Skip to main content

AIIMS Recruitment with 4,576 Posts : టెన్త్ అర్హ‌త‌తోనే ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. 4,576 పోస్టుల‌కు నోటిఫికేస‌న్..

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త ప్ర‌క‌టించింది ఎయిమ్స్‌.. ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.
Job notification at aiims with 4576 posts  AIIMS vacancies 2025 notification details

సాక్షి ఎడ్యుకేష‌న్: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త ప్ర‌క‌టించింది ఎయిమ్స్‌.. ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇక్క‌డ భారీ పోస్టులు ఖాళీగా ఉండ‌డంతో భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేప‌న్ జారీ చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న నిరుద్యోగుల‌కు ఉద్యోగాలను సాధించాలని ఉందా.. అయితే ఎయిమ్స్ నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. ఈ మంచి అవ‌కాశాన్ని వినియోగించుకోవాలంటూ ప్ర‌క‌టించారు.

ఖాళీల వివ‌రాలు: మొత్తం 4,576 ఉద్యోగాలు.

Jobs In Amazon: అమెజాన్‌లో భారీ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ పూర్తి వివరాలివే!

పోస్టులు: గ్రూప్ బీ, గ్రూప్ సీ తోపాటు ఫార్మాసిస్ట్ లు, నర్సింగ్, పబ్లిక్ హెల్త్ నర్సెస్, అసిస్టెంట్ ఇంజినీర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, మల్టీటాస్కింగ్ స్టాఫ్..

వయోపరిమితి: 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాలు. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితి పొడిగింపు కూడా ఉంది.

అర్హతలు: పోస్టులను బట్టి కొన్ని, టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లోమా సర్టిఫికెట్ క‌లిగిన‌వారు.

ద‌ర‌ఖాస్తుల విధానం:

  1. అభ్యర్థులు ఎయిమ్స్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. 
  2. వ్యక్తిగత ఆధారాలు పొందుపరిచి రిజిస్ట్రేషన్ ఫామ్‌ను నింపాలి. 
  3. యూనిక్ రిజిస్ట్రేషన్ ఐడీ వస్తుంది. ఆ ఐడీ ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపాలి. 
  4. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో పే చేయాలి. 
  5. ఆ తర్వాత అప్లై ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల విధానం: అన్ని రకాల పోస్టులకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.

Siddharth Solutions Hiring Freshers: డేటా అనలిస్ట్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేది ఇదే

ద‌ర‌ఖాస్తుల‌ చివ‌రి తేదీ: జనవరి 31

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ విద్యార్థులు- రూ. 3వేలు

ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు- 2 వేలు

ఫీజును ఆన్ లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Jan 2025 10:07AM

Photo Stories