TSPSC Group-2 Exam Postponed : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 వాయిదా..? అభ్యర్థుల ఆందోళనకు కారణం ఇదే..!
అయితే టీఎస్‌పీఎస్సీ మాత్రం వాయిదా పై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. యథావిధిగా ఈ పరీక్షలను నిర్వహించాలనే ఆలోచనలో టీఎస్‌పీఎస్సీ ఉంది.
కారణం ఇదే..?
ఈ నెల ఆగస్టు 23వ తేదీ వరకు గురుకులం పరీక్షలు, అలాగే సెప్టెంబర్ 12వ తేదీ నుంచి జూనియర్ లెక్చరర్ పరీక్షలు ఉండటంతో.. ఈ గ్రూప్-2 పరీక్షలకు సిద్ధం కావడానికి సమయం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రూప్-3 పరీక్ష తేదీల ఖరారుతోపాటు గ్రూప్-1 మెయిన్స్, కళాశాల లెక్చరర్లు, సంక్షేమ వసతిగృహాల అధికారులు (హెచ్ బ్ల్యూవో), డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని టీఎస్‌పీఎస్సీను ఆశ్రయిస్తున్నారు. ఇదే సమయంలో గ్రూప్-2 పరీక్షలకు సీరియస్ గా సన్నద్ధమయ్యే మరి కొంతమంది అభ్యర్థులు మాత్రం పరీక్షలను వాయిదా వేయొద్దని కోరుతున్నారు.
షెడ్యూల్ ప్రకారమే..
ఈ ఏడాది చివరి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పలు పరీక్షలు జరుగుతుండటం, అక్టోబర్ లో దసరా సెలవులు ఉండటం, ఆ తర్వాత నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో టీఎస్పీఎస్సీ సైతం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నది. ఇప్పటికే గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు తేదీలు అందుబాటులో లేవు.
☛ చదవండి: TSPSC Group 3 Exam Pattern : 1365 గ్రూప్-3 ఉద్యోగాలు.. పరీక్షా విధానం ఇదే..
సంక్షేమ వస తిగృహాల అధికారులు, డీఏవో పరీక్షలదీ ఇదే పరిస్థితి. మరోవైపు గ్రూప్-1 మెయిన్స్ తేదీల ఖరారు టీఎస్పీఎస్సీకి పెద్ద పరీక్షగా మారింది. ఇటువంటి తరుణంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయడం సాధ్యం కాదని ఇటీవల జరిగిన సమావేశంలో కమిషన్ అభిప్రాయపడింది. ఒకసారి పరీక్షను వాయిదావేస్తే మళ్లీ ఈ ఏడాది నిర్వహించడం కష్టమేనని, కనుక ఆగస్టు 29, 30 తేదీల్లోనే గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని కమిషన్ నిర్ణయించినట్టు సమాచారం.
☛ చదవండి: TSPSC Group 2&3 Preparation Tips: లక్షల సంఖ్యలో దరఖాస్తులు ... రెండు పరీక్షలకు ఉమ్మడి వ్యూహంతోనే సక్సెస్
ఒక్కో పోస్ట్‌కు..
మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అంటే.. ఒక్కో పోస్ట్‌కు 705 మంది పోటీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. భారీ స్థాయిలో గ్రూప్-2 ఉద్యోగాలకు పోటీపడుతున్నారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పరీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోజుల్లో మిగతా ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్, కాలేజీలు యధావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది.