Btech EEE Branch Advantages : ఇంజనీరింగ్‌లో 'EEE' బ్రాంచ్ తీసుకోవడం ద్వారా.. లాభాలు ఇవే..!
అలాగే బ్రాంచ్ ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో.. బీటెక్‌లో ఈఈఈ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్న విద్యార్థులు భవిష్యత్తు ఎలా ఉంటుంది..? ఎలాంటి కాలేజీలో జాయిన్ అయితే మంచి భవిష్యత్ ఉంటుంది..? నాలుగేళ్ల తర్వాత జాబ్ మార్కెట్లో ఈ బ్రాంచ్‌కు ఎలాంటి ట్రెండ్ ఉంటుంది.. ప్రస్తుతం ఎలా ఉంది..? ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థులకు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీటెక్‌లో ఈఈఈ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్న విద్యార్థుల కోసం ప్రత్యేక కెరీర్ గైడెన్స్ స్టోరీ మీకోసం..
భవిష్యత్తుకు భరోసాను ఇస్తున్న బ్రాంచ్‌ల్లో టాప్‌లో..
విద్యుత్ రంగంలో ఉద్యోగాలు సంపాదించాల నుకునే వారికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(ఈఈఈ) బ్రాంచ్ చక్కటి మార్గంగా చెప్పవచ్చు. భవిష్యత్తుకు భరోసాను ఇస్తున్న బ్రాంచ్‌ల్లో ఈఈఈ ఒకటి. విద్యుచ్ఛక్తి ఉత్పత్తి, పంపిణీ వంటి వాటితోపాటు ఎలక్ట్రికల్ పరికరాల డిజైనింగ్, తయారీ, టెస్టింగ్.. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ల ప్రధాన విధులు. భారీ ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించే రంగాల్లో పవర్ రంగం ఒకటి. ఈఈఈ బ్రాంచ్‌ని ఎంపిక చేసుకోవాలనుకునే విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై మంచి పట్టుండాలి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌పై ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈఈఈలో చేరడం ద్వారా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రాణించవచ్చు.
EEE విద్యార్థులు.. వీరు ఏం చేస్తారంటే..?
ఈ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధిత రంగాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఎలక్ట్రానిక్ మెమొరీ స్టోరేజ్ డివైజ్‌లు, సీఎన్‌సీ మెషిన్ సర్క్యూట్లు, ఇండస్ట్రియల్ రోబోట్స్‌ను ఈఈఈ ఇంజనీర్లే రూపకల్పన చేస్తారు. కమ్యూనికేషన్, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, రెడియో ఫ్రీక్వెన్సీ డిజైన్, మైక్రో ప్రాసెసర్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, పవర్ జనరే షన్, విద్యుత్ యంత్రాలకు సంబంధించిన అనుబంధ విధులను కూడా వీరు నిర్వర్తిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, కంప్యూటర్ వంటి వాటి భాగాలను తయారు చేయడం, వాటిని డిజైన్ చేయడం వంటివి కూడా చేస్తారు.
EEE విద్యార్థులకు.. ఉన్నత విద్యావకాశాలు.. ఎలా ఉంటాయంటే..?
భారతదేశంలో ఉన్నత విద్యా కోర్సులు
- అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్
- ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ
- ఎలక్ట్రికల్ ఎనర్జీ సిస్టమ్
విదేశాల్లో ఉన్నత విద్యా కోర్సులు
- ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్
- మాస్టర్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
- మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్
EEE విద్యార్థులకు ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయంటే...?
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (EEE) పూర్తి చేసిన అభ్యర్థులకు కెరీర్ పరంగా మంచి అవకాశాలు ఉన్నాయి. పవర్ జనరేషన్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్, కంప్యూటర్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, బయోమెడికల్ రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయి. ఇవే కాకుండా పవర్ ప్లాంట్‌లు, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్లలో పవర్ డిస్ట్రిబ్యూషన్ విభాగాల్లో కూడా కొలువులను సంపాదించవచ్చు.
ముఖ్యమైన ఉద్యోగ అవకాశాలు:
- ప్రాజెక్ట్ ఇంజనీర్: వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వహణ.
- ఇంజనీరింగ్ స్పెషలిస్ట్: ప్రత్యేక నైపుణ్యాలను అవసరమైన ప్రాజెక్టులు.
- చీఫ్ ఇంజనీర్: ఎలక్ట్రికల్ విభాగానికి అధిపతిగా.
- సాఫ్ట్‌వేర్ ఇంజనీర్: ఎలక్ట్రికల్ వ్యవస్థలకు సాఫ్ట్‌వేర్ పరిష్కారాలు.
- రిలయబిలిటీ ఇంజనీర్: వ్యవస్థల విశ్వసనీయతను పెంచడం.
- డెవలప్‌మెంట్ ఇంజనీర్: కొత్త పరిజ్ఞానాలు మరియు ఉత్పత్తులు అభివృద్ధి చేయడం.
- సిస్టమ్ డిజైన్ ఇంజనీర్: ఎలక్ట్రికల్ సిస్టమ్స్ రూపకల్పన.
- టెస్ట్ ఇంజనీర్: సిస్టమ్స్ మరియు ఉత్పత్తుల పనితీరును పరీక్షించడం.
EEE విద్యార్థులకు ప్రభుత్వ పరంగా విద్యుత్ రంగంలో..
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (EEE) విద్యార్థులు ప్రభుత్వ రంగంలో విశాల అవకాశాలు పొందవచ్చు. జెన్‌కో, ట్రాన్స్‌కో, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్, ఎన్‌హెచ్‌పీసీ, డీఎంఆర్‌సీ వంటి సంస్థల్లోనే కాకుండా, టాటా, సామ్‌సంగ్, రిలయన్స్, సీమెన్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, హిటాచీ, జిందాల్ స్టీల్ అండ్ పవర్ వంటి ప్రైవేట్ కంపెనీల్లో కూడా EEE అభ్యర్థులు ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
ఉద్యోగ అవకాశాలు:
- జెన్‌కో (GENCO): పవర్ జనరేషన్ విభాగంలో.
- ట్రాన్స్‌కో (TRANSCO): పవర్ ట్రాన్స్‌మిషన్ లో.
- పవర్ గ్రిడ్ (Power Grid): జాతీయ విద్యుత్ గ్రీడ్ నిర్వహణలో.
- ఎన్‌టీపీసీ (NTPC): నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో.
- బీహెచ్‌ఈఎల్ (BHEL): భారతి హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో.
- ఎన్‌హెచ్‌పీసీ (NHPC): నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లో.
- డీఎంఆర్‌సీ (DMRC): డిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లో.
ప్రభుత్వ రంగంలో విద్యుత్ పథకాలు, ప్రైవేట్ రంగంలో ఏర్పాటవుతున్న హైడల్ పవర్ ప్రాజెక్ట్‌ల కారణంగా రాబోయే నాలుగేళ్లలో దాదాపు రెండు లక్షల మంది EEE ఇంజనీర్ల అవసరం ఉండవచ్చని అంచనా.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ:
స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, టీవీలు, వాషింగ్ మెషీన్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల అసెంబ్లింగ్ యూనిట్ల సంఖ్య దేశంలో పెరుగుతోంది, దీని వల్ల EEE ఇంజనీర్లకు అవకాశాలు మరింత విస్తరిస్తున్నాయి.
బీటెక్‌లో.. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(ఈఈఈ) విద్యార్థులు.. ఇటు ఎలక్ట్రికల్ రంగం.. అటు ఎలక్ట్రానిక్స్ రంగం.. ఇలా రెండు రంగాలకు చెందిన పరిశ్రమల్లో కొలువు దీరొచ్చు. భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్న బ్రాంచ్‌గా ఈఈఈ ప్రాధాన్యం సంతరించుకుంది. పలు అంచనాల ప్రకారం.. దేశంలో నిర్మితమవుతున్న ప్రాజెక్ట్‌లు, పథకాల కారణంగా రానున్న అయిదేళ్లలో దాదాపు మూడు లక్షల మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్ల అవసరం ఏర్పడనుంది.
Tags
- btech eee
- Advantages of EEE Branch in Btech
- government jobs for eee students
- btech eee branch benefits in telugu
- eee branch subjects
- Btech EEE Branch Advantages News in Telugu
- EEE Branch
- Best EEE College
- electrical electrical engineering subjects
- EEE Branch Advantages in Btech
- EEE Branch Advantages in Btech News in Telugu
- electrical electrical engineering jobs
- electrical engineering jobs for freshers
- eamcet eee branch selection process
- eamcet eee best colleges
- btech eee jobs
- btech eee jobs news in telugu
- btech eee jobs details in telugu
- eee core companies jobs
- eee core companies jobs news telugu
- telugu news eee core companies jobs
- top 10 core companies for eee
- top 10 core companies for eee news telugu
- best companies for electrical engineers in india
- best jobs for electrical engineers in india
- best jobs for electrical engineers in india news telugu
- electrical engineering jobs for btech
- electrical engineering jobs for btech news telugu
- btech eee branch best career options
- govt jobs after b tech in electrical engineering
- job opportunities in electrical engineering field
- B.Tech Admissions
- Telugu states
- Engineering Education
- Career prospects
- job market trends
- Electrical Engineering
- electronics engineering