AP EAMCET Counselling 2023 Dates : ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు గమనించాల్సిన అంశాలు ఇవే.. మఖ్యమైన తేదీలు-ఫీజుల వివరాలు ఇవే..
ఆగస్టు 13వ తేదీ నుంచి 14 వరకూ సెల్ఫ్ రిపోర్టింగ్, లేదా నేరుగా కళాశాలకు వెళ్లి రిపోర్ట్ చేయడం, ఆగస్టు 16 నుంచి ఇంజినీరింగ్, ఫార్మసీ తరగతులు నిర్వహిస్తారు.
➤☛ AP EAPCET College Predictor (Click Here)
ఫీజు వివరాలు ఇలా..
ఏపీ ఈఏపీసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు ప్రాసెసింగ్ ఫీజు రూ.1200/-(OC/ BC), రూ.600/- (SC/ST) చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఇంజినీరింగ్ కళాశాలలకు గరిష్ఠంగా రూ.లక్ష, కనిష్ఠంగా రూ.42 వేలు ఫీజు నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఏడాది నుంచి మూడేళ్ల పాటు ఈ ఫీజులు అమలులో ఉంటాయని తెలుస్తోంది.గత మూడేళ్లకు గరిష్ఠంగా రూ. 70వేలు, కనిష్ఠంగా రూ. 35 వేలు ఇంజినీరింగ్ కళాశాలల ఫీజు నిర్ణయించారు.
అయితే ధరల పెరుగుదల, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఫీజులను నిర్ణయించినట్లు తెలిసింది. రూ. లక్ష ఫీజు ఉన్న కళాశాలలు పదిలోపే ఉండగా..అత్యధిక కళాశాలలకు ఫీజు రూ 42వేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://eapcetsche.aptonline.in/EAPCET/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
చదవండి: ఇంజినీరింగ్ సీట్లు.. అత్యధికంగా ఈ బ్రాంచ్ సీట్లపైనే.. అంగట్లో సరుకులా..
AP EAPCET ముఖ్యమైన తేదీలు ఇవే :
☛ ఆన్‌లైన్ ఫీజు పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం : జులై 24 నుంచి ఆగస్టు 03, 2023
☛ ఆన్‌లైన్ వెరిఫికేషన్ కోసం సర్టిఫికెట్స్ అప్‌లోడింగ్ : జులై 25 నుంచి ఆగస్టు 04, 2023
☛ వెబ్ ఆప్షన్లు : ఆగస్టు 03 నుంచి ఆగస్టు 08, 2023
☛ ఆప్షన్లు మార్చుకునే అవకాశం : ఆగస్టు 09, 2023
☛ సీట్లు కేటాయింపు తేదీ : ఆగస్టు 12, 2023
☛ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజీల్లో రిపోర్టింగ్ తేదీలు : ఆగస్టు 13, నుంచి ఆగస్టు 14, 2023
☛ తరగతులు ప్రారంభ తేదీ : ఆగస్టు 16, 2023