Skip to main content

AP Government Jobs 2023: నిరుద్యోగుల‌కు భారీ గుడ్‌న్యూస్‌... ఏపీలో 3,295 పోస్టుల భర్తీకి సీఎం జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్‌

నిరుద్యోగుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివ‌ర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సూచించారు.
CM Jagan Mohan reddy
CM Jagan Mohan reddy

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: ఏపీలోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో పోస్టుల భర్తీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 3,295 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. దీంతో రెగ్యులర్ సిబ్బంది నియామకాలు చేప‌ట్ట‌నున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియను నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.

చ‌ద‌వండి: 6,840 కొత్త పోస్టుల భ‌ర్తీకి మంజూరుకు ఆమోదం.. అలాగే గ్రూప్‌-1, 2 పోస్టులకు కూడా..

cm ys jagan

➤ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

యూనివర్సిటీల్లో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న సిబ్బందికి వెయిటేజ్ ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాల కల్పనలో భాగంగా.. ఇప్పటికే ప్రపంచస్థాయి కరిక్యులమ్‌ ఏర్పాటు దిశగా సన్నాహాలు సాగుతున్నాయి. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖలో 51 వేల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: ఏపీపీఎస్సీ Group 1&2 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ |ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ 

Published date : 03 Aug 2023 06:36PM

Photo Stories