Skip to main content

TSPSC Group 1 Prelims Final Key 2023 PDF : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫైన‌ల్ కీ విడుద‌ల‌.. మొత్తం 8 ప్రశ్నలు పూర్తిగా తొల‌గింపు..అలాగే 2 ప్రశ్నలకు ఆప్షన్స్‌ మార్పు.. ఫ‌లితాలు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాత‌ప‌రీక్ష‌కు సంబంధించిన ఫైన‌ల్ కీ ని ఆగ‌స్టు 1వ తేదీన విడుద‌ల చేసింది. ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో సమవేశమైన కమిషన్‌.. గ్రూప్‌-1కీ పై చర్చించి ఫైనల్‌ కీని ఖరారు చేసి విడుదల చేసింది.
TSPSC Group 1 Prelims Final Key 2023 Telugu News
TSPSC Group 1 Prelims Final Key 2023

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో సరైన సమాధానాలు లేని కారణంగా ఎనిమిది ప్రశ్నలను పూర్తిగా తొలగించింది. మరో రెండు ప్రశ్నలకు ప్రాథమిక కీలో ఇచ్చిన ఆప్షన్లను మార్చింది.

☛ టీఎస్‌పీఎస్సీ Group-1&2 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

సరైన సమాధానాలు లేని కారణంగా 3, 4, 5, 46, 54, 114, 128, 135 నంబర్‌ గల ప్రశ్నలను తొలగించారు. అలాగే ప్రశ్న నంబర్‌ 38కు ప్రాథమిక కీలో 3 ఆప్షన్‌ను సరైనదిగా ప్రకటించగా, తాజాగా ఆప్షన్‌ 2కు మార్చారు. ప్రశ్నసంఖ్య 59కు ప్రాథమిక కీలో ఆప్షన్‌ 1 సరైనదిగా ఇవ్వగా, తాజాగా ఆప్షన్‌ 3 సరైన సమాధానంగా ప్రకటించారు.

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ కొశ్చ‌న్ పేప‌ర్ & ఫైన‌ల్ 'కీ' కోసం క్లిక్ చేయండి

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్‌ 11న నిర్వహించిన విష‌యం తెల్సిందే. ఈ పరీక్షకు హాజరైన 2,33,506 అభ్యర్థులకు చెందిన డిజిటల్‌ ఓఎమ్మార్‌ షీట్లను, మాస్టర్‌ ప్రశ్నపత్రం, ప్రాథమిక కీని టీఎస్‌పీఎస్సీ జూన్‌ 28న విడుదల చేసింది. ఈ ప్రాథమిక కీపై జూలై 1 నుంచి 5 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఈ అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ పలు ప్రతిపాదనలను కమిషన్‌ ముందు ఉంచింది. ఈ ప్రతిపాదనలను ఆమోదించిన కమిషన్ ఆగ‌స్టు 1వ తేదీన (మంగళవారం) తుది కీని విడుల చేసింది. అలాగే ఈ ఆగ‌స్టు నెలలోనే గ్రూప్‌-1 ఫలితాలు విడుదల కానున్నాయి.

☛ చ‌ద‌వండి: TSPSC Group 3 Exam Pattern : 1365 గ్రూప్‌-3 ఉద్యోగాలు.. ప‌రీక్షా విధానం ఇదే..

మార్కులను మాత్రం 150 మార్కులకే.. కానీ.

tspsc group 1 final key news telugu

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను.. నిపుణుల కమిటీ సూచనల మేరకు టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకున్నది. గ్రూప్‌-1ను 150 మార్కులకు నిర్వహించగా.., తాజాగా 8 ప్రశ్నలను తొలగించడంలో 142 ప్రశ్నలనే పరిగణనలోకి తీసుకుంటారు. మార్కులను మాత్రం 150 మార్కులకే లెక్కిస్తారు. ఈ ప్రక్రియలో ఒక్కో సరైన సమాధానానికి 1.05 మార్కులను కేటాయించే అవకాశాలున్నాయి.

☛ APPSC/TSPSC Group-2 Jobs Success Tips 2023 : గ్రూప్ -2లో అభ్య‌ర్థులు ఎక్కువ‌గా చేసే లోపాలివే.. వీటిని అధిక‌మిస్తే.. విజ‌యం మీదే..!

Published date : 05 Aug 2023 01:34PM

Photo Stories