Skip to main content

AILET Notification for Law Admissions : నేషనల్‌ లా యూనివర్శిటీలో వివిధ విభాగాల్లో ప్ర‌వేశాల‌కు ఏఐఎల్‌ఈటీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

న్యూఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్శిటీ ఢిల్లీ 2025–25 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆల్‌–ఇండియా లా ఎంట్రన్స్‌ టెస్ట్‌–2025 (ఏఐఎల్‌ఈటీ) నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. 
AILET Notification for admissions at National Law University in UG, PG, and Ph D Courses

కోర్సుల వివరాలు:
డిగ్రీ కోర్సులు: ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌) ప్రోగ్రామ్‌–120 సీట్లు; బీకాం ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్‌) నాన్‌–రెసిడెన్షి యల్‌ ప్రోగ్రామ్‌–60 సీట్లు.
అర్హత: సీనియర్‌ సెకండరీ స్కూల్‌ ఎగ్జామినేషన్‌(10+2) ఉత్తీర్ణులవ్వాలి.
పీజీ కోర్సులు:  ఏడాది నాన్‌ రెసిడెన్షియల్‌ ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌–80 సీట్లు; ఎల్‌ఎల్‌ ఎం(ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ లా అండ్‌ మేనేజ్‌మెంట్‌) ప్రోగ్రామ్‌–25 సీట్లు; ఎంఏ(ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ లా అండ్‌ మేనేజ్‌మెంట్‌) ప్రోగ్రామ్‌–25 సీట్లు.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
పీహెచ్‌డీ కోర్సులు: లా, సోషల్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌లు–31 సీట్లు.
ఎంపిక విధానం: ఆల్‌ ఇండియా లా ఎంట్రన్స్‌ టెస్ట్‌–2025  ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 
దరఖాస్తులకు చివరితేది: 18.11.2024.
వెబ్‌సైట్‌: https://nationallawuniversitydelhi.in
                 www.nludelhi.ac.in.

NIMS MPT Admissions : నిమ్స్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Published date : 23 Aug 2024 08:23AM

Photo Stories