Skip to main content

TS Inter Hall tickets 2025 : ఇంట‌ర్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. ఈ సారి మీ మొబైల్ నంబ‌ర్‌కే హాల్ టికెట్లు.. డౌన్‌లోడ్ చేసుకోండిలా...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఇంటర్ పరీక్షల మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభమవుతాయి. అలాగే మరుసటి రోజు మార్చి 6వ తేదీన‌ నుంచి ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు మొదలవుతాయి.
TS Inter Public Exams Hall tickets   Inter board sends hall tickets online

ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగనున్నాయి. అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోర్డ్ శుభవార్త చెప్పింది. ఇక హాల్ టికెట్ల కోసం కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదు. విద్యార్థుల మొబైల్ కే హాల్ టికెట్లు రానున్నాయి. విద్యార్థులు ఇచ్చిన మొబైల్‌ ఫోన్‌ నంబర్లకు ఇంటర్‌ బోర్డు అధికారులు లింక్‌ పంపిస్తున్నారు. ఆ లింక్ క్లిక్‌ చేస్తే హాల్‌టికెట్‌ వస్తుందని, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గతంలో కళాశాలలకే హాల్‌టికెట్లను పంపేవారు.

➤☛ Good News for Inter Students : ఇంట‌ర్ విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు బోర్డు చర్య‌లు.. ఈ స‌బ్జెక్టుల్లో ఏకంగా..

ఈ విధానంతో...
విద్యార్థులు తమ తమ కళాశాలలకు వెళ్లి హాల్‌టికెట్లను తీసుకునేవారు. దీంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజు బకాయి ఉందని, దానిని చెల్లించే వరకు హాల్ టికెట్లు ఇవ్వబోమని సతాయించే వారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానంతో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల ఆజమాయిషీకి చెక్ పడింది. రాష్ట్రంలో 9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు వెబ్ లింక్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోనున్నారు.

Must Check :

 TG INTER 1st Year : 

Telangana inter board extends the deadline for public exam fees

TG Inter 1st Year Study Material : 

View All

Published date : 31 Jan 2025 09:12AM

Photo Stories