SSC CHSL 2024 Notification: ఇంటర్ అర్హతతో 3,712 ఉద్యోగాలు.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్..
- 3,712 పోస్ట్‌ల భర్తీకి ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్
- డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎల్‌డీసీ, జేఎస్‌ఏ ఉద్యోగాలు
- ఇంటర్ అర్హతతోనే దరఖాస్తుకు అవకాశం
- పే లెవల్–2, 4, 5లతో ప్రారంభ వేతనం
మొత్తం 3,712 పోస్ట్‌లు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసిన సీహెచ్‌ఎస్‌ఎల్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,712 పోస్ట్‌లకు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. వీటిల్లో లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‌డీసీ)/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్‌ఏ), డేటాఎంట్రీ ఆపరేటర్, డేటాఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్–ఎ పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత
ఆగస్ట్ 1, 2024 నాటికి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి. కన్సు్యమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్‌లలో పోస్ట్‌లకు మాత్రం ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్‌ను ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.
వయసు
ఆగస్ట్ 1, 2024 నాటికి 18–27 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఇస్తారు.
వేతనం
- ఆయా పోస్ట్‌లకు పే లెవల్–2, 4, 5లతో ప్రారంభ వేతనం లభిస్తుంది.
- ఎల్‌డీసీ/జేఎస్‌ఏలకు పే లెవల్–2(వేతన శ్రేణి రూ.19,900–రూ.63,200); డేటా ఎంట్రీ ఆపరేటర్/డేటాఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్–ఎకు పే లెవల్–4(వేతన శ్రేణి రూ.25,500–రూ.81,100), అదే విధంగా కొన్ని శాఖల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌కు పే లెవల్–5(వేతన శ్రేణి రూ.29,200–రూ.92,300)తో ప్రారంభ వేతనం లభిస్తుంది.
రెండు దశల ఎంపిక ప్రక్రియ
సీహెచ్‌ఎస్‌ఎల్ ద్వారా పలు శాఖల్లో ఎల్‌డీసీ/జేఎస్‌ఏ/డేటాఎంట్రీ ఆపరేటర్, డేటాఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్–ఎ పోస్ట్‌ల భర్తీకి రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. టైర్–1, టైర్–2 పేరుతో రాత పరీక్షలు ఉంటాయి. అదే విధంగా టైర్–2 దశలో స్కిల్ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
200 మార్కులకు టైర్–1
ఎంపిక ప్రక్రియలో తొలిదశ టైర్–1 పరీక్ష.. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో, బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి 100 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు–50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు–50 మార్కులకు ఉంటాయి. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం ఒక గంట. నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు.
రెండో దశ పరీక్ష టైర్–2
తొలిదశ టైర్–1 పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా నిర్దిష్ట కటాఫ్ నిబంధనల ప్రకారం–మెరిట్ జాబితా రూపొందిస్తారు. అందులో నిలిచిన వారికి రెండో దశ.. టైర్–2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష రెండు సెషన్‌లు, మూడు సెక్షన్లు, ప్రతి సెక్షన్‌లో రెండు మాడ్యూల్స్ విధానంలో జరుగుతుంది.
స్కిల్ టెస్ట్.. 2 మాడ్యూల్స్
టైర్–2 సెషన్–3 మాడ్యూల్–2లో పేర్కొన్న స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్ మాడ్యూల్‌ను పార్ట్–ఎ, పార్ట్–బిలుగా విభజించారు. పార్ట్–ఎ ప్రకారం–డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్ట్‌ల అభ్యర్థులకు 15 నిమిషాల వ్యవధిలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. పార్ట్–బి ప్రకారం–ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్ట్‌ల అభ్యర్థులకు పది నిమిషాల వ్యవధిలో టైపింగ్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ మాడ్యూల్ మినహా మిగతా విభాగాల్లోని ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్ట్‌లకు నిర్వహించే స్కిల్ టెస్ట్‌లో గంటకు 8000 క్యారెక్టర్స్‌ను కంప్యూటర్‌పై టైప్ చేయాల్సి ఉంటుంది. ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్ట్‌లకు నిర్వహించే టైపింగ్ టెస్ట్‌లో.. ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాలు టైప్ చేయాల్సి ఉంటుంది. డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్ట్‌ల అభ్యర్థులకు ఏదైనా ఒక ఇంగ్లిష్ ప్యాసేజ్‌ను ఇచ్చి కంప్యూటర్‌పై టైప్ చేయమని అడుగుతారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమ టైపింగ్ టెస్ట్ మీడియంను పేర్కొనాల్సి ఉంటుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, మే 7
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: 2024 మే 10, 11 తేదీల్లో
- టైర్–1(పేపర్–1) పరీక్ష తేదీలు: జూలై 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 12 తేదీల్లో
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.gov.in/
బెస్ట్ స్కోర్‌కు మార్గం ఇలా
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఈ విభాగంలో స్కోర్ కోసం బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, యాక్టివ్/ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్–ఇన్ డైరెక్ట్ స్పీచ్, స్పెల్లింగ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి.
జనరల్ ఇంటెలిజెన్స్
వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడిగే విభాగం ఇది. సిరీస్ (నంబర్/ఆల్ఫాన్యుమరిక్), అనాలజీస్, ఆడ్ మెన్ ఔట్, సిలాజిజమ్, మ్యాట్రిక్స్, డైరెక్షన్, వర్డ్ ఫార్మేషన్, బ్లడ్ రిలేషన్స్, నాన్ వెర్బల్(వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్), కోడింగ్ డీకోడింగ్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఈ విభాగంలో అర్థగణిత అంశాలైన సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్, శాతాలను ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా, త్రికోణమితి, అల్జీబ్రా, జామెట్రీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్‌లకు సంబంధించిన ప్రశ్నలను కూడా ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ అవేర్‌నెస్
జనరల్ అవేర్‌నెస్‌లో జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు మొదలు జనరల్ సైన్స్, ఎకానమిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ విభాగాలపై దృష్టి పెట్టాలి. హిస్టరీకి సంబంధించి ఆధునిక భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలపై ఫోకస్ చేయాలి. జాగ్రఫీలో సహజ వనరులు, నదులు, పర్వతాలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఎకనామిక్స్‌కు సంబంధించి ఇటీవల కాలంలో ఆర్థిక వాణిజ్య రంగాల్లో కీలక పరిణామాలపై దృష్టి పెట్టాలి. ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన పదజాలంపైనా పట్టు సాధించాలి. సీహెచ్‌ఎస్‌ఎల్ అభ్యర్థులు కరెంట్ అఫైర్స్‌ను కీలకంగా భావించాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన పరిణామాలను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. స్టాక్ జీకేలో ముఖ్యమైన వ్యక్తులు, తేదీలు, సదస్సులు, సమావేశాలు, వాటి తీర్మానాలు, అవార్డులు–విజేతలు వంటి సమాచారాన్ని తెలుసుకోవాలి.
కంప్యూటర్ నాలెడ్జ్
కంప్యూటర్‌కు సంబంధించి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఆఫీస్ అప్లికేషన్ టూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా కంప్యూటర్ వినియోగంలో నిత్యం కనిపించే సాధనాల(సీపీయూ, మౌస్, మానిటర్, వీజీఏ కేబుల్ తదితర) గురించి తెలుసుకోవాలి. అదే విధంగా అప్లికేషన్స్‌కు సంబంధించి ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్ టూల్స్‌పై పట్టు సాధించాలి. కీబోర్డ్ షార్ట్ కట్స్, బేసిక్ మెయింటనెన్స్‌లపైనా పట్టు సాధించాలి.
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- SSC CHSL 2024 Notification
- SSC CHSL 2024
- Careers
- After inter
- SSC CHSL Syllabus 2024
- SSC CHSL Apply Online 2024
- ssc chsl 2024 exam date tier 1
- Staff Selection Commission
- SSC CHSL 2024 Age Limit
- Combined Higher Secondary Level Examination
- central govt jobs 2024
- SSC CHSL Selection Process
- SSC CHSL Exam Pattern
- SSC CHSL Preparation
- SSC CHSL Study Plan 2024
- english language
- General Intelligence
- Quantitative Aptitude
- General Awareness
- SSC Exams Computer Knowledge
- Computer Knowledge
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- SSC CHSL-2024 Notification
- Central Government Jobs
- Recruitment Process
- Exam Structure
- Preparation Tips
- CHSL Vacancies
- Government Exams