Skip to main content

Admission in MANUU Hyderabad: మనూ, హైదరాబాద్‌లో యూజీ, పీజీ ప్రవేశాలు.. కోర్సుల వివరాలు ఇవే..

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ యూనివర్శిటీ(మనూ).. ప్రధాన క్యాంపస్‌తో పాటు అనుబంధ క్యాంపస్‌లలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్‌ విధానంలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Apply now for academic programs at MANUU Hyderabad  UG and PG Admission in MANUU Hyderabad  Admissions Open for UG PG PhD Diploma and Certificate Courses at MANUU

మనూ క్యాంపస్‌లు: హైదరాబాద్, లక్నో, శ్రీనగర్, భోపాల్, దర్భంగా, అసన్‌సోల్, ఔరంగాబాద్, సంభాల్, నుహ్, బీదర్, బెంగళూరు, కటక్‌.

కోర్సుల వివరాలు
పీహెచ్‌డీ: ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, హిందీ, పర్షియన్, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్, ఉమెన్‌ స్టడీస్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌ సైన్స్, సోషల్‌ వర్క్, ఇస్లామిక్‌ స్టడీస్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, డెక్కన్‌ స్టడీస్, ఎడ్యుకేషన్‌ తదితరాలు.
పీజీ ప్రోగ్రామ్‌: ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌(సీఎస్‌), ఎంఈడీ, ఎల్‌ఎల్‌ఎం.
యూజీ ప్రోగ్రామ్‌: బీటెక్‌(సీఎస్‌), బీటెక్‌(సీఎస్‌) లేటరల్‌ ఎంట్రీ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ, బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్‌).
ప్రొఫెషనల్‌ డిప్లొమా: డీఈఎల్‌ఈడీ, పాలిటెక్నిక్‌–డిప్లొమా, పాలిటెక్నిక్‌–డిప్లొమా లేటరల్‌ ఎంట్రీ.
మెరిట్‌ ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు
పీజీ ప్రోగ్రామ్‌(పార్ట్‌టైమ్‌): ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంఒకేషనల్, పీజీడీటీఈ, ఎంసీఏ.
పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌(పార్ట్‌టైమ్‌): ఫంక్షనల్‌ ఉర్దూ, హిందీ అండ్‌ ట్రాన్స్‌లేషన్, ప్రొఫెషనల్‌ అరబిక్, ట్రాన్స్‌లేషన్‌.
డిప్లొమా ప్రోగ్రామ్‌(పార్ట్‌టైమ్‌): తహసీన్‌–ఇ–గజల్, అరబిక్, పర్షియన్, పాష్టో, ఫ్రెంచ్, రష్యన్, ఇస్లామిక్‌ స్టడీస్‌.
సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌(పార్ట్‌టైమ్‌): ఉర్దూ సర్టిఫికేట్‌ కోర్సు, ప్రొఫిషియన్సీ ఇన్‌ అరబిక్, పర్షియన్, పాష్టో, ఫ్రెంచ్, రష్యన్, తెలుగు, కశ్మీరీ, టర్కిష్‌.
అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ప్రవేశ పరీక్ష ఆధారిత ప్రొఫెషనల్‌/టెక్నికల్‌/లా/ఒకేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.05.2024.
ప్రవేశ పరీక్ష ఆధారిత పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.05.2024.
మెరిట్‌ ఆధారిత ప్రోగ్రామ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2024.

వెబ్‌సైట్‌: https://manuucoe.in/regularadmission

చదవండి: Admissions in IIT Gandhinagar: ఐఐటీ గాంధీనగర్‌లో ఎంటెక్‌ ప్రవేశాలు.. నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్‌..

Published date : 18 Apr 2024 10:47AM

Photo Stories