Skip to main content

SSC Recruitment 2024: ఎస్‌ఎస్‌సీ-కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2049 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి పరీక్ష నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Eligibility Criteria   Various Jobs in SSC  SSC Recruitment Notice   Candidate Selection Process

మొత్తం పోస్టుల సంఖ్య:  2049
ఖాళీలున్న విభాగాలు: ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డ్, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్, రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ మినిస్ట్రీ, హోం అఫైర్స్‌ మినిస్ట్రీ, డిఫెన్స్‌ మినిస్ట్రీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిషరీస్, సెంట్రల్‌ ట్రాన్స్‌లేషన్‌ బ్యూరో, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోసడలింపు లభిస్తుంది. 

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌-టైపింగ్‌/డేటా ఎంట్రీ/కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌(సంబంధిత పోస్టులకు మాత్రమే), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు- 200 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. పరీక్షా సమయం 60 నిమిషాలు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 25 ప్రశ్నలు-50 మార్కులకు, జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు-50 మార్కులకు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌(బేసిక్‌ అర్థమేటిక్‌ స్కిల్స్‌) 25 ప్రశ్నలు-50 మార్కులకు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(బేసిక్‌ నాలెడ్జ్‌)సబ్జెక్ట్‌లకు 25 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.03.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 22.03.2024 నుంచి 24.03.2024.
పరీక్ష తేదీ: 06.05.2024 నుంచి 08.05.2024 వరకు

వెబ్‌సైట్‌: https://ssc.gov.in

చదవండి: RRB Notification 2024: 9000 టెక్నీషియన్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 07 Mar 2024 12:38PM

Photo Stories