IISER Admissions 2024: IAT 2024తో ప్రవేశం కల్పించే క్యాంపస్‌లు-కోర్సులు.. పరీక్ష విధానం, బెస్ట్ స్కోర్‌కు మార్గాలివే..
- ఐఏటీ స్కోర్‌తో ఐఐఎస్‌ఈఆర్ క్యాంపస్‌ల్లో ప్రవేశం
- ఇంటర్ (ఎంపీసీ, బైపీసీ) అర్హతతో దరఖాస్తుకు అవకాశం
- కోర్సులు పూర్తి చేసుకుంటే సైన్స్ రంగంలో ఉజ్వల కెరీర్
దేశంలో సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ విభాగాల్లో నిపుణులను తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన విద్యాసంస్థలు.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌లు. ఐఐఎస్‌ఈఆర్‌కు దేశవ్యాప్తంగా ఏడు క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(ఇంజనీరింగ్ సైన్సెస్, ఎకనామిక్ సైన్సెస్), అయిదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ + మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. ఐఏటీ(ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్).
ఏడు క్యాంపస్‌లు.. 1933 సీట్లు
- ఐఏటీ స్కోర్ ఆధారంగా.. ఐఐఎస్‌ఈఆర్‌కు చెందిన ఏడు క్యాంపస్‌లలోని 1933 సీట్లకు పోటీ పడొచ్చు.
- బీఎస్+ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్: బెర్హంపూర్ క్యాంపస్‌లో 180 సీట్లు; భోపాల్ క్యాంపస్‌లో 255 సీట్లు; కోల్‌కత క్యాంపస్‌లో 250; మొహాలీ క్యాంపస్‌లో 250; పుణె క్యాంపస్‌లో 288; తిరుపతి క్యాంపస్‌లో 275; తిరువనంతపురం క్యాంపస్‌లో 320 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- భోపాల్‌లో బీఎస్: బీఎస్+ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ప్రోగామ్‌తోపాటు ఐఐఎస్‌ఈఆర్‌లో అందుబాటులో ఉన్న మరో రెండు ప్రత్యేక ప్రోగ్రామ్‌లు.. బీఎస్ ఇంజనీరింగ్ సైన్సెస్, బీఎస్ ఎకనామికల్ సైన్సెస్.వీటిని ప్రస్తుతం భోపాల్ క్యాంపస్‌లో అందిస్తున్నారు. ఇంజనీరింగ్ సైన్సెస్‌లో 84సీట్లు, ఎకనామిక్ సైన్స్‌లో 31సీట్లు ఉన్నాయి. విద్యార్థుల్లో ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్.. మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్‌లో నైపుణ్యాలు పెంచే ఉద్దేశంతో ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు.
ఐఏటీ-2024 అర్హతలు
2022, 2023 విద్యాసంవత్సరాల్లో సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియెట్(ఎంపీసీ, బైపీసీ)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 2024లో పరీక్షలకు హాజరైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
ఐఏటీ పరీక్ష ఇలా
ఐఏటీ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో 60 ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. బయాలజీ, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్ట్‌ల నుంచి 15 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. మొత్తం 240 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్క్ నెగెటివ్ మార్క్‌గా నిర్దేశించారు. పరీక్షకు లభించే సమయం మూడు గంటలు.
140 మార్కులు సాధించేలా
ఐఐఎస్‌ఈఆర్‌లో బీఎస్+ఎంఎస్, బీఎస్ (ఇంజనీరింగ్ సైన్సెస్, ఎకనామికల్ సైన్సెస్) కోర్సుల్లో ప్రవేశించాలనుకునే వారు ఐఏటీలో 140కి పైగా మార్కులు సాధించేలా కృషి చేయాలని సబ్జెక్ట్ నిపుణులు సూచిస్తున్నారు. గతంలో జనరల్ కేటగిరీలో 230 మార్కుల నుంచి 140 మార్కుల మధ్యలో సాధించిన వారికి సీట్లు లభించాయి.
వినూత్న బోధన విధానం
- ఐఐఎస్‌ఈఆర్ క్యాంపస్‌లలో బీఎస్+ఎంఎస్ కోర్సులకు వినూత్న బోధన విధానాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం పది సెమిస్టర్లుగా అయిదేళ్ల వ్యవధిలో ఉండే ఈ ప్రోగ్రామ్‌లో.. మొదటి రెండేళ్లు ఫౌండేషన్ కోర్సుగా ఉమ్మడి సబ్జెక్ట్‌లతో బోధన సాగుతుంది. మూడు, నాలుగు సంవత్సరాల్లో అభ్యర్థులు తాము ఎంచుకున్న మేజర్ (బయాలజీ/కెమిస్ట్రీ/ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్) సబ్జెక్ట్‌లలో బోధన సాగిస్తారు. వీటితోపాటు అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న మైనర్ సబ్జెక్ట్‌లను కూడా ఎంచుకోవచ్చు. అయిదో ఏడాది పూర్తిగా రీసెర్చ్ యాక్టివిటీస్‌పైనా, థీసిస్ వర్క్ పూర్తి చేసే విధంగా ఉంటుంది.
- ఐఐఎస్‌ఈఆర్-భోపాల్ క్యాంపస్‌లోని నాలుగేళ్ల బీఎస్ ఇంజనీరింగ్ సైన్సెస్‌లో.. మొదటి రెండేళ్లు ఉమ్మడి కరిక్యులం ఉంటుంది. ఆ తర్వాత రెండేళ్లు కెమికల్ ఇంజనీరింగ్ లేదా డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్‌లను మేజర్ సబ్జెక్ట్‌లుగా బోధన సాగిస్తారు. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్‌ను మేజర్ సబ్జెక్ట్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఉజ్వల అవకాశాలు
ఐఐఎస్‌ఈఆర్‌లో బీఎస్, బీఎస్+ఎంఎస్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు సైన్స్ రంగంలో ఉజ్వల కెరీర్స్ అందుకునే అవకాశముంది. ప్రభుత్వ రీసెర్చ్ లేబొరేటరీల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశించే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఫార్మా, కెమికల్, సిమెంట్ రంగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 2024 ఏప్రిల్ 1-మే13
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ: 2024 మే 16, 17 తేదీల్లో
- హాల్ టికెట్‌ల జారీ: 2024 జూన్ 1 నుంచి
- ఐఏటీ పరీక్ష తేదీ: 2024, జూన్ 9
- వెబ్‌సైట్: https://iiseradmission.in/
ఐఏటీలో బెస్ట్ స్కోర్‌కు మార్గాలివే
ఫిజిక్స్
ఈ సబ్జెక్ట్‌లో రిఫ్రాక్షన్స్, అప్లికేషన్ ఇన్ డైలీ లైఫ్, 'లా'స్ అండ్ మోషన్, గ్రేవిటేషన్, థర్మోడైనమిక్స్, ఆప్టిక్స్, డ్యూయల్ రేడియేషన్ అండ్ మ్యాటర్, థర్మో డైనమిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిజం అంశాలపై దృష్టి సారించాలి.
కెమిస్ట్రీ
విద్యార్థులు కొంత సులభంగా భావించే కెమిస్ట్రీలో.. పిరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పిరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, జనరల్ ప్రిన్సిపుల్స్ అండ్ ప్రాసెసెస్ ఆఫ్ ఐసోలేషన్ ఎలిమెంట్, పి-బ్లాక్ ఎలిమెంట్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్టినేషన్ కంపౌండ్స్, హాలోఅల్కనేస్ అండ్ హాలోరెన్స్‌లపై అవగాహన ఏర్పరచుకోవాలి.
బయాలజీ
జనటిక్ ఎవల్యూషన్, అవర్ ఎన్విరాన్‌మెంట్, లైఫ్ ప్రాసెస్, హ్యూమన్ సైకాలజీ, బయో టెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ప్రిన్సిపుల్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్ అండ్ వేరియేషన్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్, హ్యూమన్ ఫిజియాలజీ అండ్ అనాటమీ, ప్లాంట్ ఫిజియాలజీ, ఎకాలజీలపై దృష్టి పెట్టాలి.
మ్యాథమెటిక్స్
ఈ సబ్జెక్ట్‌లో క్వాడ్రటిక్ ఈక్వేషన్స్, మ్యాథమెటికల్ రీజనింగ్, స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ, రియల్ నంబర్, అనలిటికల్ జామెట్రీ ఇన్ టూ డైమెన్షన్, కోఆర్టినేట్ జామెట్రీ, మ్యాథమెటికల్ రీజనింగ్, ఎవల్యూషన్ ఆఫ్ ఇంటెగ్రల్స్,ప్రాబబిలిటీ, ట్రిగ్నోమెట్రీ, కాలిక్యులస్, ఫంక్షన్స్‌లపై పట్టు సాధించాలి.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు
ఐఐఎస్‌ఈఆర్ ఐఏటీ ప్రిపరేషన్ కోసం విద్యార్థులు పదకొండు, పన్నెండు తరగతులకు సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ఆధారంగా అధ్యయనం సాగించాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తూ.. ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీని పరిగణనలోకి తీసుకోవాలి. వీటితోపాటు.. మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరవడం కూడా మేలు చేస్తుంది. అదే విధంగా జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్ గత ప్రశ్న పత్రాల సాధన కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
బేసిక్స్‌పై పట్టు సాధిస్తూ
ఐఐఎస్‌ఈఆర్ ఐఏటీ ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు అన్ని సబ్జెక్ట్‌లలోని బేసిక్ కాన్సెప్ట్స్, ఫార్ములాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. అదే విధంగా ఆయా అంశాలను చదివేటప్పుడు అప్లికేషన్ అప్రోచ్‌తోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా ఫిజిక్స్‌లో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా ముఖ్యమైన కాన్సెప్ట్‌లు, ఫార్ములాలు, నిర్వచనాలను షార్ట్ నోట్స్‌గా రూపొందించుకుంటే.. రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది.
Tags
- IISER Admissions 2024
- IAT Exam 2024
- IAT Exam 2024 Eligibility
- IAT Exam Pattern
- Career Opportunities
- IISER Entrance Exam 2024
- IAT 2024 Preparation Tips
- BS-MS integrated courses
- Best institutes
- Indian Institutes of Science Education and Research
- BS-MS Dual Degree Programs
- Admissions in IISER
- Bachelor of Science degree admissions
- Career
- career in science sector
- After inter
- Engineering Sciences
- Economic Sciences
- NCERT Books
- IAT 2024 Exam Preparation Strategy
- admissions
- Courses
- AdmissionProcess
- ExamProcedures
- Preparation Strategies
- Score
- Success Tips
- sakshieducation admissions