Skip to main content

Job Mela : ఈనెల 30వ తేదీన జాబ్ మేళా.. వేత‌నం ఎంతంటే..!

నిరుద్యోగులు, చ‌దువు పూర్తి చేసుకున్న యువ‌త‌కు గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లో మ‌రో జాబ్ మేళా జ‌ర‌గ‌నుంది.
Job mela at govt abr degree college  Job fair announcement for unemployed youth in Andhra Pradesh  District Skill Development Officer P. Pranay announces job fair Job fair organized by Andhra Pradesh State Skill Development Organization

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పి.ప్రణయ్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ జాబ్‌మేళాలో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌ఐసీ, డక్ట్స్‌ బిజినెస్‌ సొల్యూషన్‌, ఆక్రో సాఫ్ట్‌ సొల్యూషన్‌ కంపెనీల ప్రతినిధులు వందకు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. జాబ్ మేళాను ఈనెల 30వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు. దీనిలో అభ్య‌ర్థుల విద్యార్హతను బట్టి వేతనం రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుందన్నారు.

APSRTC Jobs Notifications : ఏపీ ఆర్టీసీలో 11,500 ఉద్యోగాలు.. నోటిఫికేష‌న్ మాత్రం అప్పుడే..? కానీ ఈలోపు..

ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిగ్రీ, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీ చదివిన 18 - 35 ఏళ్ల వయస్సు కలిగిన నిరుద్యోగ యువత అర్హుల‌ని, వారు ఈ మేళాకు దరఖాస్తు చేసుకోవాలని వివ‌రించారు. పట్టణంలోని ప్రభుత్వ ఏబీఆర్‌ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. అర్హ‌త‌, ఆసక్తి గల వారు తమ బయోడేటా, విద్యా సర్టిఫికెట్‌లు, ఆధార్‌ జిరాక్స్‌లు, పాస్‌పోర్టు ఫొటోలతో  ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు 90323 84374 ఫోను నంబరులో సంప్రదించాలని కోరారు. ఈ అవ‌కాశాన్ని ప్ర‌తీ నిరుద్యోగి స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Dec 2024 10:49AM

Photo Stories