World's First 10G Internet: ప్రపంచంలోనే మొట్టమొదటి 10G పబ్లిక్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ప్రారంభం

హువాయ్, చైనా యూనికామ్ కలిసి, చైనా మొట్టమొదటి 10జీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను ప్రారంభించారు. ఇది బీజింగ్ సమీపంలోని హెబీ ప్రావిన్స్‌లోని జియోంగాన్ న్యూ ఏరియాలో ప్రయోగాత్మకంగా అమలైంది. మై-డ్రైవర్స్ పబ్లిష్ చేసిన నివేదిక ప్రకారం, ఈ నెట్‌వర్క్ 9,834 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్, 1,008 ఎంబీపీఎస్ అప్‌లోడ్ స్పీడ్ నమోదైంది. అంటే దాదాపు 10Gbps వేగంతో పనిచేస్తోంది.
‘10జీ’ అంటే జెనరేషన్ కాదు.. ఇది గిగాబిట్!
ఇక్కడ చెప్పే "10జీ"లో 'జీ' అంటే జనరేషన్ కాదు, గిగాబిట్ అనే అర్థంలో వాడుతున్నారు. ఇది మొబైల్ నెట్‌వర్క్ కాదని, ఫైబర్ ఆప్టిక్ ఆధారిత ఫిక్స్‌డ్ లైన్ ఇంటర్నెట్ సేవ అని స్పష్టంగా చెప్పాలి. ఈ టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ మిలీ సెకన్ల వ్యవధిలో స్పందించేలా రూపొందించారు, అంటే ల్యాటెన్సీ చాలా తక్కువగా ఉంటుంది.
మౌలిక సదుపాయాల అప్‌గ్రేడ్‌తో వేగవంతమైన ఇంటర్నెట్
చైనా చేపట్టిన మౌలిక సదుపాయాల అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా, ఇంటర్నెట్ సేవలను గణనీయంగా మెరుగుపరచడమే లక్ష్యం. గతంలో 1 గిగాబిట్ వరకు ఉన్న ఇంటర్నెట్ స్పీడ్‌ను, ఇప్పుడు 10 గిగాబిట్ స్థాయికి తీసుకువచ్చారు. దీని ద్వారా ఇంటర్నెట్ సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా వినియోగదారులకు అందనున్నాయి.
డేటా ఇంటెన్సివ్ అప్లికేషన్లకు గేమ్‌చేంజర్
ఈ 10జీ బ్రాడ్‌బ్యాండ్ టెక్నాలజీ ప్రధానంగా 8కె స్ట్రీమింగ్, ఏఆర్/వీఆర్, హై ఎండ్ గేమింగ్, రిమోట్ వర్కింగ్ వంటి హైవాల్యూమ్ డేటా అవసరాల కోసం రూపొందించబడింది. దీంతో వినియోగదారులకు సంభావ్యంగా ఆలస్యం లేకుండా, సజావుగా సేవలు అందనున్నాయి.
Artificial Intelligence: 2030 కల్లా మనిషితో సమానంగా పనిచేయగల ఏజీఐ.. ఏమిటీ ఏజీఐ..?