Junior Engineer Jobs at SSC: కేంద్రంలో జూనియర్ ఇంజనీర్ కొలువులు.. ఎంపిక విధానం, సిలబస్ అంశాలు, పరీక్షలో విజయానికి మార్గాలు..
- మొత్తం 968 పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల
- సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో కొలువులు
- డిప్లొమా అర్హతతో దరఖాస్తుకు అవకాశం
- రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక
- వేతన శ్రేణి రూ.35,400 –రూ.1,12,400
మొత్తం 968 పోస్ట్‌లు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. తాజా నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 9 విభాగాల్లో, 3 బ్రాంచ్‌లలో(సివిల్,మెకానికల్, ఎలక్ట్రికల్) మొత్తం 968 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇందుకోసం జూనియర్ ఇంజనీర్(సివిల్,మెకానికల్,ఎలక్ట్రికల్)ఎగ్జామ్–2024ను నిర్వహించనుంది.
అర్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్/మెకానికల్/ ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లతో బీటెక్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, డీజీఏక్యూ (నావల్), మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్ పోస్టుల అభ్యర్థులకు డిప్లొమాతోపాటు సంబంధిత విభాగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పోస్ట్‌లకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయసు: ఆగస్ట్ 1, 2024 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పోస్ట్‌లకు మాత్రం గరిష్ట వయో పరిమితి 32 ఏళ్లు. అదే విధంగా ఎస్‌సీ, ఎస్టీ వర్గాలకు అయిదేళ్లు, ఓబీసీ వర్గాలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
చదవండి: Railway Jobs 2024: సెంట్రల్ రైల్వేలో 1,113 ట్రేడ్ అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
వేతనం
పే లెవల్–6లో రూ.35,400–రూ.1,12,400 వేతన శ్రేణితో ప్రారంభ వేతనం అందుతుంది. ప్రారంభంలోనే నెలకు రూ.60 వేల వరకు వేతనం లభిస్తుంది. భవిష్యత్తులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్ స్థాయికి చేరుకునే అవకాశముంది.
రాత పరీక్షలో ప్రతిభతో కొలువు
ఆయా పోస్ట్‌లకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి నియామకాలు ఖరారు చేస్తారు. రాత పరీక్షను రెండు పేపర్లుగా(పేపర్–1, పేపర్–2) నిర్వహిస్తారు.
పేపర్–1.. మూడు విభాగాలుగా
ఎంపిక ప్రక్రిĶæలో తొలి దశగా పేపర్–1ను ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహిస్తారు. ఈ పేపర్ మూడు విభాగాల్లో 200 మార్కులకు ఉంటుంది.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 ప్రశ్నలు–50 మార్కులకు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులకు ఉంటాయి. దీంతోపాటు అభ్యర్థులు తాము డిప్లొమా లేదా బీటెక్‌లో చదివిన బ్రాంచ్‌కు అనుగుణంగా పార్ట్–ఎ లేదా పార్ట్–బి లేదా పార్ట్–సిలలో ఏదో విభాగంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇది వంద ప్రశ్నలు–వంద మార్కులకు ఉంటుంది. ఇలా మొత్తం 200 మార్కులకు రెండు గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. పేపర్–1లో పొందిన మార్కులను నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా క్రోడీకరించి కటాఫ్ స్కోర్లను నిర్ణయిస్తారు. ఆ తర్వాత పోస్ట్‌ల సంఖ్య ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. వారికి పేపర్–2కు అర్హత లభిస్తుంది.
పేపర్–2.. 300 మార్కులకు
పేపర్–2ను పూర్తిగా సబ్జెక్ట్ పేపర్లతో డిస్క్రిప్టివ్ విధానంలో 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో పార్ట్–ఎ జనరల్ ఇంజనీరింగ్ (సివిల్ అండ్ స్ట్రక్చరల్), పార్ట్–బి జనరల్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్), పార్ట్–సి జనరల్ ఇంజనీరింగ్ (మెకానికల్) పేరుతో పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా సంబంధిత సబ్జెక్ట్ విభాగంలో పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. పరీక్షకు లభించే సమయం 2 గంటలు.
మెరిట్ ప్రాతిపదికన ఎంపిక
రెండు పేపర్లలోనూ పొందిన మార్కుల ఆధారంగా తుది విజేతల జాబితా రూపొందిస్తారు. దరఖాస్తులో పేర్కొన్న ప్రాథమ్యాలు, ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నియామకాలు ఖరారు చేసి సంబంధిత శాఖలు, విభాగాలకు పంపుతారు. ఆ తర్వాత సంబంధిత శాఖల్లో నిర్ణీత కాల వ్యవధిలో అంతర్గత శిక్షణనిస్తారు. దాన్ని పూర్తి చేసుకున్న వారికి విధులు కేటాయిస్తారు.
సబ్జెక్టుపై పట్టు.. విజయానికి మెట్టు
జూనియర్ ఇంజనీర్ పోస్ట్‌లకు పోటీ పడే అభ్యర్థులు ప్రధానంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లపై పట్టు సాధించాల్సి ఉంటుంది. డిప్లొమా, బీటెక్ స్థాయిలో అకడమిక్ పుస్తకాలను అధ్యయనం చేయాలి.
సివిల్
సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు బిల్డింగ్ మెటీరియల్స్, ఎస్టిమేటింగ్, కాస్టింగ్ అండ్ ఎవాల్యుయేన్, సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్, హైడ్రాలిక్స్, ఇరిగేషన్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లపై పట్టు సాధించాలి. అదే విధంగా.. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి స్ట్రక్చర్స్ థియరీ, కాంక్రీట్ టెక్నాలజీ, ఆర్‌సీసీ డిజైన్, స్టీల్ డిజైన్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
ఎలక్ట్రికల్
ఈ విభాగం అభ్యర్థులు బేసిక్ కాన్సెప్ట్స్‌తోపాటు సర్క్యూట్ లా, మ్యాగ్నటిక్ సర్క్యూట్, ఏసీ ఫండమెంటల్స్, మెజర్‌మెంట్ అండ్ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ మెషీన్స్, ఫంక్షనల్ కిలోవాట్ మోటార్స్ అండ్ సింగిల్ ఫేజ్ మోటార్స్, సింక్రనస్ మెషీన్స్, జనరేషన్, ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, యుటిలైజేషన్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి.
మెకానికల్
ఈ విభాగంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు..థియరీ ఆఫ్ మెషీన్స్, మెషీన్ డిజైన్, ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ప్యూర్ సబ్‌స్టాన్సెస్, ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ ఫర్ ఐసీ ఇంజన్స్, ఐసీ ఇంజన్ పెర్‌ఫార్మెన్స్, ఐసీ ఇంజన్స్ కంబస్టన్, ఐసీ ఇంజన్ కూలింగ్ అండ్ లూబ్రికేషన్, ఫ్లూయిడ్ స్టాటిక్స్, ఫ్లూయిడ్ ప్రెజర్, ఫ్లూయిడ్ కైనమాటిక్స్, డైనమిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, మెజర్‌మెంట్ ఆఫ్ ఫ్లో రేట్, బేసిక్ ప్రిన్సిపుల్స్, హైడ్రాలిక్ టర్బైన్స్, సెంట్రిఫ్యుగల్ పంప్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీల్ తదితర కోర్ మెకానికల్ అంశాలపై పట్టు సాధించాలి.
సిద్ధాంతాలు, అన్వయ దృక్పథం
ఇంజనీరింగ్ పేపర్లలో మెరుగైన మార్కుల కోసం అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లలోని అంశాలు, వాటికి సంబంధించిన ప్రాథమిక భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, ధర్మాలు (ప్రాపర్టీస్) వంటి అంశాలను చదవాలి. దీంతోపాటు అన్వయ నైపుణ్యం కూడా అలవర్చుకోవాలి. అప్పుడే పరీక్షలో ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
ఉమ్మడి సబ్జెక్ట్‌లకు సన్నద్ధత ఇలా
పేపర్–1లో అభ్యర్థులందరూ రాయాల్సిన, ఉమ్మడి సబ్జెక్ట్‌లుగా పేర్కొన్న జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్ట్‌లలో రాణించడానికి కూడా ప్రత్యేకంగా ప్రిపరేషన్ సాగించాలి.
జనరల్ అవేర్‌నెస్‌లో రాణించేందుకు.. చరిత్ర, భారత రాజ్యాంగం, భౌగోళిక శాస్త్రం, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే అంశాలను చదవాలి. ఆధునిక భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమ దశలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జాగ్రఫీకి సంబంధించి దేశ భౌగోళిక స్వరూపం, సహజ వనరులు, నదులు, అడవులు, పర్వతాలు, సముద్ర తీర ప్రాంతాలు తదితర అంశాలను తెలుసుకోవాలి.
రాజ్యాంగానికి సంబంధించి ముఖ్యమైన అధికరణలు, ప్రకరణలు, తాజా సవరణలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో తాజాగా దేశ శాస్త్ర, సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, రక్షణ వ్యవస్థ, ఇస్రో తదితర సంస్థల ప్రయోగాల గురించి అధ్యయనం చేయాలి.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో రాణించడానికి.. నంబర్ సిరిస్, కోడింగ్ – డీకోడింగ్ నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రమ్స్, స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, విజువల్ మెమరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఏప్రిల్ 18
- ఆన్‌లైన్ దరఖాస్తులో సవరణలకు అవకాశం: ఏప్రిల్ 22, 23 తేదీల్లో
- పేపర్–1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) తేదీ: 2024, జూన్ 4 నుంచి జూన్ 6
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.gov.in/
చదవండి: Central Govt jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- SSC Recruitment 2024
- SSC Jobs
- Staff Selection Commission
- Junior Engineer Jobs
- Junior Engineer Jobs in SSC
- Central Govt Jobs
- Eligibility to Apply
- Selection Procedure
- Syllabus Topics
- Ways to Success in Exam
- General Intelligence and Reasoning
- Science and Technology
- Geography
- GK
- Current Affairs
- latest notifications
- latest job notifications 2024
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- JuniorEngineer
- CentralGovernment
- notifications
- ApplicationQualifications
- exampreparation
- SuccessStrategies