Sucess Story: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి, వ్యవసాయం వైపు.. రూ. 5 లక్షలకు పైగా సంపాదిస్తూ..
మహబూబాబాద్ రూరల్ : ఆ దంపతులు.. కుటుంబ పోషణకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగ వేతనం సరిపోదని నిర్ణయానికి వచ్చారు.. అలాగే, ఒకరి కింద పని చేయడం వల్ల తమకు ఆర్థికాభివృద్ధి జరగదని, తమ కాళ్లపై తాము నిలబడాలని ఆలోచించారు. వెంటనే భర్త ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం ఏదైనా పంటలు సాగుచేద్దామని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా బీర సా గు చేపట్టి లాభాలు గడిస్తున్నారు. రోజుకు దాదాపు రూ. 17వేల వరకు సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారే మహబూబాబాద్ మండలం సోమ్లాతండా గ్రామానికి చెందిన బానోత్ రాజ్‌కుమార్, అశ్విని దంపతులు.
మూడేళ్లుగా బీర పంట సాగు అధిక లాభాలు పొందుతున్నారు. గ్రామానికి చెందిన బానోత్ సూర్య, కాంచన దంపతుల ఏకై క కుమారుడు రాజ్‌కుమార్ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 2019లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం ఫైనాన్షియల్ జిల్లాలో నెలకు రూ.30 వేల చొప్పున వేతనంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశాడు. రెండు ఏళ్లపాటు ఉద్యోగం చేశాక కరోనా సమయంలో తమ స్వగ్రామానికి చేరుకున్నాడు. అనంతరం 2022లో అశ్వినితో వివాహం జరిగింది.
ఈ క్రమంలో కుటుంబ పోషణకు సాఫ్ట్ వేర్ ఉద్యోగ వేతనం సరిపోదని భావించారు. ఏదైనా పంటలు సాగుచేద్దామని నిర్ణయించుకున్నారు. విద్యావంతురాలైన భార్య అశ్విని సహకారంతో కూరగాయల సాగు చేపట్టాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా మూడు ఎకరాల్లో బీరసాగు ప్రారంభించారు. కొంతమేరకు దిగుబడి పెరిగి ఆశించిన మేరకు ఆదాయం వచ్చింది. దీంతో దానికి అదనంగా మరో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మొత్తం ఆరు ఎకరాల్లో భూమిలో బీరసాగు చేస్తున్నారు. ఆ దంపతులకు మిత్రుడు ఇస్లావత్ శివాజీ సహకారం అందిస్తున్నాడు.
Delhi Chief Minister: ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అతిషి
ఇటీవల వర్షాలు అధికంగా కురిసి రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా కూరగాయల దిగుబడి తగ్గిపోవడంతో స్థానికంగా సాగు చేస్తున్న బీరకు అధిక డిమాండ్ పెరిగింది. బీర సాగు చేస్తున్న ప్రాంతంలో కిలో రూ.70 చొప్పున రోజుకు 30 కిలోల వరకు విక్రయిస్తున్నారు. రోజుకు రెండున్నర నుంచి మూడు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా మహబూబాబాద్ కూరగాయల మార్కెట్‌కు తీసుకెళ్లి కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు.
ఈ విధంగా రాజ్ కుమార్ అశ్విని దంపతులు రోజుకు రూ.15 వేల చొప్పున లాభం గడిస్తున్నారు. బీర తోట వద్ద కిలో రూ.70 చొప్పున విక్రయించడం వల్ల రోజూ 30 కిలోల వరకు అమ్ముడుపోయి ఆ విధంగా కూడా రోజుకు రూ.2,100 చొప్పున సంపాదిస్తున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)