Skip to main content

Gurukul College Recruitments : గురుకుల క‌ళాశాల‌లో అధ్యాప‌కుల‌ నియామ‌కాలు.. అర్హులు వీరే!

మ‌హిళా గురుకుల క‌ళాశాల‌లో విద్యార్థులకు బోధ‌న అందించేందుకు టీచ‌ర్ల నియామ‌కాలు చేప‌డుతున్నారు. అర్హ‌త, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఈ వివ‌రాల‌ను ప‌రిశీలించండి..
Recruitments of teachers in tribal welfare women's gurukul degree college

సాక్షి ఎడ్యుకేష‌న్: నగర శివారులోని నాగారంలో గల గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్రం, సూక్ష్మ జీవశాస్త్రం, స్టాటిటిక్స్ స‌బ్జెక్టుల్లో బోధించేందుకు ఉపాధ్యాయుల నియామ‌కాలు చేప‌డుతున్నారు. సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. పీహెచ్డీ, నెట్, సెట్ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

Job Mela : ఈనెల 30వ తేదీన జాబ్ మేళా.. వేత‌నం ఎంతంటే..!

వచ్చే నెల 2న డెమో తరగతులు నిర్వహించి పూర్తి పారదర్శకంగా అభ్యర్థులను మెరిట్ ఆధారంగా రీజినల్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలోని కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామ‌ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సైదా జైనబ్ శుక్రవారం ప్ర‌క‌టించారు. అర్హులు, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Dec 2024 11:03AM

Photo Stories