AP Intermediate Exams 2025: ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. శనివారం ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కావడంతో గంట ముందుగానే 8 గంటలకు విద్యార్దులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్దులను 8.30 గంటల నుంచి పరీక్ష హాల్ లోకి అనుమతించారు.
AP Intermediate Exams 2025
విద్యార్దులను క్షుణ్ణంగా పరిశీలించి, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి అనుమతించలేదు. విద్యార్దులను తనిఖే చేసి లోపలికి అనుమతించారు. మొదటి పరీక్ష కావడంతో విద్యార్థులతో పాటు తల్లితండ్రులు వారి వెంట వచ్చారు.
ఈ విద్యా సంవత్సరంలో 10,58,893 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్‌కు 44,581 మంది ఉన్నారు.
రెండో ఏడాది విద్యార్థులు జనరల్ 4,71,021 మంది, ఒకేషనల్‌కు 42,328 మంది ఉన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు పరీక్షల విభాగం కంట్రోలర్ (సీవోఈ) సుబ్బారావు తెలిపారు.