Skip to main content

TS EAMCET 2022 College Predictor : మీరు ఎంసెట్‌-2022 ప‌రీక్ష రాశారా..? మీ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్రవాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TS EAMCET పరీక్ష జూలై 18వ తేదీ నుంచి నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.
TS EAMCET College Predictor

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్‌కు మంచి కాలేజీలో చేర్పించాలని కోరుకుంటున్నారు. అలాగే TS EAMCET లో వ‌చ్చే ర్యాంక్‌ల‌పై విద్యార్థుల‌తో పాటు.. వీరి తల్లిదండ్రులు ఎంతో  ఆస‌క్తి ఉంటుంది. ఎందుకంటే ఈ ర్యాంక్‌ల ఆధారంగానే టాప్ ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో ప్ర‌వేశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ ప‌రీక్ష‌కు ఆంద్ర‌ప్ర‌దేశ్ విద్యార్థులు కూడా హాజ‌ర‌య్యారు.

Engineering‌ Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోస‌మే!

ఈ సారి భారీగానే..
ఈసారి సకాలంలోనే నిర్వహించిన‌ ఎంసెట్‌కు భారీగానే పోటీ నెలకొంది. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు 1,71,945 మంది.. అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌కు 94,150 మంది.. రెండింటికీ 350 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 2,66,445 దరఖాస్తులు ఎంసెట్ వ‌చ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి.

☛ చదవండి: బీటెక్‌లో ఈసీఈతో బంగారు భవిత అందుకోండి.. కెరీర్‌లో దూసుకెళ్లండి..

TS EAMCET 2022లో మీకు వ‌చ్చిన మార్కుల‌కు.. ఎలాంటి కాలేజీలో సీటు వ‌చ్చే అవ‌కాశం ఉందంటే..?
ఇప్ప‌టికే చాలా మంది విద్యార్థులు.., TS EAMCET-2022 ప‌రీక్ష రాసిన వారు ఎన్ని మార్కులు వచ్చే అవ‌కాశం ఉందో ఒక అంచ‌నాకు వ‌చ్చి ఉంటారు. ఈ నేపథ్యంలో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) మీకోసం ప్ర‌త్యేకం మీకు వ‌చ్చిన మార్కుల ఆధారంగా.., మీకు ఎంత ర్యాంక్ వ‌స్తుందో.. ఏ కాలేజీలో ప్ర‌వేశం వ‌స్తుందో ఒక అంచనా కోసం కింది విధంగా అందిస్తోంది. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే.. అంతిమంగా ప్ర‌భుత్వం అధికారిక ప్ర‌క‌ట‌న ఆధారంగానే మీ కాలేజీ కేటాయింపు ఉంటుంది.

How to Check Expected Engineering Colleges?

Published date : 06 Aug 2022 04:35PM

Photo Stories