TS EAMCET 2022 Certificate Verification : టీఎస్ ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..
రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2022 ఆగస్టు 21న ప్రారంభమై, ఆగస్టు 29న ముగియనున్నది. స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. మూడు విడతల్లో ఎంసెట్ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నది.ఈ తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో.. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో.. 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో 80.41 శాతం ఉత్తీర్ణులైన విషయం తెల్సిందే.
Best Branch in Engineering : Btechలో బెస్ట్ బ్రాంచ్ ఏది..? ఎలా సెలక్ట్ చేసుకోవాలి..?
సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు కావాల్సినవి ఇవే..
☛ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC)
☛ టీఎస్ ఎంసెట్ 2022 ర్యాంక్ కార్టు
☛ టీఎస్ ఎంసెట్ 2022 హాల్ టికెట్
☛ మీ ఆధార్ కార్డ్
☛ పదో తరగతి లేదా అందుకు సమానమైన మార్కుల మెమో
☛ ఇంటర్ లేదా అందుకు సమానమైన మెమో కమ్ పాస్ సర్టిఫికేట్
☛ జనవరి 1, 2022 లేదా ఆ తర్వాత జారీ చేసిన ఇన్‌కమ్ సర్టిఫికేట్
☛ తహసీల్దార్ జారీ చేసిన ఈడబ్యూఎస్(EWS) ఇన్‌కమ్ సర్టిఫికేట్, 2022-23 సంవత్సరానికి చెల్లుబాటు అయ్యేది.
TS EAMCET (Engineering) Top-10 Rankers : ఇంజనీరింగ్ విభాగంలో టాప్-10 ర్యాంకర్లు వీరే.. ఈ సారి ఏపీ నుంచే..
☛ అధికారులు జారీ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్
☛ అభ్యర్థికి ఇన్‌స్టిట్యూషల్ ఎడ్యుకేషన్ లేనిపక్షంలో అర్హత పరీక్షకు ముందు 7 సంవత్సరాల కాలానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్.
☛ స్థానికేతర అభ్యర్థులకు సంబంధించి, అన్‌రిజర్వ్‌డ్ సీట్ల కింద కేటాయింపు కోసం వారిని పరిగణనలోకి తీసుకోవాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా ఎంప్లాయర్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
☛ స్లాట్‌లను బుక్ చేసుకోవడానికి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లుతో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీలు అవసరం.
Engineering college Admissions : ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?
ఎంసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ : 21–29.8.22
ధ్రువపత్రాల పరిశీలన : 23–30.8.22
ఆప్షన్ల ఎంపిక : 23.8.22–2.9.22
ఆప్షన్స్ ఫ్రీజింగ్ : 2.9.22
మొదటి దశ సీట్ల కేటాయింపు : 6.9.22
సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్ ద్వారా : 6–13.9.22
రెండో దశ కౌన్సెలింగ్ ప్రక్రియ :
రెండో దశ రిజిష్ట్రేషన్ : 28–29.9.22
ధ్రువపత్రాల పరిశీలన : 30.9.22
ఆప్షన్లు : 28.9.22–1.10.22
సీట్ల కేటాయింపు: 4.10.22
సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్ ద్వారా : 4–8.10.22
టీఎస్ ఎంసెట్-2021 (ఇంజనీరింగ్) కాలేజ్ & ర్యాంక్ ప్రిడిక్టర్ కోసం క్లిక్ చేయండి
తుది దశ కౌన్సెలింగ్ ప్రక్రియ :
స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్: 11–12.10.22
ధ్రువపత్రాల పరిశీలన: 13.10.22
ఆప్షన్లు : 11–14.10.22
సీట్ల కేటాయింపు : 17.10.22
సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజీ రిపోర్టింగ్: 17–21.10.22
స్పాట్ అడ్మిషన్లు : 20.10.22
Engineering Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోసమే!