Skip to main content

RMS CET Notification 2025 : రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్‌లో ప్ర‌వేశాల‌కు ఆర్ఎంఎస్ సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ప‌రీక్ష విధానం ఇలా..!

రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్‌లో చేరితే సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధనతోపాటు.. భవిష్యత్తులో త్రివిధ దళాల్లోని కమిషన్డ్‌ ర్యాంకు పోస్ట్‌లకు పోటీ పడే సంసిద్ధత లభిస్తుంది!!
Eligibility criteria for RMS Cet-2025  RMS Cet-2025 notification for sixth and ninth classes  Rashtriya Military Schools Common Entrance Test Notification 2025  Rashtriya Military Schools admission notification for 2025-26 academic year

వీటిలో ప్రవేశించాలంటే.. అయిదు మిలిటరీ స్కూల్స్‌ కలిపి ఉమ్మడిగా నిర్వహించే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఆర్‌ఎంఎస్‌ సెట్‌)లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది!! తాజాగా.. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు, తొమ్మిది తరగతులకు ఆర్‌ఎంఎస్‌ సెట్‌–2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. మిలిటరీ స్కూల్స్‌లో ప్రవేశ విధానం, బోధన ప్రత్యేకత తదితర వివరాలు..  

రక్షణ శాఖ ఆధ్వర్యం
రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్‌ను రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వీటిని 1952లో ఏర్పాటు చేశారు. వీటి ప్రధాన ఉద్దేశం పాఠశాల స్థాయి నుంచే త్రివిధ దళాలుగా పిలిచే ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలపై విధ్యార్థుల్లో ఆసక్తి కల్పించి.. వాటిల్లో చేరేలా తీర్చిదిద్దడం. ఈ స్కూల్స్‌లో ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధన అందిస్తున్నారు.
మొత్తం 5 పాఠశాలలు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్‌ ఉన్నాయి. అవి.. ఆర్‌ఎంఎస్‌–చెయిల్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌), ఆర్‌ఎంఎస్‌–అజ్మీర్‌ (రాజస్థాన్‌), ఆర్‌ఎంఎస్‌–బెల్గాం(కర్ణాటక), ఆర్‌ఎంఎస్‌–బెంగళూరు (కర్ణాటక), ఆర్‌ఎంఎస్‌–ధోల్‌పూర్‌ (న్యూఢిల్లీ). ప్రతి క్యాంపస్‌లో 300 సీట్లు చొప్పున అందుబాటులో ఉంటాయి. ఒక్కో తరగతిలో కనిష్టంగా 30 మంది, గరిష్టంగా 50 మందికి ప్రవేశం కల్పిస్తారు. రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్‌లో అమ్మాయిలకు కూడా ప్రవేశాలు కల్పిస్తారు.
విద్యార్హతలు
    ఆరో తరగతి: ప్రస్తుత విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
    తొమ్మిదో తరగతి:ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
వయసు
    ఆరో తరగతి: మార్చి 31, 2025 నాటికి 10 
నుంచి 12 ఏళ్ల మధ్యలో ఉండాలి. 
    తొమ్మిదో తరగతి: మార్చి 31, 2025 నాటికి 13 నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉండాలి. 
జాతీయ స్థాయిలో ఆర్‌ఎంఎస్‌ సెట్‌
దేశ వ్యాప్తంగా ఉన్న అయిదు రాష్ట్రీయ మిలటరీ స్కూల్స్‌లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశం కల్పించేందుకు జాతీయ స్థాయిలో ఆర్‌ఎంఎస్‌–సెట్‌ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఖరారు చేస్తారు. ప్రవేశ పరీక్ష ఆరు, తొమ్మిది తరగతులకు వేర్వేరుగా ఉంటుంది.
Current Affairs: సెప్టెంబ‌ర్ 9వ తేదీ.. టాప్ కరెంట్ అఫైర్స్ ఇవే!
మొత్తం 200 మార్కులకు పరీక్ష
ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు–50 మార్కులకు, ఇంటెలిజెన్స్‌ టెస్ట్‌ 50 ప్రశ్నలు–50 మార్కులకు, మ్యాథమెటిక్స్‌ 40 ప్రశ్నలు–50 మార్కులకు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 50 ప్రశ్నలు–50 మార్కులకు.. ఇలా మొత్తం 140 ప్రశ్నలు–200మార్కులకు పరీక్ష జరుగుతుంది. 
తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష
    తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష రెండు పేపర్లుగా 200 మార్కులకు నిర్వహిస్తారు. 
    పేపర్‌–1లో ఇంగ్లిష్‌ (50 ప్రశ్నలు–50 మార్కులు), హిందీ (20 ప్రశ్నలు–20 మార్కులు), సోషల్‌ సైన్స్‌ (30 ప్రశ్నలు–30 మార్కులు) 
సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్‌–2లో మ్యాథమెటిక్స్‌ (50 ప్రశ్నలు–50 మార్కులు), సైన్స్‌ (50 ప్రశ్నలు–50 మార్కులు) 
సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పెన్‌/పెన్సిల్‌ విధానంలో జరుగుతుంది. అభ్యరులు ఓఎంఆర్‌ షీట్‌లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాలలో ఉంటుంది.
ఇంటర్వ్యూ కూడా
రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్‌లో ప్రవేశానికి రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తదుపరి దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఆరో తరగతి అభ్యర్థులకు 20 మార్కులు, తొమ్మిదో తరగతి అభ్యర్థులకు 50 మార్కులు కేటాయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకొని తుది జాబితా రూపొందిస్తారు. 
Most Influential People: ‘ఏఐ 2024 అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల’ జాబితాలో టాప్ 10లో ఉన్న‌ది వీరే..
మంచి మార్కులకు మార్గమిదే
    దరఖాస్తు చేసుకుంటున్న తరగతి ఆధారంగా అంతకుముందు తరగతులకు సంబంధించి అకాడమీ పుస్తకాలు, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవాలి.
    ఆరో తరగతి అభ్యర్థులు నాలుగు, అయిదు తరగతుల మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌ పుస్తకాలను అధ్యయనం చేయాలి. 
    తొమ్మిదో తరగతి అభ్యర్థులు అయిదు నుంచి ఎనిమిది తరగతుల పుస్తకాలను ముఖ్యంగా మ్యాథమెటిక్స్, జనరల్‌ సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలి. 
    ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌కు సంబంధించి గ్రామర్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా యాంటానిమ్స్, సినానిమ్స్, ఆర్టికల్స్, ప్రిపొజిషన్స్, వెర్బ్స్‌పై దృష్టి పెట్టాలి.
→    జనరల్‌ సైన్స్‌కు సంబంధించి సైన్స్‌లోని ప్రాథమిక అంశాలు, మొక్కలు, బ్యాక్టీరియాలు, వ్యాధులు–కారకాలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
    సోషల్‌ సైన్స్‌కు సంబంధించి పర్యావరణం, హిస్టరీ, జాగ్రఫీ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా సివిక్స్‌కు సంబంధించిన ప్రాథమిక భావనలు తెలుసుకోవాలి. ఎకనామిక్స్‌లో జనాభా, జన గణన గణాంకాలు, పంటలు –ఉత్పత్తులు, అవి ఎక్కువగా పండే ప్రదేశాల గురించి తెలుసుకోవాలి. 
    జనరల్‌ నాలెడ్జ్‌ కోసం ముఖ్యమైన వ్యక్తులు, అవార్డులు–విజేతలు, ప్రదేశాలు, క్రీడలు–విజేతలు, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతి వంటి పదవులు చేపట్టిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలి.
సీబీఎస్‌ఈ సిలబస్‌
మిలిటరీ స్కూల్స్‌లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు ప్రాక్టికల్‌ అప్రోచ్‌ సొంతమవుతోంది. అకడెమిక్స్‌తోపాటు ఫి­జికల్‌ ట్రైనింగ్, గేమ్స్, ఇతర యాక్టివిటీస్‌లో కూడా శిక్షణ ఉంటుంది. ఫలితంగా విద్యార్థులు సీబీఎస్‌ఈ+2 పూర్తి చేసుకునే సమయానికి సాయుధ దళాల్లో ఉద్యోగాలకు అవసరమైన సంసిద్ధత లభిస్తోంది.
ముఖ్య సమాచారం
    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 
    ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024,సెప్టెంబర్‌ 19
    పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://applydelhi.nielit.gov.in/, https://www.rashtriyamilitaryschools.edu.in/index.html

Paris Paralympics Winners: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు 29 పతకాలు.. విజేతలు వీరే..

Published date : 10 Sep 2024 11:04AM

Photo Stories