Skip to main content

TSLPRB: ఆగస్టు 17వ వరకు పోలీసు ప‌రీక్ష ఫ‌లితాలు లేన‌ట్లే... కారణం ఏంటంటే...

తెలంగాణ పోలీసు నియామక బోర్డు ఫలితాలపై హైకోర్టు విచారణ వాయిదా పడింది. ఆగస్టు 17వ వరకు ఫలితాలు విడుదల చేయవద్దని పోలీసు నియామక బోర్డును ధర్మాసనం ఆదేశించింది. జీవో నెంబర్ 57, 58కు సంబంధించి పరీక్ష రాసిన అభ్యర్థులు హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై గురువారం(ఆగస్టు 3)న హైకోర్టులో విచారణ జరిగింది.
TSLPRB
ఆగస్టు 17వ వరకు పోలీసు ప‌రీక్ష ఫ‌లితాలు లేన‌ట్లే... కారణం ఏంటంటే...

పిటిషనర్ అభ్యంతరాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 17కు వాయిదా వేసింది.

ఇవీ చ‌దవండి: నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌... ఏపీలో 3,295 పోస్టుల భర్తీకి సీఎం జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్‌

police

కాగా, తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో చేపట్టిన ఎస్సై, కానిస్టేబుల్ నియామక ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు దాదాపు పూర్త‌యింది. నేడో, రేపో ఫ‌లితాలు విడుద‌ల చేసేలా అధికారుల చ‌ర్య‌లున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజా తీర్పు ఫ‌లితాల వెల్ల‌డికి బ్రేక్ వేసింది.

ఇవీ చ‌దవండి: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై ముగిసిన వాద‌న‌లు.. తీర్పు రిజ‌ర్వ్ చేసిన హైకోర్టు

police

తెలంగాణ పోలీసుశాఖలోని వివిధ విభాగాలతోపాటు ఆబ్కారీ, రవాణాశాఖల్లో కానిస్టేబుళ్ల భర్తీకి ఏప్రిల్ 30వ తేదీన తుది ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. సివిల్‌, ఏఆర్‌ పోస్టులతోపాటు టీఎస్‌ఎస్పీ, ఎస్పీఎప్‌, ఫైర్‌, జైళ్లశాఖ, ఎక్సైజ్‌, రోడ్డు ట్రాన్స్‌పోర్టు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. 16,321 కానిస్టేబుల్‌ పోస్టులకు ఈ భ‌ర్తీ ప్ర‌క్రియ నిర్వ‌హిస్తున్నారు. అలాగే 554 ఎస్సై, ఏఎస్సై పోస్టుల‌కు నోటిఫికేష‌న్ల‌ను TSLPRB విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

ఇవీ చ‌దవండి: జస్ట్‌ పది పాస్‌తో 30,041 ఉద్యోగాలు... నాలుగు గంటలే పని..

Published date : 04 Aug 2023 10:48AM

Photo Stories