Skip to main content

Telangana Top Electrical and Electronics Engineering Colleges : టాప్ కాలేజీలు ఇవే..ఈ బ్రాంచ్‌లో చేరితే భవిష్యత్తులో..

ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌(ఈఈఈ). ఈ బ్రాంచ్‌ విద్యార్థులు.. ఇటు ఎలక్ట్రికల్‌ రంగం.. అటు ఎలక్ట్రానిక్స్‌ రంగం.. ఇలా రెండు రంగాలకు చెందిన పరిశ్రమల్లో కొలువు దీరొచ్చు.

భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్న బ్రాంచ్‌గా ఈఈఈ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బ్రాంచ్‌ కూడా విద్యార్థుల ఆదరణలో రెండు, లేదా మూడు స్థానాల్లో నిలుస్తోంది. పలు అంచనాల ప్రకారం–దేశంలో నిర్మితమవుతున్న ప్రాజెక్ట్‌లు, పథకాల కారణంగా రానున్న అయిదేళ్లలో దాదాపు మూడు లక్షల మంది ఎలక్ట్రికల్‌ ఇంజనీర్ల అవసరం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ‌లోని టాప్‌-20 ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌(ఈఈఈ) బ్రాంచ్‌కు సంబంధించిన ఇంజ‌నీరింగ్ కాలేజీల జాబితా మీకోసం..

Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

The below list of Electrical & Electronics Engineering colleges is only for reference. It is prepared based on the last ranks admitted in 2021 web based counselling.

top 20 eee colleges in ts
                                Top 20 Engineering(EEE)Colleges in  Telangana
College Code College Name Branch Place Last Rank (2021)
JNTH JNTU COLLEGE OF ENGG HYDERABAD ELECTRICAL AND ELECTRONICS ENGINEERING HYDERABAD 1854
OUCE O U COLLEGE OF ENGG HYDERABAD ELECTRICAL AND ELECTRONICS ENGINEERING HYDERABAD 2056
CBIT CHAITANYA BHARATHI INSTITUTE OF TECHNOLOGY ELECTRICAL AND ELECTRONICS ENGINEERING GANDIPET 4802
JNTHM T JNTUH-5 YEAR INTEGRATED MTECH SELF FINANCE ELECTRICAL AND ELECTRONICS ENGINEERING KUKATPALLY 5973
VASV VASAVI COLLEGE OF ENGINEERING ELECTRICAL AND ELECTRONICS ENGINEERING HYDERABAD 7234
VJEC V N R VIGNANA JYOTHI INSTITUTE OF ENGG AND TECH ELECTRICAL AND ELECTRONICS ENGINEERING BACHUPALLY 8466
GRRR GOKARAJU RANGARAJU INSTITUTE OF ENGG AND TECH ELECTRICAL AND ELECTRONICS ENGINEERING MIYAPUR 14488
CVRH CVR COLLEGE OF ENGINEERING ELECTRICAL AND ELECTRONICS ENGINEERING IBRAHIMPATAN 16336
MGIT MAHATMA GANDHI INSTITUTE OF TECHNOLOGY ELECTRICAL AND ELECTRONICS ENGINEERING GANDIPET 16846
JNKR JNTU COLLEGE OF ENGINEERING JAGITIAL ELECTRICAL AND ELECTRONICS ENGINEERING JAGITIAL 17376
SNIS SRINIDHI INSTITUTE OF SCI AND TECHNOLOGY ELECTRICAL AND ELECTRONICS ENGINEERING GHATKESAR 18096
MVSR M V S R ENGINEERING COLLEGE (AUTONOMOUS) ELECTRICAL AND ELECTRONICS ENGINEERING NADERGUL 20039
JNTM JNTUH COLLEGE OF ENGG MANTHANI ELECTRICAL AND ELECTRONICS ENGINEERING MANTHANI 20642
MLID M L R INSTITUTE OF TECHNOLOGY ELECTRICAL AND ELECTRONICS ENGINEERING DUNDIGAL 20920
KUWL KU COLLEGE OF ENGINEERING AND TECHNOLOGY ELECTRICAL AND ELECTRONICS ENGINEERING WARANGAL 22289
KCEA KSHATRIYA COLLEGE OF ENGINEERING ELECTRICAL AND ELECTRONICS ENGINEERING ARMOOR 23394
BVRI B V RAJU INSTITUTE OF TECHNOLOGY ELECTRICAL AND ELECTRONICS ENGINEERING NARSAPUR 26473
JNTR JNTU COLLEGE OF ENGINEERING RAJANNA SIRCILLA ELECTRICAL AND ELECTRONICS ENGINEERING AGRAHARAM RAJANNA SIRCILLA 26817
KUCE K U COLLEGE OF ENGG KOTHAGUDEM ELECTRICAL AND ELECTRONICS ENGINEERING KOTHAGUDEM 27389
KITS KAKATIYA INSTITUTE OF TECHNOLOGY AND SCI ELECTRICAL AND ELECTRONICS ENGINEERING WARANGAL 28574

చ‌ద‌వండి: TS EAMCET 2022 Certificate Verification : టీఎస్ ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

కాలేజ్‌ ఎంపిక ఇవే కీలకం..
బ్రాంచ్‌ ఎంపికలో స్పష్టత వచ్చిన విద్యార్థులు మలి దశలో కాలేజ్‌ ఎంపికపై దృష్టిపెట్టాలి. ఇందుకోసం పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 

ఏఐసీటీఈ నిబంధనలు..: 
కళాశాలలో ఫ్యాకల్టీ నుంచి ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ వరకూ.. అన్నీ నిబంధనల మేరకు ఉన్నాయా? లేదా? అనేది పరిశీలించాలి. ఈ సమాచారం ఏఐసీటీఈ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. ఒకవేళ అందులో సమాచారం లేకపోతే ప్రత్యక్షంగా కళాశాలలను సందర్శించి వివరాలు తెలుసుకోవాలి. 

ఎన్‌బీఏ గుర్తింపు : 
తాము చేరాలనుకుంటున్న బ్రాంచ్‌కు సదరు కాలేజ్‌లో ఎన్‌బీఏ గుర్తింపు ఉందో లేదో కనుక్కోవాలి. ఎన్‌బీఏ గుర్తింపు బ్రాంచ్‌లా వారీగా ఉంటుంది. కొన్ని కళాశాలలు ఒకట్రెండు బ్రాంచ్‌లకే ఎన్‌బీఏ గుర్తింపు ఉన్నా.. ఎన్‌బీఏ అక్రెడిటెడ్‌ అంటూ.. అన్ని వెబ్‌సైట్లలో ఆకర్షణీయంగా ప్రకటనలిస్తున్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

కాలేజ్‌కు ఉన్న పేరు: 
గత ఏడాది సదరు కాలేజ్‌లో సీట్ల భర్తీలో ఓపెనింగ్‌క్లోజింగ్‌ ర్యాంకుల వివరాలు గమనించాలి. ఉదాహరణకు యూనివర్సిటీ క్యాంపస్‌ కళాశాలలు సహా పలు ఇన్‌స్టిట్యూట్స్‌లో ఈసీఈ, సీఎస్‌ఈ, ట్రిపుల్‌ఈ వంటి బ్రాంచ్‌లలో లాస్ట్‌ ర్యాంకు 1500 నుంచి 2000 లోపే ఉంటోంది. అంటే..ఆ కళాశాలలు విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయని చెప్పొచ్చు. 

టీచింగ్‌ లెర్నింగ్‌ : 
కళాశాలలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ.. టీచింగ్‌ విధానంలో లోపాలు ఉండొచ్చు. ఈ విషయాన్ని కూడా ప్రత్యక్షంగా పరిశీలించాలి. టీచింగ్‌ పరంగా అనుసరిస్తున్న విధానం, ప్రాక్టికల్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యం, అందులో విద్యార్థులను మమేకం చేస్తున్న తీరుతెన్నులపై సునిశిత పరిశీలన చేయాలి. కొన్ని కళాశాలలు ఏఐసీటీఈ నిబంధనల మేరకు తమ కళాశాలలో పీహెచ్‌డీ ఫ్యాకల్టీ సైతం ఉన్నారని ప్రకటనలు ఇస్తుంటాయి.

ప్లేస్‌మెంట్స్‌..
కళాశాలను ఎంపిక చేసుకునేటప్పుడు గత నాలుగేళ్ల ప్లేస్‌మెంట్స్‌ను పరిశీలించాలి. సదరు కాలేజీకి ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి.వచ్చిన కంపెనీలు ఎలాంటి ఉద్యోగాలు ఆఫర్‌ చేస్తున్నాయో గమనించాలి. కొన్ని కళాశాలలు తమ కళాశాలలకు ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చాయని కలర్‌ఫుల్‌ బ్రోచర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా వచ్చిన ప్రతిష్టాత్మక కంపెనీల్లో కోర్‌ ప్రొఫైల్స్‌లో ఎంతమందికి అవకాశాలు ఇచ్చాయో తెలుసుకోవాలి. ప్రముఖ కంపెనీలు సైతం బీపీఓ, వాయిస్, నాన్‌వాయిస్‌ ప్రొఫైల్స్‌లో ప్లేస్‌మెంట్స్‌ ఇస్తున్నాయి. కోర్‌ జాబ్‌ ప్రొఫైల్‌ ఆఫర్స్‌ సంఖ్య 20 నుంచి 30 శాతం లోపే ఉంటోంది.

మెచ్చిన బ్రాంచ్‌ రాకుంటే..
ఎంసెట్‌లో ర్యాంకు వచ్చినా.. మెచ్చిన బ్రాంచ్‌లో సీటు వచ్చే అవకాశం లేకుంటే.. సదరు బ్రాంచ్‌కు అనుబంధంగా ఉండే ఇంటర్‌ డిసిప్లినరీ బ్రాంచ్‌లవైపు దృష్టిసారించొచ్చు. కోరుకున్న బ్రాంచ్‌లో సీటు లభించలేదని నిరుత్సాహానికి గురికాకూడదు.

నచ్చిన కాలేజ్‌ రాకుంటే..
కోరుకున్న కాలేజ్‌లో ప్రవేశం లభించకున్నా.. స్వీయ అధ్యయనం ద్వారా రాణించేందుకు కృషి చేయాలి. ఫ్యాకల్టీ లేరనో లేదా సదుపాయాలు లేవనో అభ్యసనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సెల్ఫ్‌ లెర్నింగ్‌ టూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెట్‌ ఆధారంగా అనంతమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఈలెర్నింగ్‌ పోర్టల్స్‌ ఆవిష్కృతమవుతున్నాయి. ఆన్‌లైన్‌ లెక్చర్స్, వర్చువల్‌ క్లాస్‌రూమ్స్, వర్చువల్‌ లేబొరేటరీ సదుపాయాలు సైతం లభిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుని తమను తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి.

Telangana Top Computer Science Engineering Colleges(CSE) : అంద‌రి చూపు.. ఈ బ్రాంచ్ వైపే.. ఈ కోర్సులో చేరితే..!

Published date : 24 Aug 2022 06:47PM

Photo Stories