Telangana Top Computer Science Engineering Colleges(CSE) : అందరి చూపు.. ఈ బ్రాంచ్ వైపే.. ఈ కోర్సులో చేరితే..!
నేటి డిజిటల్ యుగంలో.. సీఎస్‌ఈ విద్యార్థులకు కొలువులకు కొదవలేదని చెప్పొచ్చు. కాని ఈ బ్రాంచ్‌ను ఎంచుకునే విద్యార్థులకు ప్రాథమికంగా కొన్ని నైపుణ్యాలు ఉండాలి. అవి.. మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యుటేషనల్ థింకింగ్. అంతేకాకుండా సీఎస్‌ఈలో చేరాక కోడింగ్, ప్రోగ్రామింగ్‌పై పట్టు సాధించాలి. అప్పుడే సీఎస్‌ఈలో చేరిన ఉద్దేశం నెరవేరుతుంది.
☛ Engineering college Admissions : ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?
గత మూడు, నాలుగేళ్లుగా టాప్ ర్యాంకర్లు సీఎస్‌ఈ బ్రాంచ్‌లోనే చేరారు. జనరల్ కేటగిరీలో 1500లోపు ర్యాంకుతోనే అన్ని ఐఐటీల్లో ఈ బ్రాంచ్‌లో సీట్లు భర్తీ అయిపోతున్నాయి. ఐఐటీలే కాకుండా.. ఎన్‌ఐటీలు, రాష్ట్రాల స్థాయిలోనూ ఇదే పరిస్థితి. యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, టాప్10, 20 ఇన్‌స్టిట్యూట్‌లలో జనరల్ కేటగిరీలో అయిదు వేలలోపు ర్యాంకుతోనే ఈ బ్రాంచ్‌లో సీట్లు భర్తీ అవుతున్నాయి. కారణం.. ప్రస్తుతం సీఎస్‌ఈకి ఉద్యోగాల పరంగా మెరుగైన అవకాశాలు అందుబాటులో ఉండటమే. డిజిటలైజేషన్, ఆటోమేషన్ ఫలితంగా రాబోయే రోజుల్లోనూ భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయనే వార్తలు కూడా విద్యార్థులు సీఎస్‌ఈ పట్ల ఆసక్తి చూపడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని టాప్-20 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్(సీఎస్‌ఈ) బ్రాంచ్‌కు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీల జాబితా మీకోసం..
The below list of Computer Science Engineering colleges is only for reference. It is prepared based on the last ranks admitted in 2021 web based counselling.
Top 20 Engineering(CSE)Colleges in Telangana | ||||
College Code | College Name | Branch | Place | Last Rank (2021) |
JNTH | JNTU COLLEGE OF ENGG HYDERABAD | COMPUTER SCIENCE AND ENGINEERING | HYDERABAD | 276 |
OUCE | O U COLLEGE OF ENGG HYDERABAD | COMPUTER SCIENCE AND ENGINEERING | HYDERABAD | 449 |
CBIT | CHAITANYA BHARATHI INSTITUTE OF TECHNOLOGY | COMPUTER SCIENCE AND ENGINEERING | GANDIPET | 741 |
VASV | VASAVI COLLEGE OF ENGINEERING | COMPUTER SCIENCE AND ENGINEERING | HYDERABAD | 1118 |
JNTHM T | JNTUH-5 YEAR INTEGRATED MTECH SELF FINANCE | COMPUTER SCIENCE AND ENGINEERING | KUKATPALLY | 1431 |
VJEC | V N R VIGNANA JYOTHI INSTITUTE OF ENGG AND TECH | COMPUTER SCIENCE AND ENGINEERING | BACHUPALLY | 1474 |
CVRH | CVR COLLEGE OF ENGINEERING | COMPUTER SCIENCE AND ENGINEERING | IBRAHIMPATAN | 2995 |
GRRR | GOKARAJU RANGARAJU INSTITUTE OF ENGG AND TECH | COMPUTER SCIENCE AND ENGINEERING | MIYAPUR | 3321 |
SNIS | SRINIDHI INSTITUTE OF SCI AND TECHNOLOGY | COMPUTER SCIENCE AND ENGINEERING | GHATKESAR | 3976 |
MVSR | M V S R ENGINEERING COLLEGE (AUTONOMOUS) | COMPUTER SCIENCE AND ENGINEERING | NADERGUL | 4532 |
MGIT | MAHATMA GANDHI INSTITUTE OF TECHNOLOGY | COMPUTER SCIENCE AND ENGINEERING | GANDIPET | 4759 |
KMIT | KESHAV MEMORIAL INST OF TECHNOLOGY | COMPUTER SCIENCE AND ENGINEERING | NARAYANAGUDA | 4944 |
VMEG | VARDHAMAN COLLEGE OF ENGINEERING | COMPUTER SCIENCE AND ENGINEERING | SHAMSHABAD | 5098 |
JNTS | J N T U COLLEGE OF ENGINEERING SULTANPUR | COMPUTER SCIENCE AND ENGINEERING | SULTANPUR | 5876 |
BVRI | B V RAJU INSTITUTE OF TECHNOLOGY | COMPUTER SCIENCE AND ENGINEERING | NARSAPUR | 6505 |
JNKR | JNTU COLLEGE OF ENGINEERING JAGITIAL | COMPUTER SCIENCE AND ENGINEERING | JAGITIAL | 6987 |
CVSR | ANURAG UNIVERSITY (FORMERLY ANURAG GRP OF INSTNS- CVSR COLL OF ENGG) | COMPUTER SCIENCE AND ENGINEERING | GHATKESAR | 7650 |
MECS | MATRUSRI ENGINEERING COLLEGE | COMPUTER SCIENCE AND ENGINEERING | HYDERABAD | 8398 |
IARE | INSTITUTE OF AERONAUTICAL ENGINEERING | COMPUTER SCIENCE AND ENGINEERING | DUNDIGAL | 8516 |
KITS | KAKATIYA INSTITUTE OF TECHNOLOGY AND SCI | COMPUTER SCIENCE AND ENGINEERING | WARANGAL | 8719 |
కాలేజ్ ఎంపిక ఇవే కీలకం..
బ్రాంచ్ ఎంపికలో స్పష్టత వచ్చిన విద్యార్థులు మలి దశలో కాలేజ్ ఎంపికపై దృష్టిపెట్టాలి. ఇందుకోసం పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ఏఐసీటీఈ నిబంధనలు..:
కళాశాలలో ఫ్యాకల్టీ నుంచి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వరకూ.. అన్నీ నిబంధనల మేరకు ఉన్నాయా? లేదా? అనేది పరిశీలించాలి. ఈ సమాచారం ఏఐసీటీఈ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. ఒకవేళ అందులో సమాచారం లేకపోతే ప్రత్యక్షంగా కళాశాలలను సందర్శించి వివరాలు తెలుసుకోవాలి.
ఎన్‌బీఏ గుర్తింపు :
తాము చేరాలనుకుంటున్న బ్రాంచ్‌కు సదరు కాలేజ్‌లో ఎన్‌బీఏ గుర్తింపు ఉందో లేదో కనుక్కోవాలి. ఎన్‌బీఏ గుర్తింపు బ్రాంచ్‌లా వారీగా ఉంటుంది. కొన్ని కళాశాలలు ఒకట్రెండు బ్రాంచ్‌లకే ఎన్‌బీఏ గుర్తింపు ఉన్నా.. ఎన్‌బీఏ అక్రెడిటెడ్ అంటూ.. అన్ని వెబ్‌సైట్లలో ఆకర్షణీయంగా ప్రకటనలిస్తున్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
కాలేజ్‌కు ఉన్న పేరు:
గత ఏడాది సదరు కాలేజ్‌లో సీట్ల భర్తీలో ఓపెనింగ్‌క్లోజింగ్ ర్యాంకుల వివరాలు గమనించాలి. ఉదాహరణకు యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు సహా పలు ఇన్‌స్టిట్యూట్స్‌లో ఈసీఈ, సీఎస్‌ఈ, ట్రిపుల్‌ఈ వంటి బ్రాంచ్‌లలో లాస్ట్ ర్యాంకు 1500 నుంచి 2000 లోపే ఉంటోంది. అంటే..ఆ కళాశాలలు విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయని చెప్పొచ్చు.
టీచింగ్ లెర్నింగ్ :
కళాశాలలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ.. టీచింగ్ విధానంలో లోపాలు ఉండొచ్చు. ఈ విషయాన్ని కూడా ప్రత్యక్షంగా పరిశీలించాలి. టీచింగ్ పరంగా అనుసరిస్తున్న విధానం, ప్రాక్టికల్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యం, అందులో విద్యార్థులను మమేకం చేస్తున్న తీరుతెన్నులపై సునిశిత పరిశీలన చేయాలి. కొన్ని కళాశాలలు ఏఐసీటీఈ నిబంధనల మేరకు తమ కళాశాలలో పీహెచ్‌డీ ఫ్యాకల్టీ సైతం ఉన్నారని ప్రకటనలు ఇస్తుంటాయి.
ప్లేస్‌మెంట్స్..
కళాశాలను ఎంపిక చేసుకునేటప్పుడు గత నాలుగేళ్ల ప్లేస్‌మెంట్స్‌ను పరిశీలించాలి. సదరు కాలేజీకి ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి.వచ్చిన కంపెనీలు ఎలాంటి ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయో గమనించాలి. కొన్ని కళాశాలలు తమ కళాశాలలకు ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చాయని కలర్‌ఫుల్ బ్రోచర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా వచ్చిన ప్రతిష్టాత్మక కంపెనీల్లో కోర్ ప్రొఫైల్స్‌లో ఎంతమందికి అవకాశాలు ఇచ్చాయో తెలుసుకోవాలి. ప్రముఖ కంపెనీలు సైతం బీపీఓ, వాయిస్, నాన్‌వాయిస్ ప్రొఫైల్స్‌లో ప్లేస్‌మెంట్స్ ఇస్తున్నాయి. కోర్ జాబ్ ప్రొఫైల్ ఆఫర్స్ సంఖ్య 20 నుంచి 30 శాతం లోపే ఉంటోంది.
మెచ్చిన బ్రాంచ్ రాకుంటే..
ఎంసెట్‌లో ర్యాంకు వచ్చినా.. మెచ్చిన బ్రాంచ్‌లో సీటు వచ్చే అవకాశం లేకుంటే.. సదరు బ్రాంచ్‌కు అనుబంధంగా ఉండే ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్‌లవైపు దృష్టిసారించొచ్చు. కోరుకున్న బ్రాంచ్‌లో సీటు లభించలేదని నిరుత్సాహానికి గురికాకూడదు.
నచ్చిన కాలేజ్ రాకుంటే..
కోరుకున్న కాలేజ్‌లో ప్రవేశం లభించకున్నా.. స్వీయ అధ్యయనం ద్వారా రాణించేందుకు కృషి చేయాలి. ఫ్యాకల్టీ లేరనో లేదా సదుపాయాలు లేవనో అభ్యసనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సెల్ఫ్ లెర్నింగ్ టూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెట్ ఆధారంగా అనంతమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఈలెర్నింగ్ పోర్టల్స్ ఆవిష్కృతమవుతున్నాయి. ఆన్‌లైన్ లెక్చర్స్, వర్చువల్ క్లాస్‌రూమ్స్, వర్చువల్ లేబొరేటరీ సదుపాయాలు సైతం లభిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుని తమను తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి.