Civil Engineering Career: సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో ఎన్నో స్పెషలైజేషన్లు.. ఉద్యోగవకాశాలు ఇలా..
సివిల్ ఇంజనీర్లు ప్రకృతికిదగ్గరగా ఉండేవాతావరణంలో పని చేస్తున్నందున, వారు మానవజాతి అవసరాన్ని అర్థం చేసుకొని తదనుగుణంగా శాశ్వత పరిష్కా రాలు సూచిస్తారు. సివిల్ ఇంజనీరింగ్ లోని నీటి పారుదల విభాగంలో అపారమైన ఖ్యాతి గణించిన ఎందరో మహనీయులలో దక్షిణాదికిచెందిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మరియు ఇంజనీర్ కానూరు లక్ష్మణ రావులు ప్రముఖులు.
Also Check: College Predictor - 2024 (AP & TG EAPCET, POLYCET & ICET)
నీటి పారుదల మరియు నీటి వనరుల నిర్వహణ రంగంలో భారతదేశానికి భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా మన దేశంలోని అన్ని సాంకేతిక సంస్థలలో ఆయిన జన్మదినము అయిన సెప్టెంబర్ 15ను 'ఇంజనీర్స్ డే' గా జరుపుకుంటారు.
పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన ఇంజనీర్ కానూరు లక్ష్మణ రావు కేంద్ర నీటిపారుదల & విద్యు త్ శాఖ మంత్రిగా పనిచేశారు మరియు పార్లమెంటు సభ్యునిగా సమాజానికి తన సేవలు అందించారు. నదుల అనుసంధానం ప్రాజెక్ట్ ప్రతిపాదించటం తో పాటూ మరెన్నో ప్రాజెక్టులు చేసిన ఈయనను 'ఫాదర్ అఫ్ ఇండియన్ వాటర్ మానేజ్మెంట్ అండ్ అగ్రికల్చర్' అని పిలుస్తారు.
సివిల్ ఇంజనీరింగ్ లో ఏడు ప్రధాన స్పెషలైజేషన్లు ఉన్నాయి:
1. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్
○ ఇందులో స్ట్రక్చరల్ ఎనాలిసిస్ కి సంబందించిన సాలిడ్ మెకానిక్స్, థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ వంటివి మరియు డిజైన్ కి సంబంధించి కాంక్రీట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ వంటిఅనేక కోర్సులు నేర్పిస్తారు.
○ భవనాలు, వంతెనలు మరియు ఇతర నిర్మా ణాలు వివిధ భారాలను (gravity, wind, earthquakes) సురక్షితంగా తట్టుకునేలా స్ట్రక్చరల్ ఇంజనీర్లు డిజైన్ చేస్తారు.
2. జియోటెక్నికల్ ఇంజనీరింగ్
○ ఈ స్పెషలైజేషన్ లో సాయిల్ మెకానిక్స్, ఫౌండేషన్ ఇంజనీరింగ్, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ వంటి కోర్సులు నిర్వహించబడతాయి. ఇందులో మట్టి లక్షణాలు మరియు ప్రవర్తన(properties and behaviour of soils), నిర్మా ణాల కోసం పునాదుల రూపకల్పన మరియు విశ్లేషణ (design and analysis of foundations for structures) గూర్చివిపులంగా ఉంటుంది.
○ రోడ్లు, ఆనకట్టలు, సొరంగాలు మరియు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రణాళిక మరియు నిర్మా ణానికిజియోటెక్నికల్ ఇంజనీరింగ్ పాత్రచాలా ప్రధానం.
3. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్
○ రవాణా నెట్ వర్క్ లు మరియు సిస్టమ్ లను ప్లాన్ చేసే పద్ధతులు, ట్రాఫిక్ ఫ్లో, ట్రాఫిక్ నియంత్రణ పరికరాల అధ్యయనం, రహదారిపేవ్ మెంట్ల రూపకల్పన, రహదారుల నిర్వహణ,మన్నిక మరియు భద్రత వంటి విషయాల గురించి తెలుసుకోవడానికి రవాణా ప్రణాళిక,ట్రాఫిక్ ఇంజనీరింగ్ మరియు పేవ్ మెంట్ డిజైన్ వంటికోర్సులు ఉంటాయి.
4. వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్
○ ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్స్ మరియు హైడ్రాలజీ ఇందులో బోధించబడతాయి. ఇవి ఆనకట్టలు, కాలవలు మరియు పైప్ లైన్ ల వంటిహైడ్రాలిక్ నిర్మా ణాల రూపకల్పనకు వర్తించే ఫ్లూయిడ్ మెకానిక్స్ సూత్రాలను, పర్యావరణంలో నీటిపంపిణీమరియు కదలికను విశ్లేషించే వర్షపాతం - ప్రవాహ సంబంధాలు మరియు వరద విశ్లేషణ వంటి విషయాలపై అవగాహన కల్పిస్తాయి.
5. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్
○ నీరు మరియు మురుగునీటి నిర్వహణ, వాయు కాలుష్య నియంత్రణ పద్ధతులు మరియు ఘన వ్యర్థాల నిర్వహణ వంటికోర్సులు, నీటిశుద్ధి, పంపిణీ వ్యవస్థలు మరియు
పర్యావరణ అనుకూల పద్ధతిలో ఘన వ్యర్థాల నిర్వహణ మరియు సురక్షిత విసర్జన వంటి టెక్నా లజీస్ ఈ స్పెషలైజేషన్ లో ఉన్నాయి.
○ పర్యావరణ ఇంజనీర్లు ప్రజా ఆరోగ్యం మరియు పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికిమరియుగాలి, నీరు, నేల కాలుష్యాలని తగ్గించడానికిపని చేస్తారు.
6. కన్స్ర ్టక్షన్ ఇంజనీరింగ్ అండ్ మానేజ్మెంట్ (CEM)
○ సాంకేతికతలు మరియు నిర్మా ణ ప్రక్రియలలో ఉపయోగించేపరికరాలు, కాంక్రీటు, ఉక్కుమరియు కలప వంటి నిర్మా ణ సామగ్రి యొక్క లక్షణాలు మరియు అనువర్తనాలు తెలుసుకోవటానికి నిర్మా ణ వస్తువులు, నిర్మా ణ పద్ధతులు మరియు సామగ్రి, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ ఈ స్పెషలైజేషన్లో నేర్పబడుతాయి.
○ నిర్మా ణ ప్రాజెక్టులకు సంబంధించిన నష్టాలను అర్థం చేసుకోవడంలో ఇది కీలకమైనది.సంభావ్య ప్రమాదాలను గుర్తించి వాటిని తగ్గించడానికి వ్యూహాలను రచించటానికిమరియు ప్రాజెక్ట్ విజయాన్ని నిర్ధారించడానికిCEM సహాయపడుతుంది.
7. సర్వేయింగ్ అండ్ జియోమాటిక్స్
○ భూమిని కొలిచి, మ్యాప్ చేయడానికిసూత్రాలు మరియు సాంకేతికతలను, రిమోట్ సెన్సింగ్ టెక్నా లజీ మరియు సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లలో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (GIS)వంటిఅంశాల గురించి తెలుసుకోవడానికి సర్వేయింగ్, రిమోట్ సెన్సింగ్ మరియు GIS వంటి కోర్సులు ఈ స్పెషలైజేషన్ లో నేర్పిస్తారు.
Top 20 Engineering (Branch wise) Colleges in Telangana - Click Here
ఇతర సబ్జెక్టులు
- మాథెమాటిక్స్ అండ్ న్యూ మరికల్ మెథడ్స్: సివిల్ ఇంజనీరింగ్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ కు సంబందించిన అప్లైడ్ మాథెమాటిక్స్ అండ్ న్యూ మరికల్ టెక్నిక్స్.
- ఇంజనీరింగ్ మెకానిక్స్: సివిల్ ఇంజనీరింగ్ సమస్యలకు వర్తించే స్టాటిక్స్ మరియు డైనమిక్స్ సూత్రాలు.
- ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ ప్రాక్టీసెస్: సివిల్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ లో నైతిక పరిగణనలు మరియు వృత్తిపరమైన బాధ్యతలు.
ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్టులు
- ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్: ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ల యొక్క పర్యావరణ ప్రభావాలు అంచనా వేయటం.
- సస్టైనబుల్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్: ఇంజనీరింగ్ డిజైన్ మరియు నిర్మా ణ పద్ధతుల్లో సస్టైనబుల్ సూత్రాలను చేర్చడం.
ఆచరణాత్మక శిక్షణ
- ప్రయోగశాల సెషన్లు: మెటీరియల్ టెస్టింగ్, సాయిల్ అనాలిసిస్ మరియు స్ట్రక్చరల్ బిహేవియర్ లలో సైద్ధాంతిక భావనలను బలోపేతం చేయడానికిప్రయోగాలు చేయడం.
- క్షేత్రసందర్శనలు మరియు ఇంటర్న్ షిప్ లు: సివిల్ ఇంజినీరింగ్ ప్రాక్టీస్ లో ఆచరణాత్మక అనుభవాన్నిపొందడానికినిర్మా ణ స్థలాలను సందర్శించడం మరియు ఇంటర్న్ షిప్ అవకాశాలు.
Also Read: `Job Oriented Certifications` for core branches
ప్లేస్మెంట్ అవకాశాలు:
● ప్రైవేట్ సంస్థలు: ఎల్ & టిలిమిటెడ్, షాపూర్జీపల్లోంజీ అండ్ కో. లిమిటెడ్., టి.సి.ఈ, ఎం.ఈ.ఐ.ఎల్,ఆర్వీ అసోసియేట్స్, ఎల్.ఈ.ఏ అసోసియేట్స్ మరియు మరెన్నో అగ్రశ్రేణి కంపెనీలలో అద్భుతమైన ప్లేస్ మెంట్ అవకాశాలు లభిస్తాయి.
● ప్రభుత్వ రంగ ఉద్యో గాలు: పబ్లిక్ (NTPC, ONGC, GAIL, SAIL వంటి మహారత్న మరియు నవరత్న కంపెనీలు), మరియు ప్రభుత్వ రంగాలలో (సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (CPWD),పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (PWD), ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (IES) లేదా రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ (RRB) వంటిపరీక్షల ద్వారా భారతీయ రైల్వేలు, నేషనల్ హైవేస్ అథారిటీఆఫ్ ఇండియా (NHAI), మున్సిపల్ కార్పొరేషన్లు, నీటిపారుదల శాఖ, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC), తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ (TGWRDC), నీటిపారుదల & CAD శాఖ, తెలంగాణ) ఉద్యో గ అవకాశాలు ఉంటాయి.
పరిశోధన మరియు అభివృద్ధి: IITలు, NITలు, విదేశీ విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధనా సంస్థలు (సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (CBRI), సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్ (CRRI), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (NIH)) ఉన్నత విద్యను అభ్యసించేలా విద్యార్థులను ప్రేరేపిస్తూ అత్యాధునిక పరిశోధన ప్రాజెక్టులు మరియు ఆవిష్కరణలలో పాల్గొనేఅవకాశాలు కల్పిస్తాయి.అంతేకాకుండా కొన్ని కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్, ఐటిమరియు వాటి అనుబంధ బ్రాంచీలు అయిన AI & ML / AI & DS / బ్లాక్ చైన్ టెక్నా లజీ / సైబర్ సెక్యూరిటీ /ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ వంటివాటిలో మైనర్ ఇంజనీరింగ్ పేరుతో ఏదైనా ఒక డిగ్రీపొందేఅవకాశం కూడా ఉంది.
అంకుర సంస్థలు: ప్రయోగాలలో మరియు పరిశోధనలలో తగిన అనుభవం గడించినవారికిఅంకుర సంస్థలు (startups) స్థాపించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇటువంటి ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికిఏఐసిటిఈ (AICTE) యశస్వి (YASASVI) పేరు తో స్కా లర్షిప్ ను కూడా అందచేస్తోంది.
చివరగా, సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీని అభ్యసించడం అనేది ఆవిష్కరణ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ ద్వారా ప్రపంచాన్ని రూపొందించడానికి నిబద్ధత. ఇది డైనమిక్ కెరీర్ ను అందిస్తుంది. ఇక్కడ ప్రతి ప్రాజెక్ట్ సమాజంపై ప్రభావాన్ని చూపించేలా బలమైన మౌలిక సదుపాయాలను రూపొందించడం నుండి పర్యావరణ వనరులను నిర్వహించడం వరకు వివిధ దశలుగా విస్తరించి ఉంటుంది.
సివిల్ ఇంజనీరింగ్ యొక్క విభిన్నస్పెషలైజేషన్లలో విభిన్న అవకాశాలతో వృత్తిపరమైన వృద్ధి మరియు గుర్తింపు మాత్రమే కాకుండా సురక్షితమైన మరియు మరింత స్థిరమైన భవిష్యత్తుకు దోహదపడ్డాం అనేసంతృప్తి కూడా అందిస్తుంది.
- డా. కేజగన్నాధ రావు
సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి
చైతన్య భారతి ఇన్స్టి ట్యూ ట్ అఫ్ టెక్నా లజీ