Skip to main content

Central Govt jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/శాఖల్లో గ్రూప్‌–బి(నా­న్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడదల చేసింది. అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Career Opportunity   Apply Online for SSC Junior Engineer Recruitment   Junior Engineer Jobs in Central Govt Jobs   SSC Group-B Junior Engineer Recruitment Notice

మొత్తం పోస్టుల సంఖ్య: 968
అర్హత: డిప్లొమా(సివిల్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్‌ /మెకానికల్‌/ఎలక్ట్రికల్‌) చదివినవారు అర్హులు.
వయసు: సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు 32 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీల వారికి వయోపరిమితుల్లో సడలింపులు లభిస్తాయి.
వేతనం: సెవెన్త్‌ పే స్కేల్‌ ప్రకారం–రూ.­35,400 నుంచి రూ.1,12,400 ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: రెండు దశల్లో జరుగుతుంది. పేపర్‌–1, పేపర్‌–2 ఉంటాయి. 
    రెండు పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో(కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌–1లో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌(50 ప్రశ్నలు–50 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌(50 ప్రశ్నలు–50 మార్కులు), జనరల్‌ ఇంజనీరింగ్‌(100 ప్రశ్నలు–100 మార్కులు) విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పేపర్‌–2లో జనరల్‌ ఇంజనీరింగ్‌ విభాగం(100 ప్రశ్నలు–300 మార్కులు) నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం రెండు గంటలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.04.2024
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(పేపర్‌–1): 04.06.2024 నుంచి 06.06.2024వరకు
పేపర్‌–2 పరీక్ష: త్వరలో తేదీ ప్రకటిస్తారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.gov.in/

చదవండి: Bank Exam Guidance: 146 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ కొలువులు.. రాత పరీక్ష, సిలబస్‌ అంశాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 03 Apr 2024 01:24PM

Photo Stories