Skip to main content

Telangana CETS 2025: తెలంగాణ ‘సెట్స్‌’దరఖాస్తుల స్వీకరణ పై తర్జన భర్జన!

Telangana CETS 2025: తెలంగాణ ‘సెట్స్‌’దరఖాస్తుల స్వీకరణ పై తర్జన భర్జన!

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ తేదీలను ఖరారు చేసేందుకు ఈఏపీ సెట్‌ కమిటీ గురువారం భేటీ అవుతోంది. ఇప్పటికే ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను సాంకేతిక విద్య మండలి వెల్లడించింది. ఏప్రిల్‌ 29 నుంచి మే 5వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 

అయితే, దరఖాస్తుల స్వీకరణ, సమగ్ర సమాచార బులిటెన్‌ ఇప్పటివరకూ విడుదల చేయలేదు. వీటిని ఫైనల్‌ చేసేందుకు సెట్‌ కమిటీ సమావేశమవుతోంది. దీనికన్నా ముందు ఇంటర్‌ బోర్డ్‌ అధికారులతో జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు చర్చలు జరిపారు. ఇంటర్‌ హాల్‌ టిక్కెట్ల తేదీలను ఈఏపీ సెట్‌ దరఖాస్తులకు ప్రామాణికంగా తీసుకుంటారు. 

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. వారి హాల్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచాల్సి ఉంది. ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసే విద్యార్థి సమాచారం మొత్తం ఇంటర్‌ హాల్‌ టికెట్‌ అనుసంధానంతోనే సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తుంది. ఇంటర్‌ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి జరుగుతాయి. 

ఇదీ చదవండి: JEE Mains 2025 January 29th Exam Analysis: Morning & Evening Shift

పరీక్ష ఫీజు గడువును దఫదఫాలుగా పొడిగిస్తూ వచ్చారు. దీంతో హాల్‌ టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా ఇంకా విడుదల చేయలేదు. దీనిపై స్పష్టత ఇవ్వాలని, దీని ఆధారంగానే ఈఏపీ సెట్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తామని సెట్‌ కన్వీనర్‌ ఇంటర్‌ అధికారులకు లేఖ రాశారు. హాల్‌ టికెట్లపై ఇంటర్‌ బోర్డ్‌ గురువారం స్పష్టత ఇస్తుందని ఆశిస్తున్నారు.  

కొత్త సీట్ల పంచాయితీ 
ఇంజనీరింగ్‌లో గత ఏడాది కొత్త సీట్ల పెంపునకు కొన్ని ప్రైవేటు కాలేజీలకు కోర్టు అనుమతించింది. అప్పటికే ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ పూర్తవటంతో కోర్టు అనుమతితో పెరిగిన 6 వేల సీట్లకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఈఏపీ సెట్‌ తర్వాత కౌన్సెలింగ్‌ జాబితాలో ఆ ఆరు వేల సీట్లు చేర్చడమా? లేదా? అనే అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో బుధవారం సమావేశమయ్యారు. 

సీట్ల పెంపు వల్ల ఇబ్బందులు, ఇతర బ్రాంచీల్లో సీట్ల తగ్గింపు వల్ల సమస్యలను ఆమెకు వివరించారు. ఈ అంశంపై త్వరలో ఉన్నతాధికారులతో సీఎస్‌ భేటీ అవుతున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. పెంచిన 6 వేల సీట్లు కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీలోనే ఉన్నాయి. కన్వీనర్‌ కోటా కింద 70 శాతం సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ సీట్లకు ఎంపికైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలి. 

ఇదీ చదవండి: TS Inter Hall tickets 2025 : ఇంట‌ర్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. ఈ సారి మీ మొబైల్ నంబ‌ర్‌కే హాల్ టికెట్లు.. డౌన్‌లోడ్ చేసుకోండిలా...!

అలా ఇవ్వాలంటే ప్రభుత్వం ముందుగా ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాలి. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. సీట్ల పెంపును వ్యతిరేకిస్తూ ప్రభుత్వం గత ఏడాది కోర్టును కూడా ఆశ్రయించింది. మరోవైపు సీట్ల పెంపునకు అనుమతించవద్దని అఖిల భారత సాంకేతిక విద్య మండలికి సర్కారు లేఖ రాసింది. ఈ పరిస్థితుల్లో కొత్త సీట్లపై స్పష్టత వస్తేనే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటించాలని సెట్‌ కమిటీ భావిస్తోంది.  

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 31 Jan 2025 10:03AM

Photo Stories