Skip to main content

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) సోమవారం(ఏప్రిల్ 21వ తేదీ) కన్నుమూశారు.
Pope Francis Passes Away At 88

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వాటికన్ సిటీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి విషయాన్ని వాటికన్‌ వర్గాలు ధ్రువీకరించాయి. 

పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో 1936 డిసెంబర్ 17వ తేదీ ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్‌ బెనెడిక్ట్‌-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్‌ కేథలిక్‌ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. ఆయన్ను ప్రజల పోప్‌ అంటారు. తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు. 

2016లో రోమ్‌ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవాతత్పరతకు చిహ్నంగా భావిస్తారు.

Vanajeevi Ramaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత.. వనజీవి రామయ్య కన్నుమూత

Published date : 21 Apr 2025 03:46PM

Photo Stories