Skip to main content

TSPSC: డిసెంబ‌ర్ నుంచి నిర్వ‌హించిన ప్ర‌తీ ప‌రీక్ష‌కు ఇదే ప్ర‌తిపాదిక‌.. రోస్ట‌ర్‌పాయింట్ల మేర‌కే ఉద్యోగం

తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాతి నుంచి వివిధ విభాగాల్లో ఏర్ప‌డిన ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. ఇందులో భాగంగా దాదాపు 80 వేల ఖాళీల‌ను గుర్తించి, వాటిని భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసింది. ఇందులో 80 శాతం ఉద్యోగాల‌ను తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) చేప‌డుతోంది.
TSPSC
డిసెంబ‌ర్ నుంచి నిర్వ‌హించిన ప్ర‌తీ ప‌రీక్ష‌కు ఇదే ప్ర‌తిపాదిక‌.. రోస్ట‌ర్‌పాయింట్ల మేర‌కే ఉద్యోగం

ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీలో కీల‌క ప్ర‌క్రియ రిజ‌ర్వేష‌న్ల అమ‌లు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ రాష్ట్రంలో వర్టికల్‌ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అయితే వీటిపై హైకోర్టు విచార‌ణ జ‌రిపి... హారిజంట‌ల్(సమాంతర) రిజర్వేషన్లు అమలు చేయాల‌ని ఆదేశించింది. అలాగే గ్రూప్‌-1లో సమాంతర మహిళా రిజర్వేషన్లు వర్తింపజేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు సూచనల నేపథ్యంలో గ‌తేడాది డిసెంబర్‌ తర్వాత నుంచి  టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షలకు సమాంతర రిజర్వేషన్లను క‌మిష‌న్ వ‌ర్తింప‌జేయనుంది. 

Telangana: ఆ 91 మంది డీబార్‌... వీరంతా ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు అన‌ర్హులే...?

telanaga High Court

ఉద్యోగాల భర్తీకి రోస్టర్‌ పాయింట్ల‌ను కీల‌కంగా తీసుకుంటారు. రోస్టర్ పట్టిక 1-100 పాయింట్లను పరిగణనలోకి తీసుకుని ఓపెన్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులకు కేటాయించిన పోస్టుల్లో మహిళలకు 33 (1/3) శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. ఉద్యోగాల భర్తీలో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల్లో రిజర్వ్‌ చేసిన పాయింట్లలో మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌ జెండర్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయి.

అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగింది?.. Group I పరీక్ష రదు?

telangana

సమాంతర రిజర్వేషన్లన్లను అనుసరించి… రోస్టర్‌ పాయింట్ల ప్రకారం మహిళలకు ఎకువ పోస్టులు వస్తే అవి వారికే ఉంటాయి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగుల కేటగిరీల్లోని మహిళలు జనరల్‌ కోటాలో మెరిట్‌లో ఉద్యోగం సాధిస్తే... ఆ రిజర్వ్‌డ్ కేటగిరీలో మహిళల కోసం ప్రత్యేకంగా పేరొన్న పోస్టులను డీ రిజర్వ్‌ చేస్తారు. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

students

ఉదాహరణకు.. ప‌ది పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారనుకుంటే.. ఇందులో 8, 9, 10 పోస్టులను మహిళలకు రిజర్వ్ చేశార‌నుకుందాం. మ‌హిళ‌లు బాగా చ‌దివి టాప్ స్కోరర్ల‌గా నిలిచి.. మొదటి 3 ఉద్యోగాలను సాధించారనుకుంటే.. ఇక మ‌హిళ‌ల కోసం రిజ‌ర్వ్ చేసిన 8, 9, 10 ఉద్యోగాల‌ను డీ రిజ‌ర్వ్ చేస్తారు. ఇలా డీ రిజ‌ర్వ్ చేసిన వాటికి అదే సామాజికవర్గంలో జనరల్‌ పోస్టులు చేస్తారు. వాటికి మహిళలు, పురుషులు సమానంగా పోటీ పడవచ్చు. పది ఉద్యోగాల్లో ఒకవేళ తొలి ఏడింటిలో 2 పోస్టుల్లో మహిళలు మెరిట్‌ సాధిస్తే.. మహిళలకు కేటాయించిన మిగిలిన 3 పోస్టుల్లో రెండు డీ రిజర్వ్‌ చేస్తారు.

Published date : 09 Aug 2023 11:51AM

Photo Stories