Skip to main content

Digital Technology : డిజిట‌ల్ టెక్నాల‌జీపై మ‌హిళా వ‌ర్సిటీలో మూడు రోజుల శిక్ష‌ణ‌

Training session on digital technology for aspiring women entrepreneurs  Three days training on digital technology at padmavati women's university

తిరుపతి సిటీ: భవిష్యత్తు డిజిటల్‌ టెక్నాలజీదేనని, పారిశ్రామిక రంగంలో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రధాన పాత్ర పోషిస్తోందని కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. గురువారం పద్మావతి మహిళా వర్సిటీలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, ఎన్జీవోలకు ఆధునిక సాంకేతిక డిజిటల్‌ టెక్నాలజీపై మూడురోజుల పాటు జరగనున్న శిక్షణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, ప్రభుత్వం స్టార్ట్‌ అప్‌ పరిశ్రమలకు అన్ని విధాలుగా చేయూతనిస్తోందన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ వినియోగించుకుని మార్కెటింగ్‌, పేమెంట్‌ వంటి వ్యాపార వ్యవహారాలు సులభతరం అవుతాయన్నారు. ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌ పేరుతో నిర్వహిస్తున్న వైఫై డిఎక్స్‌ శిక్షణ ప్రపంచంలోని 18 దేశాలలో అమలు చేశారని, అందులో ఇండియాలో శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఎంపిక కావడం గర్వించదగ్గ విషయమన్నారు.

TET Exam : టెట్‌పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని న‌మ్మోద్దు!

మహిళలు ఈ డిజిటల్‌ ప్రపంచాన్ని ఎదుర్కొని, తాము నిర్వహిస్తున్న వ్యాపారాలను లాభసాటిగా మలుచుకునేందుకు అవసరమైన మెలకువలు వ్యాపార రంగంలో డిజిటల్‌ వ్యవస్థ వినియోగంపై అవగాహన పెంపొందించుకోనేలా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

World Polio Day 2024: అక్టోబర్ 24వ తేదీ ప్రపంచ పోలియో దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

యునైటెడ్‌ నేషనన్స్‌, థాయిలాండ్‌, సింగపూర్‌ ఫిలిప్పీన్స్‌, కొరియా ట్రైనర్స్‌ ఎంతో ఉత్తమమైన శిక్షణను ఇవ్వనున్నారని తెలిపారు. దేశంలో ఏకై క ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌ సెంటర్‌గా 2018 నుంచి 3 వేల మందికి పైగా మహిళలకు ఆత్మనిర్భర్‌ భారత్‌ అభివృద్ధి చేయడంలో మహిళ వర్సిటీ ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో విదేశీ ట్రైనర్లు డాక్టర్‌ కియోంగ్‌ కో, ప్రొఫెసర్‌ ఉమామహేశ్వరి, డీన్‌ ప్రొఫెసర్‌ విజయలక్ష్మి, మాజీ వీసీ దుర్గాభవానీ, రిజిస్ట్రార్‌ రజినీ, అధ్యాపకులు, విదేశాల నుంచి విచ్చేసిన ట్రైనర్లు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Oct 2024 11:33AM

Photo Stories