Best Branches in Engineering : బీటెక్‌లో బెస్ట్ బ్రాంచ్ ఏమిటి? ఏ బ్రాంచ్ తీసుకుంటే.. ఎక్కువగా ఉద్యోగావకాశాలు ఉంటాయి.?
ఈ నేపథ్యంలో.. బీటెక్ ప్రవేశాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు బ్రాంచ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆయా బ్రాంచ్‌లతో అవకాశాలు, జాబ్ మార్కెట్ ట్రెండ్స్ తదితర అంశాలపై ప్రత్యేక విశ్లేషణ మీకోసం..
బీటెక్‌లో చేరాలనుకుంటున్న విద్యార్థుల్లో ఎదురవుతున్న మొదటి సందేహం.. ఏ బ్రాంచ్ సెలక్ట్ చేసుకుంటే బాగుంటుంది?. ఈ విషయంలో ప్రధానంగా రెండు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అవి..
☛ ఒకటి, వ్యక్తిగత ఆసక్తి, వ్యక్తిగత సామర్థ్యాలు; కాగా రెండోది, జాబ్ మార్కెట్ ప్రస్తుత పరిస్థితులు; విద్యార్థులు ఈ రెండింటినీ బేరీజు వేసుకుంటూ.. భవిష్యత్తు అవకాశాలపై అంచనాతో తమ ఆసక్తికి అనుగుణంగా బ్రాంచ్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బీటెక్ తర్వాత కార్పొరేట్ కొలువే లక్ష్యమైతే.. దానికి అనుగుణంగా వాస్తవ పరిస్థితుల్లో అమలవుతున్న తాజా నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
AP EAMCET 2022 College Predictor : మీ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసా..?
బ్రాంచ్‌ల వారీగా అవకాశాలు ఇలా..
సీఎస్‌ఈ :
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్.. సీఎస్‌ఈ. ఇది ప్రస్తుతం ఎక్కువ మంది ఎంచుకునే బ్రాంచ్. ప్రస్తుతం జాబ్ మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. సీఎస్‌ఈ విద్యార్థులకు అవకాశాలు మెరుగ్గా లభిస్తున్నాయి. నేటి డిజిటల్ యుగంలో.. సీఎస్‌ఈ విద్యార్థులకు కొలువులకు కొదవలేదని చెప్పొచ్చు. కాని ఈ బ్రాంచ్‌ను ఎంచుకునే విద్యార్థులకు ప్రాథమికంగా కొన్ని నైపుణ్యాలు ఉండాలి. అవి.. మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యుటేషనల్ థింకింగ్. అంతేకాకుండా సీఎస్‌ఈలో చేరాక కోడింగ్, ప్రోగ్రామింగ్‌పై పట్టు సాధించాలి. అప్పుడే సీఎస్‌ఈలో చేరిన ఉద్దేశం నెరవేరుతుంది.
ఈసీఈ :
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్(ఈసీఈ) బ్రాంచ్ నైపుణ్యాలతో కోర్‌సెక్టార్స్‌తోపాటు సాఫ్ట్‌వేర్ రంగంలోనూ కొలువులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. శరవేగంగా విస్తరిస్తున్న టెలికం రంగం.. ఆధునిక సాంకేతిక విధానాలు.. నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం సంస్థలు అన్వేషిస్తుండటం వంటివి ఈసీఈ విద్యార్థులకు వరంగా మారుతున్నాయి.
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ :
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(ఈఈఈ). ఈ బ్రాంచ్ విద్యార్థులు.. ఇటు ఎలక్ట్రికల్ రంగం.. అటు ఎలక్ట్రానిక్స్ రంగం.. ఇలా రెండు రంగాలకు చెందిన పరిశ్రమల్లో కొలువు దీరొచ్చు. భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్న బ్రాంచ్‌గా ఈఈఈ ప్రాధాన్యం సంతరించుకుంది. పలు అంచనాల ప్రకారం–దేశంలో నిర్మితమవుతున్న ప్రాజెక్ట్‌లు, పథకాల కారణంగా రానున్న అయిదేళ్లలో దాదాపు మూడు లక్షల మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్ల అవసరం ఏర్పడనుంది.
సివిల్ ఇంజనీరింగ్‌లో.. :
ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, మౌలిక వసతులకు ప్రాధాన్యం, హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలు.. సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థుల భవిష్యత్తుకు వేదికలుగా నిలవనున్నాయి.
మెకానికల్ ఇంజనీరింగ్ :
ఎన్నో ఏళ్లుగా ఎవర్ గ్రీన్‌గా బ్రాంచ్‌గా నిలుస్తోంది.. మెకానికల్ ఇంజనీరింగ్. ఆటో మొబైల్ మొద లు.. విమానాల తయారీ వరకూ.. మెకానికల్ ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకం. ఇటీవల కాలంలో దేశంలో మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు, ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌కు ఊతమిచ్చేలా అనుసరిస్తున్న విధానాలు కూడా మెకానికల్ ఇంజనీర్లకు కొలువులకు మార్గం వేస్తున్నాయి. ప్రైవేటు రంగంలో రోబోటిక్స్,ఆటో మొబైల్ సంస్థల వినూత్న ప్రయోగాలు.. మెకానికల్ విద్యార్థులకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ప్రస్తుతం సంస్థలు అనుసరిస్తున్న రోబోటిక్స్, ఆటోమేషన్, 3–డి డిజైన్‌వంటి స్కిల్స్‌పై పట్టు సాధిస్తే.. చక్కటి అవకాశాలు అందుకోవచ్చు.
కెమికల్ ఇంజనీరింగ్ :
ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలు హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌వంటి పెట్రోలియం ఉత్పత్తుల సంస్థల్లో కెమికల్ ఇంజనీర్ల అవసరం ఏర్పడింది. అదే విధంగా జాతీయ స్థాయిలోని సీఎస్‌ఐఆర్ లేబొరేటరీలు, డీఆర్‌డీఓ లేబొరేటరీల్లో సైతం కెమికల్ ఇంజనీర్లకు డిమాండ్ నెలకొంది.
ఏరోస్పేస్ ఇంజనీరింగ్ :
అంతరిక్ష ప్రయోగాలు, క్షిపణుల డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్‌పరంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి డీఆర్‌డీఓ, ఇస్రో వంటి సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రైవేటు రంగంలోనూ ఏరోస్పేస్ ఇంజనీర్లకు సంస్థలు ఆహ్వానం పలుకుతున్నాయి.
బయో టెక్నాలజీ :
బయో టెక్నాలజీ.. ఇటీవల కాలంలో దీనికి ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా పరిణామాల్లో బయోటెక్‌కు ప్రాధాన్యం పెరిగిందని చెప్పొచ్చు. ప్లాంట్‌బయోటెక్నాలజీ, హ్యూమన్‌బయోటెక్నాలజీ, యానిమల్‌బయోటెక్నాలజీ వం టి విభాగాల్లో పరిశోధనలు విస్తృతం అవుతున్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఫార్మా సంస్థల్లో సైతం అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ సంస్థల్లోనూ ఉద్యోగాలు దక్కించుకునే అవకాశముంది.
బయోమెడికల్ ఇంజనీరింగ్ :
మెడికల్‌విభాగంలో ఇంజనీరింగ్ నైపుణ్యాలను అన్వయిస్తూ.. డయాగ్నస్టిక్‌మెషీన్స్‌ను రూపొందించే విభాగం.. బయోమెడికల్ ఇంజనీరింగ్. మెడికల్ ఎక్విప్‌మెంట్ ప్రొడక్షన్ సంస్థలు, కార్పొరేట్ హాస్పిటల్స్ వీరికి ప్రధాన ఉపాధి వేదికలు.
నావల్ ఆర్కిటెక్చర్/మెరైన్ ఇంజనీరింగ్ :
నావల్ ఆర్కిటెక్చర్/మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు ద్వారా అభ్యర్థులకు షిప్‌బిల్డింగ్, షిప్‌డిజైన్, హార్బర్‌టెక్నాలజీ నైపుణ్యాలు లభిస్తాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత షిప్ ఆర్కిటెక్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, లాజిస్టిక్స్ విభాగాల్లో సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు లభించడం ఖాయం.
టెక్స్‌టైల్ టెక్నాలజీ :
ఆధునిక అవసరాలకు అనుగుణంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న మరో రంగం.. టెక్స్‌టైల్ పరిశ్రమ. ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో.. టెక్స్‌టైల్ టెక్నాలజీ/టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులకు డిమాండ్ నెలకొంది. ప్రొడక్షన్, రా మెటీరియల్ ప్రాసెసింగ్ నైపుణ్యాలు అందించే ఈ కోర్సు పూర్తి చేస్తే.. టెక్స్‌టైల్ పరిశ్రమలతోపాటు.. కేంద్ర జౌళి శాఖలోనూ ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.