Skip to main content

Bharat Electronics Limited jobs: డిగ్రీ BTech అర్హతతో BELలో ట్రైనీ ఇంజనీర్ & ప్రాజెక్టు ఇంజనీర్ ఉద్యోగాలు జీతం నెలకు 55,000

Government of India Ministry of Defense job notification  Bharat Electronics Limited  BEL Trainee Engineer recruitment notification 2024
Bharat Electronics Limited

భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ( BEL ) సంస్థ నుండి ట్రైనీ ఇంజనీర్ & ప్రాజెక్టు ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

నవరత్న కంపెనీ అయినటువంటి ఈ సంస్థ మొత్తం 48 ఉద్యోగాల భర్తీ నిమిత్తం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది.

Inter అర్హతతో కొత్తగా 8వేల VRO ఉద్యోగాలు: Click Here

భర్తీ చేయబోయే ఉద్యోగాలు : 
ట్రైనీ ఇంజనీర్ – I & ప్రాజెక్ట్ ఇంజనీర్ – I అనే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మొత్తం ఉద్యోగాల సంఖ్య : 
మొత్తం పోస్టులు సంఖ్య – 48
ట్రైనీ ఇంజనీర్ –  I – 36
ప్రాజెక్ట్ ఇంజనీర్ – I  – 12

విద్యార్హత : 
1) ట్రైనీ ఇంజనీర్ –  I :

ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ సైన్స్ విభాగంలో  బి. ఈ / బి. టెక్ / బి. ఎస్సీ ( 4 సంవత్సరాల కోర్సు ) లో జనరల్ / EWS / ఓబీసీ అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత , ఎస్సీ ,  ఎస్టీ , PwBD    అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి వుండాలి.
2) ప్రాజెక్ట్ ఇంజనీర్ – I  :

ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ సైన్స్ విభాగంలో  బి. ఈ / బి. టెక్ / బి. ఎస్సీ ( 4 సంవత్సరాల కోర్సు ) లో జనరల్ / EWS / ఓబీసీ అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత , ఎస్సీ ,  ఎస్టీ , PwBD    అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి వుండాలి.

గరిష్ట వయస్సు :
ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు 28 సంవత్సరాల లోపు గల వారు
ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు 32 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు నిర్ధారణ కోసం 01/06/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు & ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లో పొందుపరిచిన ఫార్మాట్ ను ప్రింట్ తీసి , నింపి ఎన్వలప్ పై ఈ క్రింది విధంగా రాసి ,ఆఫీస్ వారి చిరునామాకు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలి.
“Application for the post of Trainee Engineer – I FOR CRL GAD/ Application for the post of Project Engineer– I FOCRLGAD”

దరఖాస్తు పంపవలసిన చిరునామా :
Smt. Rekha Aggarwal DGM (HR&A), Central Research Laboratory, Bharat Electronics Limited, P.O. Bharat Nagar, Sahibabad, Ghaziabad Pin – 201010, (U.P.) 

అప్లికేషన్ ఫీజు : 
ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల 177 రూపాయలు (150 రూపాయలు +  18 శాతం GST)
ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు  472 రూపాయలు (400 రూపాయలు + 18 శాతం GST)  దరఖాస్తు ఫీజు ను ఎస్బిఐ కలెక్ట్ ద్వారా చెల్లించాలి.,చెల్లించిన తర్వాత ఆ screenshot ను దరఖాస్తు కి జత చేయాలి.
ఎస్బిఐ కలెక్ట్ రిఫరెన్స్ నెంబరు ను అప్లికేషన్ లో ప్రస్తావించాలి.

ఎంపిక విధానం :
అభ్యర్థులను వ్రాత పరీక్ష & ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
వ్రాత పరీక్ష కు 85 శాతం మార్కులు & ఇంటర్వ్యూ కి 15 శాతం మార్కులు కేటాయించారు.

జీతం : 
ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారు మొదటి సంవత్సరం నెలకు 30,000/- రూపాయలు , రెండవ సంవత్సరం నెలకి 35,000 /- రూపాయలు , మూడవ సంవత్సరం నెలకి 40,000/- రూపాయలు జీతం లభిస్తుంది. దీనితో పాటుగా అదనపు సౌకర్యాలు ,  అలవెన్స్ లు లభిస్తాయి.
ప్రాజెక్ట్ ఇంజనీర్  ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారు మొదటి సంవత్సరం నెలకు 40,000/- రూపాయలు , రెండవ సంవత్సరం నెలకి 45,000 /- రూపాయలు , మూడవ సంవత్సరం నెలకి 50,000/- , నాల్గవ సంవత్సరం నెలకి 55,000/- రూపాయలు జీతం లభిస్తుంది.

ముఖ్యమైన తేదిలు : ఆఫ్లైన్ విధానం ద్వారా  దరఖాస్తు ఆఫీస్ వారి చిరునామాకు చేసుకోవడానికి చివరి తేది : 11/12/2024.

👉  Click here for notification

👉 Official WebsiteClick here

Published date : 06 Dec 2024 08:32AM

Photo Stories