SSC Latest Notification: 2049 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ గైడెన్స్..
- 2049 పోస్ట్‌ల భర్తీకి ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్
- టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతగా ఉద్యోగాలు
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్‌ల ఆధారంగా ఎంపిక
మొత్తం పోస్టులు 2,049
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నియామక సంస్థ.. ఎస్‌ఎస్‌సీ తాజా నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని మొత్తం 2,049 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. రీజియన్ల వారీగానూ ఖాళీలను పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉండే సదరన్ రీజియన్‌లో 90 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు
- పోస్ట్‌ల స్థాయిని బట్టి 2024,మార్చి 18 నాటికి పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2024, జూన్ 13 నాటికి ఆయా అర్హతలు పొందే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయసు: పోస్ట్‌ను అనుసరించి జూన్ 1, 2024 నాటికి కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
రెండు దశల ఎంపిక ప్రక్రియ
ఎస్‌ఎస్‌సీ పోస్టుల భర్తీకి రెండు దశలుగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. తొలిదశలో ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో పొందిన మార్కులు, నిర్దిష్ట కటాఫ్ నిబంధనలను అనుసరించి.. మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఈ మెరిట్ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో టైపింగ్, డేటాఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ విభాగాల్లో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
200 మార్కులకు రాత పరీక్ష
తొలి దశలో రాత పరీక్ష నాలుగు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు–50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు–50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం ఒక గంట. ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
చదవండి: SSC Recruitment 2024: ఎస్‌ఎస్‌సీ-కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2049 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
అర్హతను బట్టి.. క్లిష్టత స్థాయి
రాత పరీక్షలో పేర్కొన్న విభాగాలు, అంశాలు అన్ని పోస్ట్‌లలోనూ ఉమ్మడిగా ఉన్నప్పటికీ.. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌కు పేర్కొన్న అర్హత స్థాయిని బట్టి ప్రశ్నల క్లిష్టత స్థాయి ఉంటుంది. పదో తరగతి అర్హత పోస్ట్‌లకు, ఇంటర్ అర్హత పోస్ట్‌లకు, డిగ్రీ అర్హత పోస్ట్‌లకు వేర్వేరు ప్రశ్నలు ఎదురవుతాయి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, మార్చి18
- దరఖాస్తుల సవరణకు అవకాశం: మార్చి 22 – మార్చి 24
- పరీక్ష తేదీలు: 2024 మే 6–8 తేదీల్లో జరుగనున్నాయి.
- వెబ్‌సైట్: https://ssc.nic.in/
రాత పరీక్షలో రాణించేలా
ఎంపిక ప్రక్రియలో కీలకమైన రాత పరీక్షలో విజయానికి.. అభ్యర్థులు ముందుగా ఆయా పోస్ట్‌లకు నిర్దేశించిన సిలబస్‌ను సమగ్రంగా అవగాహన చేసుకోవాలి. దాని ఆధారంగా ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి.
జనరల్ ఇంటెలిజెన్స్
ఈ విభాగంలో గుర్తులు,ప్రాబ్లమ్ సాల్వింగ్,రిలేషన్ షిప్, క్లాసిఫికేషన్, నంబర్ సిరీస్, సిమాటిక్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వెన్ డయాగ్రమ్స్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
జనరల్ అవేర్‌నెస్
దీనికి సంబంధించి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ టాపిక్స్‌పై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఈ విభాగంలో రాణించేందుకు అర్థమెటిక్‌తోపాటు ప్యూర్ మ్యాథ్స్ అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. నంబర్ సిస్టమ్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్, రేషియోస్, అల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, లీనియర్ ఈక్వేషన్స్, టాంజెంట్స్ వంటి ప్యూర్ మ్యాథ్స్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఈ విభాగంలో రాణించేందుకు వ్యాకరణంపై పట్టు సాధించాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొదలు ప్యాసేజ్ కాంప్రహెన్షన్ వరకూ.. అన్ని రకాల గ్రామర్ అంశాలను చదవాలి. ముఖ్యంగా యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, సినానిమ్స్, యాంటానిమ్స్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్‌లపై పట్టు సాధించాలి.
రివిజన్, మాక్ టెస్ట్‌లు
అభ్యర్థులు ప్రిపరేషన్‌లో నిరంతరం రివిజన్ కొనసాగించే వ్యూహం అనుసరించాలి. అదే విధంగా ఒక టాపిక్ లేదా యూనిట్ పూర్తయ్యాక నమూనా పరీక్షలు రాయాలి. అదే విధంగా అన్ని విభాగాలకు సంబంధించి మాక్ టెస్ట్‌లకు హాజరవ్వాలి. అర్థమెటిక్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ఇందుకోసం పదో తరగతి స్థాయిలోని గణిత పుస్తకాలతో తమ ప్రిపరేషన్ ప్రారంభించాలి. వాటిద్వారా ముందుగా కాన్సెప్ట్‌లపై అవగాహన ఏర్పరచుకుని.. అప్లికేషన్ దృక్పథంతో ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆయా అంశాలపై పట్టు లభిస్తుంది.
సీహెచ్‌ఎస్‌ఎల్, సీజీఎల్ పేపర్స్ ప్రాక్టీస్
అభ్యర్థులు గత అయిదేళ్లకు సంబంధించిన సీహెచ్‌ఎస్‌ఎల్, సీజీఎల్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం వల్ల వేగం పెరుగుతుంది. అంతేకాకుండా ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో అడిగే ప్రశ్నల శైలిపై అవగాహన ఏర్పడుతుంది. తద్వారా పరీక్షకు పూర్తిస్తాయి సన్నద్ధ లభిస్తుది. దీంతోపాటు పోస్ట్‌లకు దరఖాస్తు సమయంలోనే స్కిల్ టెస్ట్‌పై స్పష్టత ఏర్పరచుకుని వాటికి సంబంధించి కూడా సన్నద్ధత పొందడం మేలు.
చదవండి: SSC CPO Notification 2024: కేంద్ర సాయుధ దళాల్లో 4,187 ఎస్‌ఐ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- SSC Latest Notification
- SSC Recruitment 2024
- Staff Selection Commission
- SSC Jobs
- 2049 Jobs in SSC
- SSC Exams Guidance
- SSC Exams
- SSC Guidance
- SSC Study Material
- ssc exam preparation tips
- General Intelligence
- General Awareness
- Quantitative Aptitude
- english language
- Mock Tests
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- Exam Preparation Tips
- Selection process steps
- SSC Recruitment
- Group-C and Group-D recruitment