SSC CPO Notification 2024: 4,187 ఎస్‌ఐ పోస్ట్‌లు.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్..
- 4,187 ఎస్‌ఐ పోస్ట్‌ల భర్తీకి ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్
- ఢిల్లీ పోలీస్, సాయుధ దళాల్లో పోస్టుల భర్తీ
- రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్‌ల ద్వారా ఎంపిక
- వేతన శ్రేణి: రూ.35,400 -రూ.1,12,400
మొత్తం 4,187 పోస్ట్‌లు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజా నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ పోలీస్, కేంద్ర సాయుధ భద్రత బలగాలు (సీఏపీఎఫ్)కు సంబంధించి మొత్తం 4,187 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. వీటిల్లో ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్‌ఐ(ఎగ్జిక్యూటివ్)-పురుషులు- 125, ఎస్‌ఐ(ఎగ్జిక్యూటివ్)-మహిళలు-61 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-892(మహిళలకు 45) పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-1,597(మహిళలకు 160), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్-1,172 (మహిళలకు 59), ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీస్-278 (మహిళలకు 41), సశస్త్ర సీమాబల్: 62 (మహిళలకు 3) ఎస్‌ఐ పోస్టులు భర్తీ చేయనున్నారు.
అర్హతలు
- ఆగస్ట్ 1, 2024 నాటికి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- వయసు: ఆగస్ట్ 1, 2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ వర్గాలకు అయిదేళ్లు, ఓబీసీ వర్గాలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
నిర్దేశిత శారీరక ప్రమాణాలు
- ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు విద్యార్హతలు, వయో పరిమితితోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి.
- పురుష అభ్యర్థులు కనీసం 170 సెంటీ మీటర్లు; మహిళా అభ్యర్థులు 157 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి. పురుష అభ్యర్థులు 80 సెం.మీ; 85 సెం.మీ (శ్వాస పీల్చినప్పుడు) ఛాతి కొలత కలిగుండాలి. ఈ శారీరక ప్రమాణాలు కలిగున్న వారికే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.
ప్రారంభ వేతన శ్రేణి
ఎస్‌ఎస్‌సీ ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ ఎస్‌ఐ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే లెవల్-6తో ప్రారంభ వేతన శ్రేణి లభిస్తుంది. నెలకు రూ.35,400-రూ. 1,12,400తో ప్రారంభ వేతన శ్రేణి అందుతుంది. అదే విధంగా.. సీఏపీఎఫ్ ఎస్‌ఐ పోస్ట్‌లకు గ్రూప్-బి, ఢిల్లీ పోలీస్ ఎస్‌ఐ పోస్ట్‌లకు గ్రూప్-సి హోదా కల్పించారు. ఎస్‌ఐగా కొలువుదీరిన వారు సర్వీస్ నిబంధనలు, ప్రతిభ ఆధారంగా కమాండెంట్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
చదవండి: SSC CPO Notification 2024: కేంద్ర సాయుధ దళాల్లో 4,187 ఎస్‌ఐ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మూడంచెల ఎంపిక ప్రక్రియ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ విభాగాల్లోని ఎస్‌ఐ పోస్ట్‌లకు మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. తొలుత పేపర్-1 రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పేరిట దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం పేపర్-2 రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ మూడు దశల్లోనూ విజయం సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన వారికి.. చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి నియామకాలు ఖరారు చేస్తారు.
200 మార్కులకు పేపర్-1
ఎంపిక ప్రక్రియలో తొలిదశ రాత పరీక్ష పేపర్-1ను నాలుగు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (50 ప్రశ్నలు-50 మార్కులు), జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ (50 ప్రశ్నలు-50 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 ప్రశ్నలు-50 మార్కులు), ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ (50 ప్రశ్నలు-50 మార్కులు) ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. రాత పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.
ఫిజికల్ ఎండ్యూరెన్స్ సర్టిఫికెట్
పేపర్-1లో నిర్దిష్ట కటాఫ్ మార్కులు సాధించిన వారితో మెరిట్ జాబితా రూపొందించి.. నిర్దిష్ట నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి.. రెండో దశలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. పలు ఫిజికల్ ఈవెంట్లలో అభ్యర్థులు తమ ప్రతిభ చూపాల్సి ఉంటుంది.
పేపర్-2 ఇలా
ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌లో భాగంగా ఫిజికల్ ఈవెంట్లలో విజయం సాధించిన వారికి తదుపరి దశలో పేపర్-2 పేరుతో మరో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనే ఒకే విభాగంలో 200 ప్రశ్నలు-200 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. దీనికి కూడా రెండు గంటల సమయం కేటాయిస్తారు. పేపర్-1, పేపర్-2 రెండూ ఆబ్జెక్టివ్ విధానంలోనే బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటాయి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, మార్చి 28
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: మార్చి 30, 31 తేదీల్లో
- ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: మే 9, 10, 13 తేదీల్లో
- వెబ్‌సైట్: https://ssc.gov.in/
చదవండి: SSC Recruitment 2024: ఎస్‌ఎస్‌సీ-కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2049 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
రాత పరీక్షలో రాణించేలా
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్
ఈ విభాగంలో రాణించేందుకు వెర్బల్, నాన్-వెర్బల్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, విజువల్ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్ సిరిస్, కోడింగ్-డీకోడింగ్, నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రమ్స్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్
సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే ఈ విభాగంలో రాణించాలంటే.. భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఈ విభాగంలో బెస్ట్ స్కోర్ కోసం ప్యూర్ మ్యాథ్స్‌తోపాటు అర్థ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. డెసిమల్స్, ప్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్ అండ్ లాస్, అల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి.
ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అండ్ లాంగ్వేజ్
పేపర్-1లో మాత్రమే ఉండే ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో రాణించడానికి అభ్యర్థులు.. బేసిక్ గ్రామర్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్-స్పెల్ట్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్/ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, వన్‌వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్‌లను ప్రాక్టీస్ చేయాలి.
200 మార్కులతో ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అండ్ లాంగ్వేజ్ పేరుతో నిర్వహించే పేపర్-2లో రాణించడానికి అభ్యర్థులు.. ఫ్రేజెస్, సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ కంప్లీషన్, ప్రెసిస్ రైటింగ్, వొకాబ్యులరీలపై పట్టు సాధించాలి.
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- SSC Latest Notification
- SSC CPO Notification 2024
- police jobs
- Careers
- Sub Inspector Jobs
- SI Jobs
- Central Armed Force
- Delhi Police Department
- Staff Selection Commission
- General Intelligence and Reasoning
- General Knowledge and General Awareness
- Quantitative Aptitude
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- Staff Selection Commission
- Important Dates
- Selection Process
- Qualifications
- notifications