Telangana: ఆ 91 మంది డీబార్... వీరంతా ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులే...?
పేపర్ లీకేజీలో కమిషన్ ఉద్యోగులే కీలకపాత్ర పోషించడంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించింది.
ఇప్పటికే పేపర్ లీకేజీకి సంబంధించిన కేసు విచారణలో ఉంది. లీకేజీకి పాల్పడిన నిందితులను ఇప్పటికే అరెస్టు చేసింది. అయితే తాజాగా వారిని డీబార్ చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 మందిని డీబార్ చేసిన కమిషన్ తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 41 మందిని డీబార్ చేస్తున్నట్లు శుక్రవారం రాత్రి ప్రకటించింది.
ఇవీ చదవండి: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ విడుదల
ఇలా డీబార్ అయిన 91 మంది ఇకపై టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్ష రాసేందుకు వీలుపడదు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిబంధన అమలులో ఉంటుంది. ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఏదైనా వివరణ ఇవ్వాలనుకుంటే రెండ్రోజుల్లో తెలియజేయాలని సూచించింది. నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వకుంటే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేసినట్లు కమిషన్ తెలిపింది.
ఇవీ చదవండి: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 వాయిదా..? అభ్యర్థుల ఆందోళనకు కారణం ఇదే..!
ఇవీ చదవండి: ఆగస్టు 17వ వరకు పోలీసు పరీక్ష ఫలితాలు లేనట్లే... కారణం ఏంటంటే...
తెలంగాణలో గతేడాది నుంచి భారీ ఎత్తున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం చేపట్టింది. సుమారు 80వేల ఖాళీలను గుర్తించి వీటికి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. అయితే ఈ 80 వేల పోస్టుల్లో దాదాపు 75 శాతం ఉద్యోగాలను టీఎస్‌పీఎస్సీనే నిర్వహిస్తుంది. ఇలా డిబార్‌కు గురైన అభ్యర్థులు ఇకపై కమిషన్ నిర్వహించే ఏ ఒక్క పరీక్ష రాసేందుకు అనుమతి ఉండదు.