Skip to main content

New Rule in Exams 2025 : ఈఏపీసెట్‌, ఎడ్‌సెట్‌, ఐసెట్‌ సహా వివిధ‌ పరీక్షలకు కొత్త రూల్ ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో వివిధ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల‌కు సెట్‌ కమిటీ కొత్త నిబంధన తీసుకోచ్చింది. ఈఏపీసెట్‌, ఎడ్‌సెట్‌, ఐసెట్‌తో స‌హా.. వివిధ ప్రవేశ పరీక్షల‌కు నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదని నిబంధన అమలవుతున్న విష‌యం తెల్సిందే.
Telangana Exams New Rules

అయితే ఇకపై ఈ ప్ర‌వేశ‌ పరీక్షల‌ సమయానికి 15 నిమిషాల ముందు వచ్చిన అభ్యర్థులనే సెంటర్‌ లోపలకి అనుమతిస్తామని స్పష్టంచేసింది. 15 నిమిషాల ముందే గేట్లను మూసేయనున్నట్టు వెల్లడించింది. 

టీజీపీఎస్సీ పరీక్షలకు...
టీజీపీఎస్సీ పరీక్షలకు అరగంట ముందుగానే గేట్లు మూసేస్తున్నారు. జేఈఈ, నీట్‌లోనూ ఇదే నిబంధన అమలవుతన్నది. క‌నుగా ఇలాగే తెలంగాణలోని వివిధ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు 15 నిమిషాలు ఈ నిబంధ‌న‌ను ముందే గేట్లను మూసివేయాల‌ని సెట్‌ కమిటీ నిర్ణ‌యించింది.

Published date : 10 Feb 2025 01:10PM

Photo Stories