Skip to main content

Polytechnic Admissions : రాజీవ్‌గాంధీ పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో ప్ర‌వేశానికి ద‌రఖాస్తులు..

Admissions at Rajiv Gandhi Polytechnic College

కశింకోట: కశింకోటలోని ఏపీఈపీడీసీఎల్‌ (పూర్వ ఆర్‌ఈసీఎస్‌) సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో ఉన్న రాజీవ్‌గాంధీ పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యుత్‌ వినియోగదారుల, ఉద్యోగుల పిల్లల 50 శాతం కోటా కింద ప్రవేశానికి దరఖాస్తుల విక్రయం ప్రారంభమైంది. మెకానిక్‌, ఈసీఈ, ఈఈఈ, సివిల్‌ బ్రాంచ్‌లలో ప్రవేశానికి సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్‌ కె.శివ తెలిపారు. పూర్వ ఆర్‌ఈసీఎస్‌ పరిధిలోని ఆసక్తి కలిగిన విద్యార్థులు అవసరమైన పత్రాలు, ఫొటోలు జత చేసి కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. వివరాలకు 9063297220, 9505504220, 0892 4220377 నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ గణేష్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ కె.శివరాం తదితరులు పాల్గొన్నారు.

Gender Equality : పాఠ్య‌పుస్త‌కాల్లో లింగ‌స‌మాన‌త్వ చిత్రాలు.. పిల్ల‌ల‌కు ఇప్ప‌టినుంచే అవ‌గాహ‌న‌.

Published date : 18 Jun 2024 06:24PM

Photo Stories