Skip to main content

National Athletics Coach: భారత జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ రమేశ్ సస్పెండ్

భారత జూనియర్ అథ్లెటిక్స్ జట్టు చీఫ్ కోచ్ నాగపురి రమేశ్‌ను జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది.
Junior National Athletics Coach Ramesh Suspended For Complicity In Dopin

హైదరాబాద్‌లోని 'సాయ్' కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న అథ్లెట్ల నుంచి శాంపిల్స్ సేకరించేందుకు ఇటీవల 'వాడా' డోప్ కలెక్షన్ ఆఫీసర్లను పంపించింది. ఆ సమయంలో డోప్ కలెక్షన్ ఆఫీసర్లకు శాంపిల్స్ ఇవ్వకుండా ఇద్దరు అథ్లెట్లను రమేశ్ బయటకు పంపించారని సమాచారం. దాంతో 'నాడా' నియమావళిలోని ఆర్టికల్ 2.9 ప్రకారం రమేశ్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. 

వరంగల్ జిల్లాకు చెందిన 59 ఏళ్ల రమేశ్ హైదరాబాద్లోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో కోచ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2016లో 'ద్రోణాచార్య' అవార్డు గెల్చుకున్న రమేశ్.. మహిళల 100 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు నెలకొల్పిన ద్యుతీచంద్ పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన వాంజి దీప్తి, ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన నందిని లాంటి ఎందరో అథ్లెట్లకు శిక్షణ ఇచ్చారు. 

Mirabai Chanu: ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్పర్సన్ మీరాబాయ్ చాను

2023 జూన్ నుంచి ఆయన జాతీయ జూనియర్ చీఫ్ కోచ్‌గా ఉన్నారు. మరోవైపు డోపింగ్ పరీక్షలకు అందుబాటులోకి రాని ఏడుగురు అథ్లెట్లను కూడా 'నాడా' సస్పెండ్ చేసింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన షణ్ముగ శ్రీనివాస్, చెలిమి ప్రత్యూష ఉన్నారు.

☛ Follow our YouTube Channel  (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 22 Apr 2025 09:48AM

Photo Stories