Telangana ICET 2025 Released: తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల.. .. మార్చి 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ మార్చి 6న వెలువడనుంది. అభ్యర్థులు మార్చి 10 నుంచి మే 3 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550; బీసీ, జనరల్ అభ్యర్థులు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆలస్య రుసుము లేకుండా మే 3 వరకు దరఖాస్తులు సమర్పించే అవకాశం కల్పించారు. జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్ పరీక్షలను నిర్వహిస్తామని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రవి తెలిపారు.జులై 7న ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు.
టీఎస్ ఐసెట్ - 2025 -- కోర్సులు - అర్హతలు..
1) ఎంసీఏ
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీసీఏ, బీఎస్సీ-కంప్యూటర్స్, బీకామ్, బీఏ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
2) ఎంబీఏ
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకామ్/ బీబీఏ/ బీబీఎం/ బీసీఏ/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయోపరిమితి: ఐసెట్-2025 నోటిఫికేషన్ సమయానికి (06.03.2024) 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయసు లేదు.
పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-సి: కమ్యూనికేషన్ ఎబిలిటీ-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి.
టీఎస్ ఐసెట్-2025 షెడ్యూలు..
➥ టీఎస్ ఐసెట్-2025 నోటిఫికేషన్: 06.03.2025.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.03.2025.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 03.05.2025.
➥ రాతపరీక్ష తేదీలు: 08.06.2025 - 09.06.2025.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)