Skip to main content

Best Engineering(IT) Colleges in Telangana : బెస్ట్ ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే..

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ఊపందుకుంటోంది. బీటెక్‌ అడ్మిషన్ల సందడి నెలకొంది!

దాంతో ఏ బ్రాంచ్‌తో భవిష్యత్తు బాగుంటుంది.. నాలుగేళ్ల తర్వాత జాబ్‌ మార్కెట్లో ఎలాంటి ట్రెండ్‌ ఉంటుంది.. ప్రస్తుతం ఎలా ఉంది.. ఏ బ్రాంచ్‌ ఎంచుకుంటే మంచిది.. కాలేజీ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులకు ఎదురవుతున్నాయి.ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని టాప్‌-20 ఐటీ బ్రాంచ్‌కు సంబంధించిన ఇంజ‌నీరింగ్ కాలేజీల జాబితా మీకోసం..

☛ Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

The below list of Information Technology Engineering colleges is only for reference. It is prepared based on the last ranks admitted in 2021 web based counselling.

Best IT eng colleges
                          Top 20 Engineering(IT)Colleges in Telangana
College Code College Name Branch Place Last Rank (2021)
CBIT CHAITANYA BHARATHI INSTITUTE OF TECHNOLOGY INFORMATION TECHNOLOGY GANDIPET 1919
VASV VASAVI COLLEGE OF ENGINEERING INFORMATION TECHNOLOGY HYDERABAD 2626
VJEC V N R VIGNANA JYOTHI INSTITUTE OF ENGG AND TECH INFORMATION TECHNOLOGY BACHUPALLY 3067
CVRH CVR COLLEGE OF ENGINEERING INFORMATION TECHNOLOGY IBRAHIMPATAN 5551
GRRR GOKARAJU RANGARAJU INSTITUTE OF ENGG AND TECH INFORMATION TECHNOLOGY MIYAPUR 6097
KMIT KESHAV MEMORIAL INST OF TECHNOLOGY INFORMATION TECHNOLOGY NARAYANAGUDA 6695
MGIT MAHATMA GANDHI INSTITUTE OF TECHNOLOGY INFORMATION TECHNOLOGY GANDIPET 6971
SNIS SRINIDHI INSTITUTE OF SCI AND TECHNOLOGY INFORMATION TECHNOLOGY GHATKESAR 7164
VMEG VARDHAMAN COLLEGE OF ENGINEERING INFORMATION TECHNOLOGY SHAMSHABAD 7829
MVSR M V S R ENGINEERING COLLEGE (AUTONOMOUS) INFORMATION TECHNOLOGY NADERGUL 8168
BVRI B V RAJU INSTITUTE OF TECHNOLOGY INFORMATION TECHNOLOGY NARSAPUR 8865
MECS MATRUSRI ENGINEERING COLLEGE INFORMATION TECHNOLOGY HYDERABAD 10926
JNKR JNTU COLLEGE OF ENGINEERING JAGITIAL INFORMATION TECHNOLOGY JAGITIAL 11132
CVSR ANURAG UNIVERSITY (FORMERLY ANURAG GRP OF INSTNS- CVSR COLL OF ENGG) INFORMATION TECHNOLOGY GHATKESAR 11644
CMRK C M R COLLEGE OF ENGG AND TECHNOLOGY (AUTONOMOUS) INFORMATION TECHNOLOGY KANDLAKOYA 12889
IARE INSTITUTE OF AERONAUTICAL ENGINEERING INFORMATION TECHNOLOGY DUNDIGAL 13681
KITS KAKATIYA INSTITUTE OF TECHNOLOGY AND SCI INFORMATION TECHNOLOGY WARANGAL 15188
GNIT GURUNANAK INST OF TECHNOLOGY INFORMATION TECHNOLOGY IBRAHIMPATAN 16111
MREC MALLAREDDY ENGINEERING COLLEGE (AUTONOMOUS) INFORMATION TECHNOLOGY MAISAMMAGUDA 16405
GURU GURU NANAK INSTITUTIONS TECHNICAL CAMPUS (AUTONOMOUS) INFORMATION TECHNOLOGY IBRAHIMPATAN 18696

ఏఐసీటీఈ నిబంధనలు ప్ర‌కారం..: 
కళాశాలలో ఫ్యాకల్టీ నుంచి ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ వరకూ.. అన్నీ నిబంధనల మేరకు ఉన్నాయా? లేదా? అనేది పరిశీలించాలి. ఈ సమాచారం ఏఐసీటీఈ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. ఒకవేళ అందులో సమాచారం లేకపోతే ప్రత్యక్షంగా కళాశాలలను సందర్శించి వివరాలు తెలుసుకోవాలి. 

ఎన్‌బీఏ గుర్తింపు : 
తాము చేరాలనుకుంటున్న బ్రాంచ్‌కు సదరు కాలేజ్‌లో ఎన్‌బీఏ గుర్తింపు ఉందో లేదో కనుక్కోవాలి. ఎన్‌బీఏ గుర్తింపు బ్రాంచ్‌లా వారీగా ఉంటుంది. కొన్ని కళాశాలలు ఒకట్రెండు బ్రాంచ్‌లకే ఎన్‌బీఏ గుర్తింపు ఉన్నా.. ఎన్‌బీఏ అక్రెడిటెడ్‌ అంటూ.. అన్ని వెబ్‌సైట్లలో ఆకర్షణీయంగా ప్రకటనలిస్తున్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

చ‌ద‌వండి: TS EAMCET 2022 Certificate Verification : టీఎస్ ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

కాలేజ్‌కు ఉన్న పేరును..: 
గత ఏడాది సదరు కాలేజ్‌లో సీట్ల భర్తీలో ఓపెనింగ్ క్లోజింగ్‌ ర్యాంకుల వివరాలు గమనించాలి. ఉదాహరణకు యూనివర్సిటీ క్యాంపస్‌ కళాశాలలు సహా పలు ఇన్‌స్టిట్యూట్స్‌లో ఈసీఈ, సీఎస్‌ఈ, ట్రిపుల్‌ఈ వంటి బ్రాంచ్‌లలో లాస్ట్‌ ర్యాంకు 1500 నుంచి 2000 లోపే ఉంటోంది. అంటే..ఆ కళాశాలలు విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయని చెప్పొచ్చు. 

టీచింగ్‌ తీరుతెన్నులపై.. : 
కళాశాలలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ.. టీచింగ్‌ విధానంలో లోపాలు ఉండొచ్చు. ఈ విషయాన్ని కూడా ప్రత్యక్షంగా పరిశీలించాలి. టీచింగ్‌ పరంగా అనుసరిస్తున్న విధానం, ప్రాక్టికల్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యం, అందులో విద్యార్థులను మమేకం చేస్తున్న తీరుతెన్నులపై సునిశిత పరిశీలన చేయాలి. కొన్ని కళాశాలలు ఏఐసీటీఈ నిబంధనల మేరకు తమ కళాశాలలో పీహెచ్‌డీ ఫ్యాకల్టీ సైతం ఉన్నారని ప్రకటనలు ఇస్తుంటాయి.

Telangana Top Computer Science Engineering Colleges(CSE) : అంద‌రి చూపు.. ఈ బ్రాంచ్ వైపే.. ఈ కోర్సులో చేరితే..!

ముఖ్యంగా ప్లేస్‌మెంట్స్ పై..
కళాశాలను ఎంపిక చేసుకునేటప్పుడు గత నాలుగేళ్ల ప్లేస్‌మెంట్స్‌ను పరిశీలించాలి. సదరు కాలేజీకి ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి.వచ్చిన కంపెనీలు ఎలాంటి ఉద్యోగాలు ఆఫర్‌ చేస్తున్నాయో గమనించాలి. కొన్ని కళాశాలలు తమ కళాశాలలకు ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చాయని కలర్‌ఫుల్‌ బ్రోచర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా వచ్చిన ప్రతిష్టాత్మక కంపెనీల్లో కోర్‌ ప్రొఫైల్స్‌లో ఎంతమందికి అవకాశాలు ఇచ్చాయో తెలుసుకోవాలి. ప్రముఖ కంపెనీలు సైతం బీపీఓ, వాయిస్, నాన్‌వాయిస్‌ ప్రొఫైల్స్‌లో ప్లేస్‌మెంట్స్‌ ఇస్తున్నాయి. కోర్‌ జాబ్‌ ప్రొఫైల్‌ ఆఫర్స్‌ సంఖ్య 20 నుంచి 30 శాతం లోపే ఉంటోంది.

న‌చ్చిన బ్రాంచ్‌ రాకుంటే.. ఇలా..
ఎంసెట్‌లో ర్యాంకు వచ్చినా.. మెచ్చిన బ్రాంచ్‌లో సీటు వచ్చే అవకాశం లేకుంటే.. సదరు బ్రాంచ్‌కు అనుబంధంగా ఉండే ఇంటర్‌ డిసిప్లినరీ బ్రాంచ్‌లవైపు దృష్టిసారించొచ్చు. కోరుకున్న బ్రాంచ్‌లో సీటు లభించలేదని నిరుత్సాహానికి గురికాకూడదు.

☛ Best Branches in Engineering : బీటెక్‌లో బెస్ట్‌ బ్రాంచ్ ఏమిటి? ఏ బ్రాంచ్ తీసుకుంటే.. ఎక్కువగా ఉద్యోగావ‌కాశాలు ఉంటాయి.?

నచ్చిన కాలేజ్‌ రాకుంటే..
కోరుకున్న కాలేజ్‌లో ప్రవేశం లభించకున్నా.. స్వీయ అధ్యయనం ద్వారా రాణించేందుకు కృషి చేయాలి. ఫ్యాకల్టీ లేరనో లేదా సదుపాయాలు లేవనో అభ్యసనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సెల్ఫ్‌ లెర్నింగ్‌ టూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెట్‌ ఆధారంగా అనంతమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఈలెర్నింగ్‌ పోర్టల్స్‌ ఆవిష్కృతమవుతున్నాయి. ఆన్‌లైన్‌ లెక్చర్స్, వర్చువల్‌ క్లాస్‌రూమ్స్, వర్చువల్‌ లేబొరేటరీ సదుపాయాలు సైతం లభిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుని తమను తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి.

Published date : 26 Aug 2022 06:42PM

Photo Stories