Best Electrical and Electronics Engineering Colleges : టాప్-20 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(EEE) కాలేజీలు ఇవే..
ఈఈఈ ద్వారా అకడెమిక్‌గా అటు ఎలక్ట్రికల్, ఇటు ఎలక్ట్రానిక్స్.. రెండింటిపైనా పట్టు లభిస్తుంది. ఫలితంగా రెండు రంగాలకు చెందిన పరిశ్రమల్లో కొలువు దీరొచ్చు. అందుకే ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తోంది.. ఈఈఈ బ్రాంచ్. ఈ బ్రాంచ్ విద్యార్థులు నాలుగేళ్ల కోర్సులో భాగంగా.. ఎలక్ట్రికల్ టెక్నాలజీ, మెషిన్స్, మోటార్లు, జనరేటర్లు, సర్క్యూట్ అనాలసిస్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిజమ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఇన్స్‌ట్రుమెంటేషన్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ తదితర అంశాలను చదువుతారు.
Engineering college Admissions : ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?
రానున్న నాలుగేళ్లలో..
జెన్‌కో, ట్రాన్స్‌కో, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్, ఎన్‌హెచ్‌పీసీ, డీఎంఆర్‌సీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు టాటా, సామ్‌సంగ్, రిలయన్స్, సీమెన్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, హిటాచీ, జిందాల్ స్టీల్ అండ్ పవర్ వంటి ప్రైవేట్ కంపెనీల్లోనూ ఈఈఈ అభ్యర్థులు ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ పరంగా విద్యుత్ రంగంలో అమలవుతున్న పథకాలు, ప్రైవేటు రంగంలో ఏర్పాటవుతున్న హైడల్ పవర్ ప్రాజెక్ట్‌ల కారణంగా రానున్న నాలుగేళ్లలో రెండు లక్షల మంది ఈఈఈ ఇంజనీర్ల అవసరం ఉంటుందని అంచనా. మరోవైపు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసే దిశగా సంస్థలు అడుగులు వేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, టీవీలు, వాషింగ్ మెషీన్స్ తదితరాలకు సంబంధించి అసెంబ్లింగ్ యూనిట్ల సంఖ్య దేశంలో పెరుగుతోంది. గత మూడు, నాలుగేళ్లుగా ఎన్‌ఐటీ, ఐఐటీల్లో చేరే విద్యార్థుల మూడో ప్రాథమ్యంగా ఈ బ్రాంచ్ నిలుస్తోంది.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని టాప్-20 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(EEE) బ్రాంచ్‌కు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీల జాబితా మీకోసం..
The below list of Electrical & Electronics Engineering colleges is only for reference. It is prepared based on the last ranks admitted in 2021 web based counselling.
Top 20 Engineering (EEE) Colleges in AP | ||||
College Code | College Name | Branch | Place | Last Rank (2021) |
JNTK | JNTUK COLLEGE OF ENGG. KAKINADA | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | KAKINADA | 9317 |
AUCE | A U COLLEGE OF ENGG. VISAKHAPATNAM | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | VISAKHAPATNAM | 9552 |
ELRU | ELURU COLLEGE OF ENGG AND TECHNOLOGY | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | ELURU | 14602 |
JNTV | JNTUK COLLEGE OF ENGINEERING VIZIANAGARAM | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | VIZIANAGARAM | 15198 |
JNTA | JNTUA COLLEGE OF ENGG. ANANTAPURAMU | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | ANANTAPURAMU | 17229 |
SVUC | S V U COLLEGE OF ENGG. TIRUPATHI | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | TIRUPATHI | 22250 |
GVPE | GAYATHRI VIDYA PARISHAD COLL. OF ENGINEERING | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | VISAKHAPATNAM | 23184 |
CEVP | CHAITANYA ENGINEERING COLLEGE | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | VISAKHAPATNAM | 24683 |
JNTP | JNTUA COLLEGE OF ENGG PULIVENDULA | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | PULIVENDULA | 24811 |
JNTN | JNTUK COLLEGE OF ENGINEERING NARSARAOPETA | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | NARSARAOPET | 25034 |
GMRI | G M R INSTITUTE OF TECHNOLOGY | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | RAJAM | 27190 |
MVRG | M V G R COLLEGE OF ENGINEERNG | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | VIZIANAGARAM | 31020 |
ANIL | ANIL NEERUKONDA INSTITUTE OF TECHNOLOGY AND SCI | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | BHEEMUNIPATNA M | 31138 |
JNTC | JNTUA COLLEGE OF ENGINEERING. KALIKIRI | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | KALIKIRI | 33931 |
RAGU | RAGHU ENGINEERING COLLEGE | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | BHEEMUNIPATNA M | 36943 |
RVJC | R V R AND J C COLLEGE OF ENGINEERING | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | GUNTUR | 39700 |
AVEN | AVANTHI INSTITUTE OF ENGG. AND TECHNOLOGY | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | NARSIPATNAM | 39727 |
GPRE | G P R ENGINEERING. COLLEGE | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | KURNOOL | 40553 |
YGVU | YGVU YSR ENGINEERING COLLEGE | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | PRODDATUR | 41812 |
MJRT | MJR COLLEGE OF ENGG AND TECHNOLOGY | ELECTRICAL AND ELECTRONICS ENGINEERING | PILER | 42211 |
చదవండి: Top Engineering(CSE)Colleges : సీఎస్‌ఈ బ్రాంచ్‌కు టాప్-20 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే..
బ్రాంచ్ ఏదైనా.. ఇదే ముఖ్యం..
ప్రస్తుతం పరిశ్రమ అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే.. సివిల్, సీఎస్‌ఈ, మెకానికల్, ఈసీఈ, ఎలక్ట్రికల్, కెమికల్ బ్రాంచ్‌లు ముందంజలో నిలుస్తున్న మాట వాస్తవమే. ఈ బ్రాంచ్‌లతో సర్టిఫికెట్ సొంతం చేసుకుంటే కొలువులు ఖాయం అనే అభిప్రాయముంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. ఏ బ్రాంచ్ విద్యార్థులైనా ఆ బ్రాంచ్‌కు సంబంధించి ఆధునిక టెక్నాలజీలపై పట్టు సాధించడం లక్ష్యంగా చేసుకోవాలి.