్లిస్తామని ప్రకటించడాన్నే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
- కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన వారు తొలుత కో–పైలట్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అనుభవం ఆధారంగా పైలట్ ఇన్ కమాండ్ లేదా కెప్టెన్ స్థాయికి చేరుకోవచ్చు.
పలు పైలట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్
ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ, రాజీవ్ గాంధీ అకాడమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీ, తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ, ఆసి యా–పసిఫిక్ ఫ్టైట్ ట్రైనింగ్ అకాడమీ, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ, బీహార్ ఫ్లయింగ్ ఇన్‌స్టి ట్యూట్, కర్ణాటక గవర్నమెంట్ ఫ్లయింగ్ స్కూ ల్, హరియాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఏవియే షన్, గవర్నమెంట్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్‌స్టి ట్యూట్–భువనేశ్వర్; వీటితోపాటు డీజీసీఏ గుర్తింపు పొందిన పలు ఫ్లైట్ ట్రైనింగ్ అకా డమీలు పైలట్ ట్రైనింగ్ శిక్షణనందిస్తున్నాయి.
పైలట్ కెరీర్స్.. ముఖ్యాంశాలు
- ఇంటర్మీడియెట్(ఎంపీసీ) అర్హతతోనే పైలట్ కెరీర్ దిశగా అడుగులు వేసే అవకాశం.
- రానున్న అయిదేళ్లలో ఏటా వేయి నుంచి పన్నెండు వందల మంది పైలట్ల అవసరమని అంచనా.
- కమర్షియల్ పైలట్ లైసెన్స్‌తో పైలట్ కెరీర్‌కు అవకాశం.
- ప్రారంభంలో కో–పైలట్‌గా నెలకు సగటున రూ.ఆరు లక్షల వేతనం.
- ఎన్‌డీఏ, సీడీఎస్, ఏఎఫ్‌క్యాట్‌లో ఎంపిక ద్వారా త్రివిధ దళాల్లో ఫైటర్ జెట్ పైలట్లుగా కొలువులు.
Tags
- Pilot
- Intermediate Qualification
- Pilot Courses After 12th Standard
- Airlines Company
- Pilot Jobs
- Pilot in India after 12th
- Airline Pilot After 12th in India
- Pilot Job Vacancies
- Airline Pilot
- Pilot career in india
- Pilot career salary
- Pilot career qualification
- Pilot career requirements
- Pilot career eligibility
- Pilot career path
- How to become a pilot
- How to become pilot after 12th
- Career Guidance
- Pilot After Inter