Skip to main content

Moonlighting: సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌పై ఐటీ బాంబ్‌... మూన్‌లైటింగ్‌కు పాల్ప‌డిన వారికి ద‌డ‌

కోవిడ్ స‌మ‌యంలో రెండు, మూడు ఉద్యోగాలు చేసుకుని లాభ‌ప‌డిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు ద‌డ ప‌ట్టుకుంది. క‌రోనా కాలంలో అన్ని రంగాలు తిరోగ‌మ‌నంలో ప‌య‌ణిస్తే.. సాఫ్ట్‌వేర్ రంగం మాత్రం దూసుకుపోయింది. ఒక్క‌సారిగా వ‌చ్చిన డిమాండ్‌ను ఉద్యోగులు క్యాష్‌ చేసుకున్నారు.
IT department
సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌పై ఐటీ బాంబ్‌... మూన్‌లైటింగ్‌కు పాల్ప‌డిన వారికి ద‌డ‌

వ‌ర్క్ ఫ్రం హోం కూడా ఇందుకు క‌లిసొచ్చింది. దీంతో ఒక్కొక్క‌రు రెండు, మూడు ఉద్యోగాలు చేసి, భారీగా సంపాదించారు. మూన్ లైటింగ్‌కు పాల్ప‌డిన వారిపై తాజాగా ఐటీ శాఖ ద‌`ష్టి సారించింది.

చ‌ద‌వండి: అంచెలంచెలుగా ఎదుగుతూ.. అగ్ర‌గామిగా నిలుస్తూ... ఏడున్న‌ర్ర ద‌శాబ్దాల‌లో దేశం సాధించిన ప్ర‌గ‌తి ఇలా...

మూన్‌లైటింగ్‌ ద్వారా ఆదాయం పొందిన ఉద్యోగుల్లో చాలా మంది తమ ఆదాయాన్ని ఐటీ రిటర్నుల్లో చూపించలేదు. దీంతో ఆయా ఉద్యోగులకు ఐటీ శాఖ తాజాగా నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతానికి 2019-2020, 2020-2021 ఆర్థిక సంవత్సరాల ఆదాయాలకు సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసినట్లు ఎకనమిక్‌ టైమ్స్ వెల్ల‌డించింది. 

Moonlighting

ఒక కంపెనీలో పూర్తి స్థాయిలో ఉద్యోగిగా పనిచేస్తూనే అదనపు ఆదాయం కోసం మరో సంస్థలో పనిచేసి కొందరు జీతం తీసుకున్నారు. ఇలా చేసిన‌ వారిని గుర్తించి, కొన్ని సంస్థలు ఉద్యోగం నుంచి తొలగించాయి. ఐటీ రిట‌ర్న‌ల్లో మాత్రం ప్రధాన కంపెనీ ఆదాయాన్నే చూపించినట్లు ఐటీశాఖ గుర్తించింది.

చ‌ద‌వండి: డిసెంబ‌ర్ నుంచి నిర్వ‌హించిన ప్ర‌తీ ప‌రీక్ష‌కు ఇదే ప్ర‌తిపాదిక‌.. రోస్ట‌ర్‌పాయింట్ల మేర‌కే ఉద్యోగం

రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు వార్షికాదాయాన్ని రిటర్నుల్లో చూపించని వారికి ఈ నోటీసులు పంపినట్లు ఎక‌న‌మిక్ టైమ్స్ తెలిపింది. మ‌రికొన్ని కంపెనీలు మూన్‌లైటింగ్‌కు పాల్ప‌డిన ఉద్యోగుల వివ‌రాల‌ను స్వయంగా ఐటీ శాఖ దృష్టికి తీసుకెళ్లడం గ‌మ‌నార్హం.  

Published date : 09 Aug 2023 11:31AM

Photo Stories