TG EAPCET 2025: ఒక్కో ప్రశ్నకు రూ.500.. కారణం ఇదే!

ఇందులో ప్రశ్నలకు వారు ఇచ్చిన జవాబులపై విద్యార్థులు అభ్యంతరాలు లేవనెత్తేందుకు అవకాశం ఉంది. గత ఏడాది వరకూ దీనికి ఎలాంటి ఫీజు ఉండేది కాదు.
కానీ ఈసారి కొత్తగా ప్రతి సవాలు లేదా అభ్యంతరానికి రూ.500 చొప్పు న చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. సెట్ నిర్వహణపై ఫిబ్రవరి 3న సమావేశమైన ఈఏపీ సెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
చదవండి: ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | టిఎస్-ప్రివియస్ పేపర్స్ | గెస్ట్ కాలమ్
సరైనదని తేలితే రూ.500 వాపస్
విద్యార్థి లేవనెత్తిన అభ్యంతరాన్ని నిపుణుల బృందం పరిశీలిస్తుంది. అది సరైనదని తేలితే రూ.500 తిరిగి చెల్లిస్తారు. లేని పక్షంలో ఎలాంటి చెల్లింపు ఉండదు. ‘కీ’లోని జవాబులపై ప్రతి సంవవత్సరం ఎలాంటి హేతుబద్ధత లేకుండా అభ్యంతరాలు వస్తున్నాయి.
గత సంవత్సరం 906 అభ్యంతరాలు వచ్చాయి. వీటన్నింటినీ నిపుణుల కమిటీ పరిశీలించి, వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాతే తుది ‘కీ’, ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా నిబంధన తీసుకువస్తున్నట్టు వారు తెలిపారు.
![]() ![]() |
![]() ![]() |
ఈసారి 100 శాతం సిలబస్
ఈఏపీ సెట్‌కు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకూ దరఖాస్తులు తీసుకుంటారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ ఫిబ్రవరి 20వ తేదీన విడుదల కానుంది.
అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్ష ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరుగుతుంది. ఇంజనీరింగ్ పరీక్ష మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ జరుగుతుంది. కోవిడ్ వల్ల గతంలో ఇంటర్ సిలబస్‌ను తగ్గించారు. ఈసారి మొదటి, రెండో సంవత్సరం నుంచి వంద శాతం సిలబస్ ఉంటుంది. కమిటీ సమావేశంలో జేఎన్‌టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఇ.పురుషోత్తం, ఎస్‌కే మహమూద్, సెట్ కన్వీనర్ డీన్ కుమార్, కో–కన్వీనర్ ప్రొఫెసర్ కె.విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీజీ ఈఏపీసెట్ నిర్వహణ వివరాలు..
20.2.25 |
సెట్ నోటిఫికేషన్ విడుదల |
25.2.25 |
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ |
4.4.25 |
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు |
29, 30.4.25 |
అగ్రి, ఫార్మసీ సెట్ |
2–5.5.25 |
ఇంజనీరింగ్ సెట్ |